ETV Bharat / state

తెలంగాణ పోల్ డే - ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు వీళ్లే - Celebrities Cast Their Votes - CELEBRITIES CAST THEIR VOTES

Tollywood Celebrities Cast Their Votes: హైదరాబాద్​లో లోక్​సభ ఎన్నికలకు పోలింగ్​ కొనసాగుతోంది. సినీ నటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు.

Tollywood_Celebrities_Cast_Their_Votes
Tollywood_Celebrities_Cast_Their_Votes (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 9:47 AM IST

Tollywood Celebrities Cast Their Votes: హైదరాబాద్‌లో సినీ నటులు తమ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్​లోని ఓబుల్ రెడ్డి పాఠశాలలో నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్లు అర్జున్‌ ఫిల్మ్‌నగర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. దేశ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతం చేయాలని ప్రముఖులు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ - ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు - Political Leaders Cast Their Vote

జూబ్లీహిల్స్​లో సినీ నటుడు చిరంజీవి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి సురేఖ, కుమార్తె సుస్మిత కూడా ఓటేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకొచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు మన హక్కే కాదన్న ఆయన అది మన బాధ్యత అని స్పష్టం చేశారు. పెద్దసంఖ్యలో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఓటు వేయాలని కోరారు. సికింద్రాబాద్ పద్మారావునగర్​ వాకర్స్​ టౌన్​హాల్​లో ప్రముఖ దర్శకుడు శేఖర్​ కమ్ముల తన కుటుంబ సమేతంగా ఓటు వేశారు. ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. నానక్‌రామ్‌గూడాలో ఓటు హక్కు హీరో నరేష్​ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు - టీడీపీ పోలింగ్‌ ఏజెంట్లను కిడ్నాప్ చేసిన వైఎస్సార్సీపీ నేతలు - clashes in ap elections

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.