ETV Bharat / state

సీఎం రేవంత్​రెడ్డి, కేటీఆర్ బీజేపీ అధికార ప్రతినిధులుగా మారారు : కిషన్​రెడ్డి - UNION MINISTER KISHAN REDDY

Kishan reddy on BRS Merge : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ​నేత కేటీఆర్ బీజేపీ అధికార ప్రతినిధులుగా తయారయ్యారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని కేటీఆర్ పరస్పర విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం ఎట్టి పరిస్థితుల్లో జరగదని కిషన్​రెడ్డి స్పష్టం చేశారు.

Kishan Reddy fires on CM Revanth
Kishan reddy on BRS Merge (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 21, 2024, 9:29 PM IST

Kishan Reddy fires on CM Revanth : బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలో విలీనం కాబోతుందంటూ వస్తున్న వార్తలపై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ బీజేపీ అధికార ప్రతినిధులుగా తయరయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని కేటీఆర్ పరస్పర విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సీఎం రేవంత్​రెడ్డి, కేటీఆర్ బీజేపీ అధికార ప్రతినిధులుగా మారారు- కిషన్​రెడ్డి (ETV Bharat)

బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలో విలీనం ఎట్టి పరిస్థితుల్లో జరగదని కిషన్​రెడ్డి స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలాగే, నేటి కాంగ్రెస్ పాలన సాగుతోందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చి, నేడు వాటి అమలులో ఘోరంగా విఫమలయ్యారని ఆయన విమర్శించారు. హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు.

కాశ్మీర్​లో అంబేడ్కర్ రాజ్యాంగం : నగరంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యశాలలో పాల్గొన్న కిషన్​రెడ్డి, ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్​పై నిప్పులు చెరిగారు. సెప్టెంబర్​లో జమ్మూ కాశ్మీర్​లో మూడు దశల్లో పోలింగ్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిన్నా రాజ్యాంగాన్ని, 370 ఆర్టికల్ తొలగించి అంబేడ్కర్ రాజ్యాంగాన్ని తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షం జమ్మూ కశ్మీర్​లో అధికారంలోకి వస్తే మళ్లీ 370 ఆర్టికల్​ను తీసుకువస్తుందని కిషన్​రెడ్డి ఆరోపించారు. బీజేపీ తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేస్తామని ఆపార్టీ చెబుతోందని మండిపడ్డారు.

జమ్మూ కశ్మీర్ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం హక్కులను కల్పించిందని, జమ్మూ కశ్మీర్ లో పర్యాటక రంగం ఊపందుకుందని ఉద్యోగాల కల్పన పెరిగిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నగరంలో "హైడ్రా" నా "హైడ్రామా" నా అని కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారులు అక్రమ నిర్మాణాలకు ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన త్రాగునీరు, కరెంట్ సౌకర్యాలను కల్పించారని, ఏ ప్రాతిపదికన అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చుతున్నారో అధికారులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

"గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలాగే, కాంగ్రెస్ పాలన నడుస్తోంది. అధికారం కోసం విచ్చలవిడిగా హామీలను ఇచ్చి, అమలులో నేడు ఘోరంగా విఫలమయ్యారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం ఎట్టి పరిస్థితుల్లో జరగదు". - కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు - తెలంగాణలో నెక్స్ట్ అధికారం బీజేపీదే : కిషన్​రెడ్డి - kishan in BJP Membership Program

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ఇస్తే ఇళ్ల మంజూరుకు కేంద్రం సిద్ధం : కిషన్‌రెడ్డి - KishanReddy Letter To CM Revanth

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.