ETV Bharat / state

గ్రూప్​-1పై కీలక అడుగులు - సుప్రీంలో అప్పీలు ఉపసంహరణకు టీఎస్​పీఎస్సీ పిటిషన్‌ - Supreme Court on Group1 Exam

TSPSC Withdraw Petition in Supreme Court on Group1 Exam : గ్రూప్​-1 పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ గతంలో టీఎస్​పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఇప్పుడు ఆ పిటిషన్​ను ఉపసంహరించుకోనుంది.

TSPSC
TSPSC Withdraw Petition in Supreme Court on Group1 Exam
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 11:51 AM IST

TSPSC Withdraw Petition in Supreme Court on Group1 Exam : రాష్ట్రంలో గ్రూప్​-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ గతంలో టీఎస్​పీఎస్సీ సుప్రీంకోర్టు(Supreme Court)లో వేసిన పిటిషన్​ను ఉపసంహరించుకోనుంది. గతేడాది అక్టోబరులో దాఖలు చేసిన ఈ స్పెషల్​ లీవ్​ పిటిషన్​ను వెనక్కి తీసుకునేందుకు అనుమతివ్వాలంటూ ఈ నెల 8న అర్జీ దాఖలు చేసింది. ఇప్పుడు టీఎస్​పీఎస్సీ వేసిన అర్జీ ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ సర్వోన్నత న్యాయస్థానం కేసు ఉపసంహరణకు అనుమతి ఇస్తే రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష రద్దవుతుంది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాయాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వం, నిరుద్యోగులు, గ్రూప్​-1 అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త పోస్టులతో కలిపి గ్రూప్​-1 పరీక్ష మళ్లీ నిర్వహించే యోచనలో టీఎస్​పీఎస్సీ(TSPSC) ఉంది. పేపర్​ లీక్​, బయోమెట్రిక్​ నిబంధనలు పాటించనందుకు గతంలో గ్రూప్​-1 పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. 2022 ఏప్రిల్​లో 503 పోస్టులతో గ్రూప్​-1 నోటిఫికేషన్​ను టీఎస్​పీఎస్సీ విడుదల చేసింది. అయితే అదే ఏడాది అక్టోబరు 16న గ్రూప్​-1 ప్రిలిమినరీ పరీక్షను కమిషన్​ నిర్వహించింది. ఈ క్రమంలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. మళ్లీ రెండోసారి 2023 జూన్​ 22న గ్రూప్​-1 పరీక్షను తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ నిర్వహించింది.

రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్​ల బదిలీ - టీఎస్​పీఎస్సీ నూతన కార్యదర్శిగా నవీన్ నికోలస్​

TSPSC Group 1 Cancelled in High Court : ఈ రెండోసారి నిర్వహించిన పరీక్షను దాదాపు 2.33 లక్షల మంది అభ్యర్థులు రాశారు. దీంతో పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని గ్రూప్​-1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు తీర్పును ఇస్తూ గ్రూప్​-1 పరీక్షను రద్దు(Group 1 Exam Cancel) చేయాలని, అలాగే మరోసారి నిర్వహించాలని టీఎస్​పీఎస్సీకి తెలిపింది. వెంటనే సింగిల్​ బెంచ్​ ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ పబ్లిక్​ కమిషన్​ హైకోర్టు డివిజన్​ బెంచ్​ ముందుకు వెళ్లింది. అయితే డివిజన్​ బెంచ్​ కూడా హైకోర్టు సింగిల్​ బెంచ్​ ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈరెండు తీర్పులు టీఎస్​పీఎస్సీకి వ్యతిరేకంగా ఉండడంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్​ వేసింది. ఇప్పుడు ఆ అప్పీలు పిటిషన్​ వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాలని టీఎస్​పీఎస్సీ సుప్రీంకోర్టును ఆదివారం విజ్ఞప్తి చేసింది.

Telangana Group 1 Exam : మరోవైపు ప్రభుత్వం కొత్తగా గ్రూప్​-1 నోటిఫికేషన్(TSPSC Group1 New Notification)​ వేస్తామని ప్రకటించి, ఇటీవల మరో 60 ఉద్యోగాలను గుర్తిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే గతంలో ఇచ్చిన 503 పోస్టులను, కొత్తగా చేర్చిన పోస్టులతో త్వరలోనే కొత్త నోటిఫికేషన్​ ఇవ్వాలని టీఎస్​పీఎస్సీని ప్రభుత్వం ఆదేశించింది. అయితే 2022లో ఇచ్చిన 503 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్​కు కొత్తగా గుర్తించిన ఉద్యోగాలను అదనంగా చేర్చడమా లేదా గత నోటిఫికేషన్​ను రద్దు చేసి అదనపు ఉద్యోగాల పేరుతో మరో నోటిఫికేషన్​ ఇవ్వడమా అనే దానిపై టీఎస్​పీఎస్సీ చర్చిస్తోంది. వీటితో పాటు పరీక్ష విధానం, సిలబస్​లోనూ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని టీఎస్​పీఎస్సీ వర్గాల సమాచారం. ఈ విషయాలు అన్నింటిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు ​- త్వరలోనే కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వ సన్నాహాలు ముమ్మరం

టీఎస్​పీఎస్సీ గ్రూప్- 2 పరీక్ష వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.