Vikarabad Teacher Invited to the Independence Celebrations in Delhi : ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగం వచ్చేదాకా కష్టపడి చదివి ఒక్కసారి వృత్తిలో చేరాక వృత్తి బాధ్యత నిర్వర్తించడానికే భారంగా భావిస్తుంటారు. విద్యార్థులకు పుస్తకాలలో ఉన్నది చదివి చెప్పటం కాదు ప్రాక్టికల్‌గా నేర్పించాలనుకున్నాడు వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు. సాధారణంగా తరగతి గదికి వచ్చి పాఠాలు చెప్పి వెళ్లామా అని కాకుండా, విద్యార్థులకు ఏ విధంగా చెప్తే పాఠం అర్థమవుతుందో ఆ విధంగా బోధిస్తున్నారు. అత్వెల్లికి చెందిన లక్ష్మణ్ బయాలజీ టీచర్ కావడంతో చెప్పే ప్రతి మొక్క, జీవి గురించి వాటి దగ్గరకు తీసుకెళ్లి మరి విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో పాఠం చెబున్నారు.
నేటి విద్యార్థులకు వ్యవసాయం అంటే ఏంటో తెలియని పరిస్థితి వారికి ప్రాక్టికల్‌గా సేంద్రీయ వ్యవసాయం నేర్పిస్తేనే వ్యవసాయం అంటే ఏంటో తెలుస్తుందని గ్రహించి పాఠశాల ఆవరణలోనే కూరగాయ పంటలు వేశాడు లక్ష్మణ్. అక్కడే మొక్కల గురించి వాటి వ్యవస్థ గురించి వివరిస్తూ పాఠాలు బోధిస్తున్నాడు. అంతే కాదు బడి ఆవరణలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ ద్వారా పండిన పంటనే మధ్యాహ్న భోజనానికి ఉపయోగిస్తున్నారు. ఈ వినూత్న ఆలోచనతో పీఎం శ్రీ కింద ఆహ్వానం అందుకున్నారు.
Swarkheda Govt school Headmaster : ఊరిని మార్చిన ఉపాధ్యాయుడు..
"నేను స్కూల్లో టీచర్‌గా అపాయింట్ అయిన తర్వాత పిల్లలు ప్రయోగాత్మకమైన విద్యను బోధించాలి అనుకున్నాను. అందుకే ఇక్కడ ప్రిన్సిపల్, యాజమాన్యంతో పాఠశాలలో ఉన్న స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశాను. పిల్లలు దగ్గరగా చూపిస్తూ నేర్పించే సబ్జెక్టు బయాలజీ. అందుకే వారికి వ్యవసాయంతో పాటు సేంద్రియ పంటలపై కూడా అవగాహన కల్పిస్తున్నాను. నేను చాలా పేదరికం నుంచి వచ్చాను. అలా వచ్చిన నాకు ప్రభుత్వ పాఠశాల పిల్లల చదువు గురించి తెలుసు. అందుకే నా వంతు సహాయంగా ఇలా వారికి పాఠాలు చేప్తున్నాను. ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ నుంచి వచ్చిన కూరగాయలతో పిల్లల మధ్యాహ్న భోజనానికి ఉపయోగిస్తున్నాం." - లక్ష్మణ్, ఉపాధ్యాయుడు
తల్లిదండ్రులను కోల్పోయినా తగ్గకుండా : వికారాబాద్ జిల్లా అత్వెల్లికి చెందిన లక్ష్మణ్ రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులో ఇద్దరి తల్లిదండ్రులను కోల్పోయినా వెనుతిరగకుండా తాను చదువుతూ తన ఇద్దరి చెల్లెల్లను చదివించారు. ఆర్థిక పరిస్థితులను అధిగమించటం కోసం పార్ట్ టైం జాబ్స్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం రానంత వరకు నవోదయ స్కూల్లో బోధించేవారు. ఎంతో కష్టపడి 2019లో సర్కార్ ఉద్యోగం సాధించి కొట్‌పల్లి జెట్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయునిగా చేరారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించడమేతన ధ్యేయమంటున్నారు ఉపాధ్యాయుడు లక్ష్మణ్.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రకటన, రాష్ట్రం నుంచి ముగ్గురికి