ETV Bharat / state

పెద్ద మనసు చాటుకున్న సినీ హీరోలు - వరద సాయం ఎవరెంత ఇచ్చారంటే! - Tollywood donates to flood victims

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 3:20 PM IST

Updated : Sep 3, 2024, 7:54 PM IST

Tollywood Donation: భారీ వర్షాలకు అతలాకుతలమైన ఉభయ తెలుగు రాష్ట్రాలకు సాయం అందించడంలో పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. జూ.ఎన్టీఆర్ సహా విశ్వక్​ సేన్​, సిద్ధు జొన్నలగడ్డ, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్​, ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ, నాగవంశీ హా పలువురు తమ వంతుగా విరాళాలు ప్రకటించారు.

tollywood_donates_to_flood_victims
tollywood_donates_to_flood_victims (ETV Bharat)

Help from Tollywood heroes : బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజులుగా అతి భారీ వర్షపాతం నమోదైంది. వరదలు పోటెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా తెలంగాణలోని మహబూబాబాద్, ఖమ్మంలో మున్నేరు వాగు పోటెత్తింది. ఏపీలో బుడమేరు వాగు ఉప్పొంగడంతో విజయవాడ, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో అనేక ప్రాంతాలను వరద ముంచెత్తింది.

వరద కారణంగా ప్రధాన రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. అనేక ఇళ్లు నీటిలో మునిగిపోయి ప్రజలు మూడు రోజులుగా వరద నీటిలోనే ఉంటూ సాయం కోసం ఎదురుచూశారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. అన్నీ కోల్పోయిన తమకు కట్టుబట్టలే మిగిలాయని వరద బాధితులు కన్నీరు మున్నీరయ్యారు.

వరద బాధితులను ఆదుకోవడమే లక్ష్యం- ఆపద సమయంలో కుట్రలా? : చంద్రబాబు - CM review flood relief measures

తాజా పరిణామాల నేపథ్యంలో ఎంతో మంది దాతలు ముందుకొచ్చి తమవంతు సాయం అందిస్తున్నారు. ఎవరికి తోచినంత వారు ఆర్థిక సాయం ప్రకటించారు. తాజాగా టాలీవుడ్​ సైతం వరద బాధితులకు అండగా నిలిచింది. హీరో జూనియర్​ ఎన్టీఆర్ సహా పలువురు హీరోలు, దర్శక, నిర్మాతలు తమ వంతుగా వరద బాధితులకు సాయం అందించారు. జూనియర్​ ఎన్టీఆర్ రూ.కోటి ప్రకటించి ఇరు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున విరాళం అందించారు.

తెలుగు రాష్ట్రాల్లో వరద కారణంగా జరిగిన నష్టం, ప్రజల ఇబ్బందులు తనను తీవ్రంగా కలచివేశాయని జూనియర్​ ఎన్టీఆర్​ ట్వీట్​ చేశారు. అతి త్వరగా తెలుగు ప్రజలు కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయపడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

"రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు అతి త్వరగా కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వాలు చేపట్టే సహాయ చర్యలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నా వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను. - ఎన్టీఆర్​ ట్వీట్

ప్రముఖ హీరో విశ్వక్​సేన్, సిద్ధు జొన్నలగడ్డ తమ వంతుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​కు విరాళం ప్రకటించారు. విశ్వక్​సేన్ ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్​ ఫండ్​కు రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించగా, సిద్ధు జొన్నలగడ్డ చెరో రూ.15 లక్షల చొప్పున రూ.30 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు.

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్​, నిర్మాత ఎస్​.రాధాకృష్ణ, నాగవంశీ రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఇరు రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షల చొప్పున సీఎం సహాయ నిధికి జమ చేయగా ఇటీవలే కల్కితో భారీ విజయాన్ని అందుకున్న వైజయంతీ మూవీస్​ అధినేత అశ్వనీదత్​ ఆంధ్రప్రదేశ్​కు రూ.25 లక్షల సాయం ప్రకటించారు.

తేరుకుంటున్న ముంపు ప్రాంతాలు- హైవేపై యథావిధిగా రాకపోకలు - flood relief

జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరతా - కేంద్రానికి లేఖ రాస్తా: సీఎం - CM Chandrababu Naidu on Floods

Last Updated : Sep 3, 2024, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.