ETV Bharat / state

తిరుమలలో వైకుంఠ ఏకాదశి - 10 రోజులు వీఐపీ బ్రేక్​ దర్శనాలు రద్దు - VAIKUNTA EKADASHI ARRANGEMENTS

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు - ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు 10 రోజుల పాటు రద్దు

vaikunta_ekadashi_arrangements
vaikunta_ekadashi_arrangements (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

TTD Arrangements for Tirumala Vaikuntha Ekadashi: తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల ఉత్తర ద్వార దర్శనాలకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. 10 రోజుల ఉత్తర ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతించేలా నిర్ణయం తీసుకున్నారు. టోకెన్లు లేని భక్తులను క్యూలైనులోకి అనుమతిని నిరాకరించారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు 10 రోజుల పాటు రద్దు చేశారు.

భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని తెలియజేశారు. భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచించారు. మొదటి రోజు మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్​లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతిని టీటీడీ నిరాకరించారు. గత ఎడాది వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను టీటీడీ అధికారులు అవలంబిస్తున్నారు. తిరుపతి స్ధానికుల కోటా విడుదలపై ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - 10 రోజుల పాటు ఈ దర్శనాలు రద్దు

తిరుమల కొండల్లో "పాలధారలు'' - మైమరచిపోతున్న భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.