Union Home Ministry Orders Officers Deputation To AP: ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులను రాష్ట్రానికి పంపుతూ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న రవికృష్ణను కేంద్రం రాష్ట్రానికి పంపించింది. గతంలో ఆయన కర్నూలు ఎస్పీగా విధులు నిర్వహించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యూపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాజమౌళిని కూడా డిప్యుటేషన్‌పై కేంద్రం రాష్ట్రానికి ప్రతిపాదించింది. రాజమౌళి 2014-19 మధ్య ఏపీ సీఎంవోలో పని చేశారు. ప్రస్తుతం యూపీ హోంశాఖ కార్యదర్శిగా ఉన్న ఆయనని ఇక్కడికి బదిలీ చేశారు. 2005 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి వెంకయ్యచౌదరిని కేంద్ర హోంశాఖ టీటీడీ జేఈవోగా నియామకం చేసింది. వెంకయ్యచౌదరిని డిప్యుటేషన్‌పై పంపేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌లో వెంకయ్యచౌదరి మూడు సంవత్సరాలు పని చేయనున్నారు.
కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం - రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై ముగ్గురు అధికారులు - OFFICERS DEPUTATION TO AP - OFFICERS DEPUTATION TO AP
Union Home Ministry Orders Officers Deputation To AP: కేంద్ర హోంశాఖ ముగ్గురు అధికారులను రాష్ట్రానికి పంపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రవికృష్ణ, 2005 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి వెంకయ్యచౌదరి, 2014-19 మధ్య ఏపీ సీఎంవోలో పని చేసిన రాజమౌళిని ఏపీకి పంపుతూ ఆమోదం తెలిపింది. కొత్త ప్రభుత్వం మారడంతో అధికారులు ఒక్కొక్కరు డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వస్తున్నారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 16, 2024, 10:35 PM IST