Traffic CI Humanity : ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హుటాహుటిన ఆ విద్యార్థినిని ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స చేయించి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే, ఇంటర్ మొదటి సంవత్సరం ఎగ్జామ్ రాసేందుకు ఓ విద్యార్థిని తన తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై పరీక్షా కేంద్రానికి వెళ్తుంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ ఎంజీ రహదారి తపస్య కళాశాల వద్ద వాహనం అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడిపోయారు.
Police Humanity: లాఠీ ఝుళిపించడమే కాదు.. సహాయం చేయడమూ తెలుసు..
ఘటనలో విద్యార్థిని తలకు గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తోన్న మహంకాళి ట్రాఫిక్ సీఐ ఉపాశంకర్ గమనించి, వెంటనే తన వాహనంలో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పరీక్షా కేంద్రంలో ప్రిన్సిపల్ అనుమతి తీసుకుని ఆమెను ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి, 7 కుట్లు వేయించారు. అనంతరం సమయానికి తిరిగి పరీక్షా కేంద్రంలో వదిలిపెట్టగా, ఇన్స్పెక్టర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
2 కిలోమీటర్లు భుజాన మోసి : కరీంనగర్ జిల్లా భేతిగల్‌లో పొలం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా, అతడిని ఓ పోలీస్ కానిస్టేబుల్ శ్రమ కోర్చి ఏకంగా 2 కిలోమీటర్లు భుజాన మోసి ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. వీణవంక మండలం భేతిగల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భేతిగల్‌కు చెందిన కుర్ర సురేశ్ అనే వ్యక్తి కుటుంబ తగాదాల కారణంగా పురుగుల మందు తాగాడు. ఇరుగు పొరుగు వారు గమనించి 100కు సమాచారం ఇవ్వగా, కానిస్టేబుల్ జయపాల్, హోంగార్డు కిన్నెర సంపత్‌లు అక్కడికి చేరుకున్నారు.
భుజాలపై భార్య మృతదేహంతో కాలినడకన భర్త పయనం.. పోలీసుల మానవత్వం
పొలాల మధ్య అపస్మారక స్థితిలో పడి ఉన్న సురేశ్‌ను తరలించేందుకు అక్కడి వరకు వాహనం తీసుకొచ్చే పరిస్థితి లేదు. దీంతో జయపాల్ బాధితుడిని తన భుజాన వేసుకుని సుమారు 2 కిలోమీటర్లు పొలాల గట్ల మీదుగా గ్రామంలోకి తీసుకొచ్చి కుటుంబసభ్యుల సహాయంతో జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయని కుటుంబసభ్యులతో పాటు పోలీస్ ఉన్నతాధికారులు జయపాల్‌ను అభినందించారు.
Police Carry Dead Bodies : పోలీసుల మానవత్వం.. మృతదేహాలను భుజాలపై మోసి