ETV Bharat / state

సింగరేణిలో బొగ్గు తరలింపుపై సందిగ్ధత - కేంద్రం ఆదేశాల అమలుకూ విఘాతం - Singareni coal transportation issue - SINGARENI COAL TRANSPORTATION ISSUE

Coal Transportation Problems in Singareni : సింగరేణిలో బొగ్గు తరలింపు విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో విద్యుత్ కేంద్రాలకు బొగ్గు పంపాలన్న కేంద్రం ఆదేశాల అమలుకూ విఘాతం కలుగుతోంది. మరోవైపు సింగరేణిలో లారీ కిరాయిల అంశం తమకు భారంగా ఉన్నాయని పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Singareni coal mines transportation issues
Singareni coal mines transportation issues (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 19, 2024, 11:11 AM IST

Singareni Coal Mines Transportation Issues 2024 : సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది. వానకాలం వస్తున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. రెండు సంవత్సరాలుగా దేశంలో వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి, సరఫరా తగినంత లేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇబ్బందిని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా దేశంలోని అన్ని గనుల నుంచి అత్యవసరంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు తరలించాలని కేంద్రం తాజాగా ఆదేశాలు ఇచ్చింది.

కేంద్రం ఆదేశాలతో సింగరేణికి ఇబ్బందులు : ఈ ఆదేశాలను అమలు చేయడానికి సింగరేణి ఇబ్బందులు పడుతోంది. ఉదాహరణకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి గనుల వద్ద 10 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ గనుల తవ్వకం ప్రారంభించినప్పుడు ఇక్కడ ఉత్పత్తయ్యే బొగ్గులో 40 శాతం నిర్వాసితులు, స్థానికుల వాహనాల ద్వారా తరలిస్తామని సింగరేణి పేర్కొంది. ఈ నిబంధన వల్ల ప్రస్తుతం రోజుకు సగటున 10,000ల టన్నులకు పైగా స్థానిక లారీల యజమానులు పలు ప్రైవేట్ పరిశ్రమలకు రవాణా చేస్తున్నారు.

కానీ ఇప్పుడు బొగ్గు మొదట విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో స్థానికుల లారీల ద్వారా రవాణాను సింగరేణి నిలిపివేసింది. ఎందుకంటే గనుల నుంచి రుద్రంపూర్‌లో గల రైల్వే కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌కు బొగ్గు పంపడానికి టిప్పర్లు అవసరం. కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌కు చేర్చితేనే అక్కడి నుంచి ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు గూడ్స్‌ రైళ్ల ద్వారా బొగ్గును పంపడానికి వీలవుతుంది. టిప్పర్ల నుంచి నేరుగా గూడ్స్‌ వ్యాగన్లలో ఎత్తిపోయవచ్చు.

Singareni Coal Mines in Telangana : అయితే సత్తుపల్లి స్థానికులకు టిప్పర్లు లేకపోవడంతో సంస్థ, వారి లారీల ద్వారా రవాణాను నిలిపివేసింది. దీనిపై లారీల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో ప్రాంతంలో చూస్తే, గని నుంచి బొగ్గు తరలించడానికి సింగరేణి లారీల కిరాయి నిర్ణయించడానికి టెండర్లు పిలిచింది. కిలోమీటరుకు రూ.3.29 చొప్పున చెల్లిస్తే తరలిస్తామని ఒక వ్యాపారి టెండర్ వేయగా సంస్థ ఆమోదించింది. ఇదే ధరకు తరలించడానికి స్థానిక లారీల యజమానులకు కూడా అవకాశం ఇవ్వడానికి ఆ వ్యాపారి ముందుకొచ్చారు. కానీ గతంలో కిలోమీటరుకు రూ.4.20 చొప్పున చెల్లించారని లారీల యజమానులు చెబుతున్నారు. ఇప్పుడు తగ్గిస్తే ఒప్పుకొనేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

కేంద్రం Vs రాష్ట్ర ప్రభుత్వం.. భగ్గుమంటున్న 'బొగ్గు' వివాదం

రోజుకు 2 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి : రోజుకు 2 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి చేసే సింగరేణి గనుల నుంచి బొగ్గు తరలించడానికి లక్ష ట్రిప్పుల వరకూ టిప్పర్లు, లారీలు కావాలి. సాధారణ రోజుల్లోనూ మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ గనుల నుంచి హైదరాబాద్‌కు లారీలో తెచ్చే బొగ్గుకు టన్నుకు రూ.1,500 దాకా చెల్లిస్తుంటే, అంతకన్నా వంద కిలోమీటర్ల తక్కువ దూరంలో ఉన్న సింగరేణి గనుల నుంచి తీసుకురావాలంటే రూ.2,000ల దాకా వసూలు చేస్తున్నారని సిమెంట్‌ తదితర పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కిరాయి ఛార్జీలను ప్రైవేట్ లారీలు వసూలు చేస్తున్నందున వాటిపై తమకు నియంత్రణ లేదని సింగరేణి సంస్థ చెబుతోంది.

అక్కడ డ్రైవర్లకు వేతనాలు తక్కువ : మహారాష్ట్ర, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల్లో లారీ డ్రైవర్లకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని లారీల యజమాన్యాలు చెబుతున్నాయి. తెలంగాణలో అధికంగా ఇవ్వకపోతే డ్రైవర్లు రావడం లేదని పేర్కొంటున్నాయి. అందువల్ల ఇక్కడ కిరాయి ఎక్కువగా వసూలు చేయాల్సి వస్తోందని లారీల యజమాన్యాలు తెలుపుతున్నాయి. సత్తుపల్లిలో లారీల వివాదంపై స్థానిక లారీల యజమానుల సంఘం అధ్యక్షుడు కొండపల్లి రమేశ్‌రెడ్డి స్పందించారు. సింగరేణిలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ కిరాయిలు తక్కువగా వసూలు చేస్తున్నామని ఆయన తెలిపారు. సంస్థ నాసిరకం బొగ్గు ఇవ్వడంతో పరిశ్రమల నుంచి ఆర్డర్లు రావడం లేదని చెప్పారు. గనులపై ఆధారపడి జీవిస్తున్న లారీ యజమానులకు, కార్మికులకు కంపెనీ న్యాయం చేయాలని రమేశ్‌రెడ్డి కోరారు.

తాజా పరిస్థితులపై సింగరేణి సీఎండీ బలరాంను వివరణ అడగ్గా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అత్యవసరంగా బొగ్గు తరలించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినందున రైళ్ల ద్వారా పంపుతున్నట్లు పేర్కొన్నారు. లారీల కిరాయిల అంశంపై విచారణ చేయిస్తున్నట్లు సీఎండీ బలరాం వివరించారు.

విద్యుత్‌ ఉత్పత్తిపై సింగరేణి ఫోకస్ - రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్‌ కేంద్రం!

త్వరలో కొత్త బొగ్గు గనుల వేలం - కొనుగోలు చేయాలనే యోచనలో సింగరేణి - Coal Blocks Auction 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.