ETV Bharat / state

ఏం అభివృద్ధి చేశారు ? మళ్లీ ఏం చెప్పడానికి వస్తున్నారు ? - జగన్​ను ప్రశ్నిస్తున్న విజయనగరంవాసులు - People Problems in Jagan Government

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 12:34 PM IST

Vizianagaram People Problems in Jagan Government : ముఖ్యమంత్రే స్వయంగా హామీ ఇచ్చారు. ఇంకేం అభివృద్ధికి అడుగులు పడినట్లేనని ఉమ్మడి విజయనగరం జిల్లా వాసులంతా భావించారు. అధికారులూ అంతే వేగంగా ప్రగతి పనులకు ప్రతిపాదనలు పంపారు. కానీ ఒక్క పని జరిగితే ఒట్టు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో సీఎం హామీలిచ్చిన పనులు నేటికీ పట్టాలెక్కకపోగా గత ప్రభుత్వ హయంలో చేపట్టిన వాటినీ నడిసంద్రంలో ముంచేశారు. తెల్లారి లేస్తే 99 శాతం హామీలు నెరవేర్చిన ప్రభుత్వం తమదేనని డబ్బా కొట్టుకునే జగన్​ ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని జిల్లాకు వస్తారని విజయనగరం వాసులు ప్రశ్నిస్తున్నారు. "మళ్లీ నిన్ను నమ్మం జగనన్నా"అంటున్నారు.

vizianagaram_people_problems_in_jagan_government

Vizianagaram People Problems in Jagan Government : ‘అన్నదాతలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుందని ప్రభుత్వాలు బలంగా ఉంటాయని రాజశేఖరరెడ్డి బిడ్డ అధికారంలోకి వస్తే తోటపల్లి కుడి, ఎడమ కాలువలు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానంటూ 2018లో విజయనగరం జిల్లా పాదయాత్రలో జగన్‌ రైతులకు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్కటీ అమలు చేయలేదు. టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేసి హడావుడి చేశారు తప్ప ముందడుగు లేదు. కీలకమైన ప్రాజెక్టులకు నిధులివ్వకుండా పక్కన పెట్టారు. ‘ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు టెంకాయ కొడితే మోసమంటారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లకే టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారు’ అంటూ సూక్తి ముక్తావళి వినిపించిన జగన్‌ నాలుగేళ్ల పాటు జాప్యం చేసి ఎన్నికలకు ఏడాది ముందు శంకుస్థాపనలు చేశారు. కీలకమైన ప్రాజెక్టులకు నిధులివ్వకుండా పక్కనపెట్టిన సీఎం ఏం అభివృద్ధి చేశారని చెప్పడానికి జిల్లాకు మళ్లీ వస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఏం అభివృద్ధి చేశారు ? మళ్లీ ఏం చెప్పడానికి వస్తున్నారు ? - జగన్​ను ప్రశ్నిస్తున్న విజయనగరం రైతులు

తోటపల్లి ప్రాజెక్టుకు నిధులివ్వకుండా రైతులను జగన్‌ దగా చేశారు. నాగావళిపై తోటపల్లి ప్రాజెక్టు పూర్తికి బడ్జెట్‌లో కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రాజెక్టుపై సమీక్షించే తీరిక సీఎంకే కాదు జిల్లా మంత్రులకూ లేకపోయింది. ఇప్పటికీ పునరావాస సమస్యలు వెంటాడుతున్నాయి. అసంపూర్తి పనులు వెక్కిరిస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నాగావళిపై తోటపల్లి వద్ద జలాశయం నిర్మాణానికి టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దీంతోపాటు తోటపల్లి రెగ్యులేటర్‌ కింద సాగవుతున్న 64 వేల ఎకరాలకు సాగునీటిని స్థిరీకరించాలని నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలోని 132 గ్రామాల పరిధిలో 64 వేల 36 ఎకరాలకు, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 155 గ్రామాల్లో 67వేల 912 ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. గజపతినగరం బ్రాంచి కాలువ ద్వారా మరో 10 వేల ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు. ఆ తరువాత వచ్చిన రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సత్వర సాగునీటి ప్రయోజన పథకం లో చేర్చినా పనులు ముందుకెళ్లలేదు. ప్రాజెక్టు అంచనా వ్యయం 480 కోట్ల నుంచి 800 కోట్లకు పెరిగింది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో ప్రాజెక్టు పనులకు 287 కోట్లు వెచ్చించారు. 2019 నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 465 కోట్లు కేటాయించి 61 కోట్లే వెచ్చించింది. నిధులివ్వకపోవడంతో ప్రాజెక్టు పడకేసింది.

No Development in Vizianagaram : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను జగన్‌ ప్రభుత్వం నాలుగేళ్లు పక్కనపెట్టి ఎన్నికలకు ఏడాది ముందు హడావుడి చేసింది. విమానాశ్రయాన్ని పీపీపీ విధానంలో పూర్తి చేయాలని టీడీపీ హయాంలో నిర్ణయించారు. 2019 ఫిబ్రవరి 14న అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత వచ్చిన వైకాపా సర్కారు నాలుగేళ్లపాటు దీని ఊసెత్త లేదు. ఎట్టకేలకు గతేడాది మే 3న సీఎం జగన్‌ విమానాశ్రయ పనులకు మళ్లీ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం సేకరించిన సుమారు 2వేల 700 ఎకరాల్లో 500 ఎకరాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకుని మిగిలిన 2వేల 200 ఎకరాలను విమానాశ్రయం నిర్మాణానికి కేటాయించారు. ఎయిర్‌పోర్టుకు తారకరామతీర్థసాగర్‌ నుంచి నీటి సరఫరాకు 198 కోట్లతో పనులు పూర్తి చేస్తామని ప్రకటించి రూపాయి మంజూరు చేయలేదు. విమానాశ్రయానికి భూములిస్తే పరిహారంతోపాటు అర్హులైన వారికి ఉపాధి కల్పిస్తామన్న మాటలు నీటిమూటలయ్యాయి. నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం కొత్త ఇళ్ల పునాదుల పనులకే సరిపోలేదు. వలస వెళ్లిన వారికి, గ్రామాలు ఖాళీ చేసేనాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కల్పిస్తామని జగన్ మోసం చేశారు.

జగన్​ అహంకారి - విధ్వంసం, వినాశనమే తప్ప అభివృద్ధి చేతకాదు : చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING

Farmers Problems in Vizianagaram District : విభజన చట్టంలో రాష్ట్రానికి దక్కిన ప్రతిష్ఠాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులు సీఎం జగన్‌ నిర్వాకంతో ఇప్పటికీ పూర్తి కాలేదు. టీడీపీ హయాంలో రూపొందించిన ప్రణాళికను యథాతథంగా అమలుచేసి ఉంటే ఈపాటికే భవనం అందుబాటులోకి వచ్చేది. టీడీపీ హయాంలో కొత్తవలస మండలం రెల్లిలో వర్సిటీని నిర్మించాలని నిర్ణయించారు. 526 ఎకరాలు సేకరించి శంకుస్థాపన చేశారు. భూమి చుట్టూ 10 కోట్లతో ప్రహరీ నిర్మించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వర్సిటీ ఏర్పాటు విషయంలో సీఎం జగన్‌ అక్కసుతో వ్యవహరించారు. చంద్రబాబు శంకుస్థాపన చేసిన చోట కాకుండా గిరిజన ప్రాంతంలో నిర్మిస్తామని చెప్పి మెంటాడ మండలం కుంటినవలస సమీపంలో గతేడాది ఆగస్టు 25న కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. మళ్లీ భూములు సేకరించి కోట్ల పరిహారం చెల్లించారు. ఇందులో వైఎస్సార్సీపీ కీలక ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై పరిహారం సొమ్ము పక్కదారి పట్టించారు. శంకుస్థాపన జరిగినా పనుల్లో ముందడుగు పడలేదు. టీడీపీ హయాంలో 525.08 కోట్లతో వేసిన అంచనా వ్యయం, పనుల్లో జాప్యంతో 834 కోట్లకు పెరిగింది. కొత్తవలస మండలంలో గుర్తించిన ప్రాంతం వర్సీటీ ఏర్పాటుకు అనుకూలమేనని కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ స్థల ఎంపిక కమిటీ చెప్పినా అక్కడినుంచే మార్చేందుకే సీఎం జగన్‌ నిర్ణయించారు. దీంతో రెల్లిలో సేకరించిన స్థలంలో ప్రహరీ నిర్మాణానికి వెచ్చించిన 10 కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.

అక్రమార్జనలో దూసుకుపోతున్న 'బండి' - ఆ కోటలో ఎవరైనా 'ఎస్'​ బాస్ అనాల్సిందే!

'తారకరామతీర్థసాగర్‌ పనులు రెండేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని 2020 డిసెంబరులో సీఎం జగన్‌ హామీ ఇచ్చి మాట తప్పారు. పెండింగ్‌ పనుల పూర్తికి 620 కోట్లు మంజూరు చేస్తానని చెప్పి అరకొరగా 50 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లోని 49 గ్రామాల్లో 24వేల 710 ఎకరాలకు సాగు నీరు, విజయనగరానికి తాగునీరు అందించేలా తారకరామతీర్థసాగర్‌ ప్రాజెక్టును రూపొందించారు. గుర్ల మండలం కోటగండ్రేడు వద్ద చంపావతి నదిపై బ్యారేజీ, కుమిలిలో జలాశయం పనులు పూర్తి కాలేదు. మిగిలిన భూసేకరణ, పునరావాస కార్యకలాపాలపై నిర్లక్ష్యం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు 2 వేల మందికిపైగా ఉన్నారు. రైతులతోపాటు ఆ భూములపై ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు జీవనోపాధి కోల్పోయారు. గత ఎన్నికల్లో ప్రస్తుత నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే నిర్వాసిత కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయిస్తానని మోసం చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఇటీవల సారిపల్లి వెళ్లిన ఎమ్మెల్యే అప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను నిలదీశారు.' -బాధిత రైతులు

సహకార చక్కెర కర్మాగారాలను ఆధునికీకరిస్తానని రైతన్నలకు అండగా ఉంటానన్న జగన్‌ వాటిని గాలికొదిలేశారు. రైతులు పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరి చేశారు. ఎన్నికల సందర్భంగా ఓట్లు అడగడానికి జిల్లాకు వస్తున్న జగన్ అప్పట్లో ఇచ్చిన హామీలపై ఏం సమాధానం చెబుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అక్రమమైన సక్రమమైన ఆ వైఎస్సార్సీపీ నేతకు కప్పం కట్టాల్సిందే! - YCP leader irregularities in AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.