Villagers Suffering Due to Damage of Upputeru Bridge in Donkuru : ఆ వంతెన చూడడానికి చిన్నదే కావచ్చు. కానీ దాని అవసరం చాలా పెద్దది. ఒకట్రెండు కాదు ఏకంగా 14 మత్స్యకార గ్రామాల ఉపాధి, రాకపోకలకు అదే ఆధారం.! అలాంటి వంతెన బీటలు వారిన పిల్లర్లు, తుప్పు పట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలతో ఎప్పుడు కూలుతుందో తెలియడం లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు దానిపై ప్రయాణాలు సాగిస్తున్నారు.
Upputeru Bridge is in Dire Straits Passengers in Deep Trouble : ప్రతీ వర్షాకాలంలో ఈ కష్టాలు పడలేక చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని బాధిత కుటుంబాల ప్రజులు వాపోతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏ మాత్రం ఫలితం లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వంతెన శితిలావస్థలో ఉండటం మూలంగా భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని ప్రజలు తెలుపుతున్నారు. ఎప్పుడు కూలిపోతుందో అని బెరుకు బెరుకుగా ప్రయాణాలు సాగిస్తున్నామని ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం దొంకూరు వద్ద 23 ఏళ్ల క్రితం నిర్మించిన ఉప్పుటేరు వంతెన శిథిలావస్థకు చేరింది. గత ఐదేళ్లలో దీని నిర్వహణ గాడి తప్పింది. వంతెనకు ఇరువైపులా సుమారు 14 మత్స్యకార గ్రామాలన్నాయి. వర్షాలు కురిసినప్పుడు బ్రిడ్జిపై నీరు చేరి వారి రాక పోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులు, కాలినడకన వెళ్లేవారు వర్షం పడితే వెళ్లలేని పరిస్థితి. బహుదా నదికి వరదలు వచ్చినా తుపాన్ వచ్చినా మత్స్యకార గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాంటి వంతెన ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
'23 ఏళ్ల క్రితం అప్పటి సీఎం చంద్రబాబు మత్స్యకార గ్రామాల పర్యటన సందర్భంగా ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. డొంకూరు వంతెనతో పాటు ఆ పక్కనే లోకాజ్‌వేనూ నిర్మించారు. వీటి నిర్వహణను వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పాడైపోయాయి. కూటమి ప్రభుత్వం ప్రభుత్వం కొలువుదీరాక కొత్త వంతెన మంజూరు చేయిస్తామని. ఎమ్మెల్యే (MLA) బెందాళం అశోక్ చెప్పారు.'-గ్రామస్తులు
అయ్యయ్యో ప్రారంభించిన మరునాడే తెగి - 300 మీ. కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి
జగనన్న హయాంలో మరమ్మతులకు నోచుకోని వంతెనలు - ప్రమాదకరమని తెలిసినా కొనసాగుతున్న రాకపోకలు