ETV Bharat / state

మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు - అల్లర్లకు తావులేకుండా భారీ బందోబస్తు - Counting Start Next Few Hours - COUNTING START NEXT FEW HOURS

Vote Counting Process Start Next Few Hours: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లో మూడంచెలు, ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లకు తావులేకుండా గట్టి చర్యలు చేపట్టారు.

Vote Counting Process Start Next Few Hours
Vote Counting Process Start Next Few Hours (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 7:27 AM IST

మరికొన్ని గంటల్లో మొదలుకానున్న ఓట్ల లెక్కింపు - అల్లర్లకు తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు (ETV Bharat)

Vote Counting Process Start Next Few Hours: ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. కౌంటింగ్‌కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ క్షణాల కోసం అభ్యర్థులతోపాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డేగ కన్నేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత పెడితే మరికొన్ని చోట్ల ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లకు తావులేకుండా గట్టి చర్యలు చేపట్టారు. విజయవాడలో ఓట్ల లెక్కింపు జరిగే నిమ్రా, నోవా కళాశాలల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్రాల్లోకి అభ్యర్థులు, వారి అధీకృత లెక్కింపు ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. అసాంఘిక శక్తులు ప్రవేశిస్తే వారిని గుర్తించేందుకు వీలుగా సీసీటీవీ కెమెరాలతోపాటు ఫేషియల్‌ రికగ్నేషన్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు.

కౌంటింగ్‌ కేంద్రంలోకి పెన్ను,పేపరును మాత్రమే అనుమతిస్తాం- సీఈవో మీనా - CEO Review on Counting Arrangements

ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా చర్యలు: ఎన్టీఆర్​ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల కోసం 3 వేల మంది విధుల్లో ఉండనున్నారు. 4,5 తేదీల్లో విజయోత్సవాలు, ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌, సెక్షన్‌ 30 అమలులో ఉంటాయని విజయవాడ సీపీ రామకృష్ణ వెల్లడించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మూడంచెల భద్రత మధ్య విజయవాడ పార్లమెంటు పరిధిలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చెప్పారు. సిబ్బంది నియామకం, ర్యాండమైజేషన్ పూర్తి చేశామన్నారు.

విశాఖలోనూ కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంది. బందోబస్తు కోసం 232 మంది పోలీసులను నియమించారు. 139 పికెట్ పాయింట్స్, 79 పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో ఉంచారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనుమతించబోమని విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజున మద్దిలపాలెం కూడలి ఆర్చ్​ నుంచి మూడోవ పట్టణ పోలీస్ కూడలి రోడ్డు వరకు రాకపోకలు నిలిపేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

కౌంటింగ్​ భద్రత ఏర్పాట్లలో అధికారులు - ఈ నెల 6 వరకు 144 సెక్షన్‌ అమలు - Counting Arrangements in AP

సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు: అనంతపురం జేఎన్టీయూలో 8 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరగనుంది. నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్ గదిలోకి ప్రవేశించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంటలలోపే ఉరవకొండ ఓట్ల లెక్కింపు పూర్తి చేసి తుది ఫలితం ప్రకటిస్తామన్నారు. అల్లూరి జిల్లా పాడేరులో తొలిసారిగా కౌంటింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఘాట్ మార్గంలో భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. కౌంటింగ్ కేంద్రాలకు 100 అడుగుల దూరంలోనే వాహనాలు పార్క్ చేయాలని సీఐ తెలిపారు.

సీసీటీవీ, ఫేషియల్‌ రికగ్నేషన్‌ కెమెరాలు ఏర్పాటు: కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ రోజు బలుసుతిప్ప, పల్లం గ్రామాల్లో వైసీపీ, తెలుగుదేశం శ్రేణుల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రెండు గ్రామాలపై డ్రోన్ వ్యవస్థ ద్వారా నిఘా పెట్టారు. ప్రధాన పార్టీల కార్యకర్తల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజులపాటు మద్యం అమ్మకాల నిలిపివేయాలని ఈసీ ఆదేశించడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

మద్యం దుకాణాలు బంద్ చేయాలని నిర్దేశించారు. బెల్ట్ షాప్‌లు మూతపడనుండటంతో ఆదివారం యానాంలోని మద్యం దుకాణాలకు మందుబాబులు క్యూ కట్టారు. కౌంటింగ్ సందర్భంగా సామాజిక మాధ్యమాలపైనా అధికారులు నిఘా పెంచారు. అనుచిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అవాస్తవాలు, వదంతులు వ్యాప్తి చేసేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కౌంటింగ్‌ రోజున తెనాలిలో ఘర్షణలు జరిగే అవకాశం- నాదెండ్ల మనోహర్ - Nadendla guided to alliance leaders

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.