ETV Bharat / state

'విజయవాడ టు శ్రీశైలం' - రిజర్వాయర్​లో సురక్షితంగా దిగిన విమానం - SEA PLANE VIJAYAWADA TO SRISAILAM

శ్రీశైలంలో విజయవంతంగా సీప్లేన్ ట్రయల్ రన్ - ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, టూరిజం ఎయిర్‌ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్‌ -

Sea Plane Trial Run Successfully Completed
Sea Plane Trial Run Successfully Completed (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 1:55 PM IST

Updated : Nov 8, 2024, 3:05 PM IST

Sea Plane Trial Run Successfully Completed : విజయవాడ-శ్రీశైలం 'సీ ప్లేన్' ట్రయల్ రన్ (Seaplane Trial Run) విజయవంతమైంది. మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 'సీ ప్లేన్‌' శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సీ ప్లేన్‌ చేరుకుంది. పోలీసు, టూరిజం, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్‌ నిర్వహించారు.

సీ ప్లేన్​లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు: అబ్బురపరిచే డ్రోన్ షో నిర్వహణతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అద్భుత ప్రయోగానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్​లో పర్యటించనున్నారు. విజయవాడ శ్రీశైలం మధ్య సీ ప్లేన్ నడిపేందుకు అనుకూలతలపై నిర్వహించే ఈ ప్రయోగం విజయవంతం అయితే రెగ్యులర్ సర్వీసులు ప్రారంభించనున్నారు.

విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్​లోనే: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకంగా, సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం స్వయంగా సీ ప్లేన్​లో (CM Chandrababu to Travel in SeaPlane) పర్యటించనున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉదయం సీ ప్లేన్​లో బయలుదేరనున్న సీఎం మధ్యాహ్నం శ్రీశైలం చేరుకుంటూరు. అక్కడ భ్రమరాంబ మల్లికార్డున స్వామి వార్ల దర్శనం అనంతరం తిరిగి సీ ప్లేన్​లోనే విజయవాడ చేరుకోనున్నారు.

సీ ప్లేన్ ట్రయల్ రన్​ విజయవంతం: శ్రీశైలంలోని పాతాళగంగ అక్కమహాదేవి గుహాలకు వెళ్లే జల మార్గంలో సీ ప్లేన్ దిగేందుకు అనుకూలతలను అధికార యంత్రాంగం గుర్తించింది. వాయు మార్గంలో వచ్చే విమానం నీటిపై దిగి దాదాపు అర కిలోమీటరు దూరం ప్రయాణించి జెట్టీ దగ్గర ఆగనుంది. సీ ప్లేన్ ప్రయాణం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. దీంతో శనివారం జరిగే సీఎం పర్యటన దృష్ట్యా విజయవాడ ప్రకాశం బ్యారేజీ-శ్రీశైలం మధ్య నేడు సీ ప్లేన్ ట్రయల్ రన్​ను విజయవంతంగా పూర్తి చేశారు.

పర్యాటక రంగంలో మరో అద్భుతం - విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్​

విజయవాడలో సీప్లేన్‌- పర్యటకులకు ఇక పండగే - SEAPLANE in vijayawada

Last Updated : Nov 8, 2024, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.