ETV Bharat / state

సహాయక చర్యలతో వరద బాధితులకు బాసట - Help to Vijayawada Flood Victims

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 7:51 AM IST

Voluntary Organizations and Donors Help to The Vijayawada Flood Victims : వరద తాకిడికి అతలాకుతలం అయిన విజయవాడ వాసులకు సహాయం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా రంగంలోకి దిగింది. ఇటువంటి విపత్కర పరిస్థుతుల్లో దాతలు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి పారిశుద్ద్య సహా పలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు.

relief_measures_in_vijayawada
relief_measures_in_vijayawada (ETV Bharat)

Relief Measures in Vijayawada : వరద బీభత్సంతో అల్లాడిన విజయవాడ ప్రజలకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందిస్తున్న సహాయ చర్యలు దన్నుగా నిలుస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది బురద కడిగేసే పనిలో నిమగ్నమవగా పారిశుద్ధ్య సిబ్బంది చెత్తని తొలగిస్తున్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకాన అన్ని శాఖలు సమన్వయంగా వరద బాధితులకు బాసటగా నిలుస్తున్నారు.

Voluntary Organizations and Donors Help to The Vijayawada Flood Victims : వరదతో అతలాకుతలమైన విజయవాడకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మోకాలు నుంచి నడుము లోతు నీరు నిలిచి ఉంది. దీంతో చాలా మంది అపార్ట్‌మెంట్‌లలోని పై అంతస్తుల్లో తలదాచుకుటున్నారు. ఇలాంటి వారి కోసం ఎన్డీఆర్​ఎఫ్​ (NDRF), ఎస్​డీఆర్​ఎఫ్​ (SDRF) సిబ్బంది బోట్లు, ట్రాక్టర్ల సహాయంతో ఆహారం, తాగునీరు, మందులు అందిస్తున్నారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు పర్యటిస్తూ సహాయ కార్యక్రమాలను వేగవంతం చేయిస్తున్నారు. బాధితుల కష్టనష్టాలను తెలుసుకుని మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు.

కేంద్రం వరద సాయం - తెలుగు రాష్ట్రాలకు రూ.3,300 కోట్లు - central govt announce flood relief

వివిధ జిల్లాల నుంచి వచ్చిన అన్ని శాఖల సిబ్బంది, యువత, స్వచ్ఛంద సంస్థలు బృందాలుగా విడిపోయి సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రహదారులపై పేరుకుపోయిన బురదను అగ్నిమాపక సిబ్బంది శకటాల సాయంతో శుభ్రంగా కడిగేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది రహదారులు, కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి, పూడికలు తీసి వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్‌ చల్లుతున్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రతి కాలనీలో శిబిరాలు నిర్వహించి అత్యవసర మందుల కిట్లు అందిస్తున్నారు.

'మాది కర్నూలు జిల్లా కోడుమూరు వరద బాధితులకు సహయం చెయ్యడానికి మేము ఎనిమిది మందిమి వచ్చాము. సైడ్​ కాల్వలు తియ్యడం, రోడ్డుపై ఉన్న చెత్త తీసేస్తాం. టాక్టర్లు, లారీలలో చెత్త తీసుకెళ్తాం. ఇలాంటి పరిస్థితుల్లో సహాయం అందించి బాధితులకు అండగా నిలవడం ఆనందంగా ఉంది.' - పారిశుద్ధ్య కార్మికులు

యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు- సీఎం సహా యంత్రాంగమంతా అహర్నిషలు కృషి - Govt Mission for save Vijayawada

విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ లేనిచోట్ల తాగునీరు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు అందిస్తున్నారు. వరద ఉద్ధృతికి తాగునీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. నీటి సరఫరా స్తంభించడంతో ట్యాంకులు, వాటర్‌ బాటిళ్లతో తాగునీరు అందిస్తున్నారు. మరోవైపు సీఎం ఆదేశాలతో బాధితులకు ఆరు రకాల నిత్యావసరాల సరకులు పంపిణీ కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.