UTF Protest Against YSRCP Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక బకాయిలు చెల్లించడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (UTF) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం నుంచి నాలుగు రోజులపాటు దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని కర్నూలు ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వం పీఆర్సీ కమిటీని వేసినా దానికి విధి విధానం లేకుండా పోయిందని మండిపడ్డారు.
దాచుకున్న డబ్బుల్ని దోచుకున్న ప్రభుత్వం - ₹19వేల కోట్ల బకాయిపై ఉపాధ్యాయుల ఆగ్రహం
జగన్ ప్రభుత్వం ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జగన్ సర్కార్ ఫ్రెండ్లీ ప్రభుత్వమంటూనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
UTF Leaders Serious On YCP Govt : విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ మొండి వైఖరిని ఖండించారు. తామేమీ వేతనాలు పెంచమని కోరడం లేదని జీతం నుంచి దాచుకున్న సొమ్మునే ఇవ్వమని అడుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కడప కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు నిధులు విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ అందలమెక్కాక మడమ తిప్పేశారని విమర్శించారు. ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
'మాట తప్పను - మడమ తిప్పను' మాటలు గుర్తున్నాయా సీఎం : యూటీఎఫ్ ఉపాధ్యాయులు
బకాయిలు చెల్లించాలంటూ U.T.F ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆందోళనలు కొనసాగాయి. ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు ఇవ్వాలని, పాత పెన్షన్ విధానం అమలు చేయాలంటూ నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నిరసనకు తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అలాగే తమకు రావలసిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని విజయనగరం కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరాహార దీక్షకు దిగారు. డీఏ, పీఆర్సీ, పీఎఫ్ మెుదలైనవి అన్నీ కలిపి దాదాపుగా రూ. 20 వేల కోట్లు ప్రభుత్వం బకాయి పడిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ 'నిరసన జాగరణ'
తామేమీ జీతాలు పెంచమని కోరడం లేదని, తాము జీతం నుంచి దాచుకున్న సొమ్మునే ఇవ్వమని అడుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయిన ప్రభుత్వం ఎందుకు మాపై మొండిగా వ్యవహరిస్తుందో అర్థం కావటం లేదని వాపోయారు. ఈ ప్రభుత్వం దాచుకున్న డబ్బుల్ని కూడా దోచుకుంటుందని ఆరోపించారు. ఎన్నికల ముందైనా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం నుంచి నాలుగు రోజులపాటు దీక్షలు కొనసాగుతాయని తెలిపారు.