Hyderabad to Vijayawada Traffic Stopped : తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పాలేరు వాగు ప్రవాహానికి జాతీయ రహదారిపై నీరు చేరింది. దీంతో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో సూర్యాపేట ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ సూర్యాపేట మీదగా ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో నాయకినిగూడెం వద్ద పాలేరువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని తెలిపారు. రక్షణ చర్యల్లో భాగంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్లు ఎస్పీ చెప్పారు.
ఆర్టీసీ బస్సులు దారి మళ్లింపు - విజయవాడ టూ పిడుగురాళ్ల వయా హైదరాబాద్ - Buses close between Hyd Vijayawada - BUSES CLOSE BETWEEN HYD VIJAYAWADA
Hyderabad to Vijayawada Traffic Stopped : తెలంగాణలోని సూర్యాపేట మీదగా హైదరాబాద్ టూ విజయవాడ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. దీంతో ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూర్యాపేట ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2024, 10:27 PM IST