టీవీ యాంకర్‌పై మోజు - పెళ్లాడాలంటూ ఏకంగా కిడ్నాప్ చేయించిన యువతి - Kidnap Case Woman Arrested
TV Anchor Pranav Kidnap Case Woman Arrest : ఓ యువతి ఓ టీవీ యాంకర్‌పై మనసుపడింది. ఆయనతో చాట్ చేసింది. ఆతడినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. అయితే అందుకు ఆ వ్యక్తి ఒప్పుకోకపోవడంతో ఏకంగా కిడ్నాప్ చేయించింది. సినిమా ట్విస్టులా ఉన్న ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్‌లో జరిగింది. ఈ కేసులో తృష్ణ అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 9:33 PM IST
TV Anchor Pranav Kidnap Case Woman Arrest : ఓ టీవీ ఛానల్లో పనిచేస్తున్న ప్రణవ్ను కిడ్నాప్ చేయించిన తృష్ణ అనే యువతిని ఉప్పల్ పొలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్‌లోని కేకేఆర్ నగర్లో ఉంటున్న ప్రణవ్ ఈ నెల 10న సినిమా చూసి ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. మాదాపూర్‌లోని తృష్ణ అనే యువతి వద్దకు తీసుకెళ్లారు.
భారత్ మాట్రిమోనిలో(Bharat Matrimony) ప్రణవ్ ఫొటోతో చైతన్య రెడ్డి అనే యువకుడు మూడు నెలల పాటు యువతితో చాటింగ్ చేశాడు. యువతి మాత్రం ప్రణవ్ తనతో చాటింగ్ చేస్తున్నట్లు భ్రమ పడింది. తనతో చాటింగ్ చేసి ముఖం చాటేశాడని అనుమానంతో ప్రణవ్ను ఈ నెల 10న అర్ధరాత్రి సమయంలో అయిదుగురి వ్యక్తులతో అతణ్ని కిడ్నాప్ చేయించింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని ప్రణవ్ను ఒత్తిడి చేసింది. ఈనెల 11న ఉదయం ప్రణవ్ను నిందితురాలు వదిలేసింది.
ఈ క్రమంలో కిడ్నాప్‌నకు గురైన ప్రణవ్ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించి, ఆమెపై ఫిర్యాదు చేశాడు. నిందితురాలు తృష్ణ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్‌ను నడుపుతున్నట్లు మల్కాజిగిరి ఏసీపీ పురుషోత్తంరెడ్డి చెప్పారు. యువతి తృష్ణపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
'ప్రణవ్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఓ ఛానల్లో యాంకరింగ్ కూడా చేస్తారు. ఈ నెల 11న ఆయన ఉప్పల్ పోలీస్ స్టేషన్లో తృష్ణ అనే యువతిపై కంప్లైంట్ ఇచ్చారు. తృష్ణ అనే యువతి డిజిటల్ మార్కెటింగ్ చేస్తోంది. ఆమెకు మాట్రిమోనిలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మాట్రిమోని ద్వారా ప్రణవ్ ఫొటోతో ఓ వ్యక్తి చాటింగ్ చేశాడు. ప్రణవ్ అని ఆమె అనుకున్నది. ఈ క్రమంలో ప్రణవ్ను తృష్ణ ఫాలో అయింది. యువతి తృష్ణపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం'- పురుషోత్తంరెడ్డి, మల్కాజిగిరి ఏసీపీ
మూడు రోజుల శిశువును కిడ్నాప్ చేసిన మహిళ - వీడియో వైరల్
పిల్లల్ని ఎత్తుకెళ్తున్నాడనే అనుమానంతో దాడి - పశువుల కాపరి మృతి