ETV Bharat / state

సీఎం జగన్​ అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం : విధ్వంసం పుస్తక రచయిత - Vidwamsam Book Writer

Vidwamsam Book Writer Alapati Suresh Kumar Interview : సీఎం జగన్​ అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారు అయ్యిందని 'విధ్వంసం' పుస్తక రచయిత ఆలపాటి సురేశ్​కుమార్​ అభిప్రాయపడ్డారు. 'విధ్వంసం' పుస్తకంలో జగన్​ పాలన, వ్యూహలు గురించి 'ఈనాడు - భారత్​'తో ముచ్చటించారు

vidwamsam_book_writer
vidwamsam_book_writer
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 2:25 PM IST

Vidwamsam Book Writer Alapati Suresh Kumar Interview : "సీఎం జగన్ మోహన్​ రెడ్డి సింహం అని అధికార పార్టీ నేతలు, అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి సీఎం జగన్​ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ జగన్​లో తీవ్ర అభద్రతాభావం, భయం గూడుకట్టుకొని ఉన్నాయి. జగన్​ సింహం కాదు, చిట్టెలుక. సింహం సింగిల్ గా వస్తుందన్న సినిమా డైలాగులు వినడానికే బాగుంటాయి కానీ నిజానికి అడవిలో ఏ సింహమూ సింగిల్​గా ఉండదు. ఒక్కటే వేటాడదు. అవి గుంపులుగా ఉండి జంతువులను వేటాడి చంపుతాయి. జగన్​తో కలిసేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రానందునే వైఎస్సార్సీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. దీన్నే సింగిల్ వస్తున్నామంటూ భ్రమ కల్పిస్తున్నారు" అని 'విధ్వంసం' పుస్తక రచయిత ఆలపాటి సురేశ్ కుమార్ విశ్లేషించారు. జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలో వివిధ వ్యవస్థలపై జరిగిన దాడిని వివరిస్తూ ఆయన 'విధ్వంసం' పేరిట పుస్తకాన్ని రచించారు. జగన్ పాలనా తీరుతెన్నులపై సురేశ్ కుమార్ ఇటీవల విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

కాపులను మోసం చేసిన జగన్ - టీడీపీ అమలు చేసిన పథకాలూ ఎత్తివేత - YS Jagan Cheated Kapu Community

బెయిల్ కోసం రాయబారానికి వెళ్తే, వీరుడా? : అవినీతి కేసుల్లో జగన్​ను జైలుకు పంపితే ఎలాగైనా బెయిల్ వచ్చేలా చేసి, బయటకు తేవాలంటూ తల్లిని, చెల్లిని దిల్లీలోని సోనియా గాంధీ వద్దకు రాయబారానికి పంపారు. ఈ విషయాన్ని స్వయంగా షర్మిల ఇటీవల బయటపెట్టారు. ఇవన్నీ ప్రజలకు తెలియనందున జగన్​ వీరుడు, శూరుడని ప్రచారం చేసుకుంటున్నారు. సోనియాకే ఎదురొడ్డి నిలబడ్డారని గొప్పలు చెప్పారు. కానీ నిజాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయి. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు క్విడ్ ప్రో కో రూపంలో జగన్ అక్రమంగా సంపాదించినందుకే సీబీఐ, ఈడీ కేసులు పెట్టాయి. వాటిలో నిజాలు లేకపోతే ఆ కేసులు ఛార్జిషీట్ల వరకు ఎలా వస్తాయి? సీబీఐ, ఈడీ పెట్టిన అన్ని కేసుల్లోనూ ఏ1గా ఉన్న జగన్​, సహ నిందితులతో వేర్వేరుగా డిశ్చార్జి పిటిషన్లు వేయిస్తూ పదేళ్లకు పైగా వాయిదాలపై లాక్కొచ్చారు. వీటిపై ప్రశ్నిస్తే, సమాధానం చెప్పుకోలేరు కాబట్టే జగన్ ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. జగన్​కు సొంత మీడియా ఉందన్న ధీమాతో ఇంత వరకు మీడియా సమావేశాలు పెట్టలేదు.

పేదల ఆదాయాన్ని జలగలా పీల్చేస్తున్న జగన్ - జే బ్రాండ్ల మద్యం తాగి లక్షల మంది జీవితాలు బలి - YS Jagan Failed To Liquor Ban

వైఎస్సార్సీపీ స్వరం మారింది అప్పుడే : తొలుత జనసేన, బీజేపీ జత కట్టాక వైఎస్సార్సీపీ ఎలాంటి విమర్శలూ చేయలేదు. 'ఈసారి వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను' అని పవన్ కల్యాణ్ ప్రకటించిన మరుక్షణమే వైఎస్సార్సీపీ నేతల దాడి మొదలైంది. 'ఒంటరిగా బరిలోకి దిగు' అంటూ పవన్​ను అధికార నేతలు రెచ్చగొట్టడం ప్రారంభించారు. రాజకీయ రణరంగంలో ఎవరి వ్యూహాలు వారివి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడితే తన గెలుపు కష్టమని తెలిసే వైఎస్సార్సీపీ పదేపదే పవన్ కల్యాణ్​పై విమర్శలు చేశారు. ఇది జగన్​లో తీవ్రభయాన్ని సూచిస్తోంది. గత ఎన్నికలకు ముందు జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుందని, మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకోవడమే ఇందుకు నిదర్శనమని సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి వారితో చెప్పించారు. గెలిచాక మూడు రాజధానుల నాటకమాడి నమ్మక ద్రోహం చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులతో ప్రభుత్వం ఇప్పటి వరకు చర్చించలేదు. వాళ్లంటే సీఎం జగన్​కు భయం కాబట్టే రాజధాని గ్రామాల మీదుగా అసెంబ్లీకి వెళ్లేటప్పుడు ఇళ్ల ముందు పరదాలు కట్టిస్తున్నారు.

ఏం అభివృద్ధి చేశారు ? మళ్లీ ఏం చెప్పడానికి వస్తున్నారు ? - జగన్​ను ప్రశ్నిస్తున్న విజయనగరంవాసులు - People Problems In Jagan Government

దోపిడీకి ముందస్తు ప్రణాళికలు : అధికారంలోకి వస్తే డబ్బు ఎలా పోగేయాలో జగన్ ముందుగానే మార్గాలు అన్వేషించారు. ఇసుక మాఫియా గోల పడలేక చంద్రబాబు ఉచిత ఇసుక విధానం తెచ్చారు. రాష్ట్రంలో ఇసుక విధానాన్ని మారుస్తున్నానంటూ జగన్​ దోపిడీకి వ్యూహం రచించి అమలు చేశారు. ఇసుకలో భయంకరమైన అక్రమార్జన జరిగింది. పర్యావరణం దెబ్బతింది. మద్యం పాలసీ అంతే. తెలంగాణలో ఉత్పత్తిదారు నుంచి ప్రభుత్వ రంగ సంస్థ మద్యాన్ని హోల్​సేల్​గా కొని, రిటైల్ వ్యాపారులకు అమ్ముతుంది. ఏపీలో మాత్రం టోకు, చిల్లర వ్యాపారం ప్రభుత్వమే చేస్తోంది. ఇక్కడ ఉత్పత్తిదారులుగా అధికార పార్టీ నేతలే వ్యాపారంలోకి దిగారు. దేశంలో లభించే ఏ మద్యం బ్రాండ్లు కూడా రాష్ట్రంలోకి రానివ్వకుండా చేశారు. పనికిరాని మద్యం బ్రాండ్లను తయారుచేసి దోచేశారు. ఇసుక, మద్యం విక్రయాల్లో నగదు మాత్రమే తీసుకోవడం దోపిడీలో భాగమే.

పార్ట్​టైం జాబ్​లు ఫుల్ టైం అయ్యాయి! అయినా గిగ్‌ వర్కర్ల గోడును పట్టించుకోని జగన్‌ సర్కార్‌ - GIG Workers Problems In Andhra

అధికారులు ఎదురు చెప్పకూడదు : ఐఏఎస్ లు, ఐపీఎస్ లు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా మన వ్యవస్థ వారికి రాజ్యాంగ రక్షణ కల్పించింది. కానీ జగన్ ఎక్కువ మంది అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నారు. తన పాలనను గుడ్డిగా సమర్థించేలా చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్​ రెడ్డి హయాంలో జగన్ ఆర్థిక కుంభకోణాలకు సహకరించిన అధికారులను ఏపీకి తెచ్చుకొని, కీలక పోస్టుల్లో కూర్చోబెట్టారు. అయిదేళ్లలో ప్రతిపక్ష నేతలకు గత, ప్రస్తుత డీజీపీ ఒక్కసారీ అపాయింట్​మెంట్ ఇవ్వలేదంటే ఎంత ఘోరమైన పరిస్థితో అర్థమవుతోంది. ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఏకంగా రాజద్రోహం(sedition) కేసులు పెట్టారు. అప్పట్లో కొవిడ్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వాయిదా వేస్తే, జగన్ ఆయనను కులం పేరుతో తిట్టిపోశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డను పంచాయతీరాజ్ చట్టసవరణ ద్వారా తప్పించారు. ఇది తప్పు అని అప్పటి సీఎస్ ఎందుకు చెప్పలేకపోయారు? చివరకు న్యాయస్థానం ముందు అభాసుపాలయ్యారు. మొత్తంగా అయిదేళ్లు అస్తవ్యస్త పాలనతో రాష్ట్రానికి తీరని నష్టం కలిగించారు.

జాబ్ క్యాలెండర్ అంటూ ఊరించాడు - గద్దెనెక్కి నిరుద్యోగులను నిండా ముంచాడు - Youth Fire On YSRCP Govt

మోదీకి ఎందుకు మోకరిల్లారు? : చంద్రబాబు ప్రత్యేక హోదా తేలేదని పలుమార్లు జగన్ విమర్శించారు. మరి జగన్​ అయిదేళ్ల పాలనలో తానెందుకు సాధించలేదో చెప్పరు. రాజ్యసభలో కీలక బిల్లులను దేశమంతా వ్యతిరేకించినా, జగన్ మద్దతిచ్చారు. అప్పుడు తమ మద్దతు కావాలంటే ప్రత్యేక హోదా ఇవ్వండని మోదీకి ఎందుకు షరతు పెట్టలేదు? జగన్​పైన ఉన్న కేసులే ఇందుకు కారణం. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. జగన్ ఐదేళ్లూ విపరీతమైన అహంభావంతో నిరంకుశంగా పాలన సాగించారు. ఎవరి మాటా వినలేదు. నియంతలంతా పిరికివారని చరిత్ర చెబుతోంది.

‘నవరత్నాల’తో మురిపిస్తామంటూ మాయమాటలు - పింఛన్​ తొలగించి పేదలకు వంచన - Jagan Conditions On Pensions

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.