ETV Bharat / state

'పేదింటి జగన్​ రెడ్డి' రుషికొండ రాజమహల్​లో కళ్లు చెదిరే నిర్మాణాలు - Vizag Rushikonda Palace - VIZAG RUSHIKONDA PALACE

Rushikonda palace : ఒకప్పుడు రాజులు నిర్మించుకునే ప్యాలెస్‌కు ఏ మాత్రం తీసిపోకుండా భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి ఎంత గొప్పగా ఏపీలో గత పాలకుడు జగన్​ రెడ్డి రుషికొండపై నిర్మించారో! ప్రతిపక్షాల్ని, ప్రజల్ని, ఎవ్వరినీ కొండ దరిదాపుల్లోకి కూడా రానీయకుండా రూ.450 కోట్లతో భవనాల నిర్మాణం జరిగింది. వైఎస్సార్సీపీ నాయకులకే కాంట్రాక్టు ఇచ్చి ఏడు భవన సముదాయాలను పూర్తి చేశారు. అదేదో నిషేధిత ప్రదేశంలా ఎవ్వరినీ రానియ్యకుండా నిర్మాణాలు చేపట్టారు.

Rushikonda palace
Rushikonda palace (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 16, 2024, 9:06 PM IST

Vizag Rushikonda Palace : ఏపీలో ఎన్నికలు పేదోడికి, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధమని మాటలతో కలరింగ్ ఇచ్చిన జగన్​ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో రుషికొండకు బోడిగుండు కొట్టి నిర్మించిన భవనాలపై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. రుషికొండ మీద రూ.500 కోట్లతో పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లో ఫర్నిచర్​, అడుగు అడుగున బంగారు తొడుగులు చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి.

Rushikonda palace
రుషికొండ ప్యాలెస్​ (ETV Bharat)

ఇక రూ.26 లక్షల విలువచేసే బాత్ టబ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారింది.' అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్‌గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేశాడు' అంటూ టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా వెతికే కొద్దీ ఇటువంటి ప్రజల సొమ్ము తో వృధా చేసిన ఘోరాలు దారుణాలు ఇంకా ఎన్ని ఘోరాలు బయట పడతాయో అని సామాన్య జనం చర్చించుకుంటున్నారు.

Rushikonda palace
రుషికొండ ప్యాలెస్​ (ETV Bharat)

పచ్చదనంతో కళకళలాడే రుషికొండను బోడి కొండగా మార్చి విలాసవంతమైన భవనాలు నిర్మించారు. మాయాబజార్‌ సినిమాలోని మైసభను తలపిచేలా పెద్దపెద్ద గదులు, హాల్స్‌, ఫన్నీచర్‌తో నింపేశారు. అనుమతులు లేకపోయినా.. జగన్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. సర్వత్రా విమర్శలు రావడంతో పర్యాటక భవనాలని తొలుత ప్రచారం చేసి తర్వాత పరిపాలన భవనాలని ప్లేట్‌ మార్చేశారు. తీరా ఇప్పుడు అధికారం మారిపోవడంతో ఆ భవానాల గుట్టు బయటపడింది. ఏడు బ్లాక్‌లుగా భవనాలు నిర్మించగా కళింగ బ్లాక్‌లోనే సీఎం క్యాంప్ ఆఫీస్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, 52 మంది కూర్చొనే కంట్రోల్ రూం, 175 మంది కూర్చొనే సభ మందిరం నిర్మించారు. అత్యంత ఖరీదైన ఫర్నీచర్‌తో కోట్లు కుమ్మరించి నిర్మించారు.

Rushikonda palace
రుషికొండ ప్యాలెస్​ (ETV Bharat)

విశాఖలో వైఎస్సార్సీపీ పాలనలో నిర్మించిన రుషికొండ భవనాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూటమి పార్టీల శ్రేణులతో కలిసి పరిశీలించారు. రూ.450 కోట్లు కుమ్మరించి ఈ భవనాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించింది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పూర్తి చేసిన ఆ నిర్మాణం దేనికోసమో ఆ శాఖ అధికారులు కాదు కదా వాటిని ప్రారంభించిన మంత్రులు కూడా చెప్పలేదు. దీంతో ఇదేమైనా "రాజకోట రహస్యమా" అని విమర్శలు వినిపించాయి.

Rushikonda palace
రుషికొండ ప్యాలెస్​ (ETV Bharat)

వేంగి ఎ, వేంగి బి, కళింగ, గజపతి, విజయనగరం ఏ, బీ, సీ ఇలా మొత్తం ఏడు బ్లాకుల్లో రిసెప్షన్‌, రెస్టారెంట్లు, బ్యాంకెట్‌హాళ్లు, గెస్ట్‌ రూములు, ప్రీమియం విల్లా సూట్స్‌, స్పా, ఇండోర్‌ గేమ్స్‌, ఫిట్‌నెస్‌ సెంటర్‌, బ్యాక్‌ ఆఫీస్‌ వంటివి అభివృద్ధి చేశారు.

Rushikonda palace
రుషికొండ ప్యాలెస్​ (ETV Bharat)

రుషికొండపై పర్యాటక రిసార్టు నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. నిక్షేపంగా ఉన్న ‘హరితా హిల్‌ రిసార్టు’ భవనాలు పాతవైపోయాయని కూల్చేశారు. కొండను అక్రమంగా తవ్వేస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నారని నిపుణులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఎంత గగ్గోలు పెట్టినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు కొండను తవ్వేసి బోడిగుండు చేసేశారు. న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టినా పట్టించుకోకుండా ముందుకెళ్లారు. నిపుణుల కమిటీ రుషికొండపై సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు జరిగాయని తేల్చినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎంతో హడావుడి చేసి, ఎంత మంది అడ్డుచెప్పినా పెడచెవిన పెట్టి, వాయువేగంతో నిర్మాణం పూర్తి చేసింది.

Rushikonda palace
రుషికొండ ప్యాలెస్​ (ETV Bharat)

రుషికొండపై హడావుడిగా 'ప్యాలెస్‌' - వినియోగంపై స్పష్టతేదీ జగన్?

'ఎవరి కోసం ఈ విలాస భవనాలు?'- రుషికొండ రాజమహల్​ను పరిశీలించిన కూటమి నేతలు - Rushikonda building visuals

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.