ETV Bharat / state

పదేళ్లకు వీడిన పీటముడి - దిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల విభజన పూర్తి

AP Bhavan Assets Division in Delhi : దిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల విభజన పీటముడి వీడింది. తెలంగాణ, ఏపీ మధ్య విభజన ప్రక్రియ పూర్తయింది. ఇరు రాష్ట్రాలు ఆప్షన్ జీని అంగీకరించడంతో ఏపీ భవన్ ఆస్తుల విభజన ప్రక్రియ ముగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ఉప కార్యదర్శి లలిత్ కపూర్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనిని, తమ ప్రభుత్వం మూడు నెలల్లో పూర్తి చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పేర్కొన్నారు.

Division of AP Bhavan Assets
Division of Assets of AP Bhavan is Complete
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 16, 2024, 7:50 PM IST

AP Bhavan Assets Division in Delhi : దిల్లీలోని ఏపీ భవన్(AP Bhavan) ఆస్తుల విభజన ముగిసినట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాలు ఆప్షన్ జీని అంగీకరించడంతో ఏపీ భవన్ ఆస్తుల విభజన ప్రక్రియ ముగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ఉప కార్యదర్శి లలిత్ కపూర్ తెలిపారు. తెలంగాణకు 8.245 ఎకరాలు, ఏపీకి 11.536 ఎకరాలు కేటాయించేలా ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

ఏపీ భవనన్​లోని శబరి బ్లాక్​లో మూడెకరాలు, పటౌడి హౌజ్​లో 5.245 ఎకరాలు తెలంగాణకు కేటాయించగా, ఏపీకి గోదావరి, స్వర్ణముఖి బ్లాకుల్లో 5.781 ఎకరాలు, నర్సింగ్ హాస్టల్​లో 3.359 ఎకరాలు, పటౌడి హౌజ్​లో 2.396 ఎకరాలను ఏపీకి కేటాయించారు. ఏపీ పునర్విభజన చట్టానికి అనుగుణంగా విభజన పూర్తయిందని ఆర్​ అండ్ బీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనిని తమ ప్రభుత్వం మూడు నెలల్లో పూర్తి చేసిందన్నారు. త్వరలోనే రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయలు ఉట్టిపడేలా దిల్లీలో తెలంగాణ భవన్ నిర్మిస్తామని మంత్రి తెలిపారు.

సీఎం హోదాలో తొలిసారిగా నేడు ఏపీలో అడుగుపెట్టనున్న రేవంత్ రెడ్డి

కవితను ఈడీ అరెస్టు చేసింది - కావాలంటే దిల్లీలో ధర్నాలు చేసుకోండి: కోమటిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.