ETV Bharat / state

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక ​- ఆర్జితసేవా టికెట్లు, రూ.300 టికెట్ల కోటా తేదీలు వచ్చేశాయ్

ఈ నెలలోనే 2025 జనవరి నాటి శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు - టికెట్ల కోటా తేదీలను విడుదల చేసిన టీటీడీ

ttd srivari Darshan tickets
TTD Releases Srivari Arjitha Seva Tickets for 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2024, 12:09 PM IST

Updated : Oct 17, 2024, 2:59 PM IST

TTD Releases Srivari Arjitha Seva Tickets for 2025 : తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనమే కాకుండా ఆయనకు సేవ చేసే భాగ్యాన్ని కూడా టీటీడీ కల్పించింది. ఈ మేరకు భక్తుల సౌకర్యార్థం కోసం 2025 జనవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను ఈ నెలలో టీటీడీ అందుబాటులోకి తేనుంది. ఈ నేపథ్యంలో ఏయే తేదీల్లో, ఏయే టికెట్లను విడుదల చేస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ నెల 19న శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు : ఈ నెల 19న శ్రీవారి ఆర్జిత సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. వీటిలో కొన్నింటిని ఈ నెల 21న ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్‌ లక్కీ డిప్‌ కోటా కింద ఆన్​లైన్​ నమోదు చేసుకోవచ్చు.

ఈ నెల 22 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ సేవా టికెట్లను సైతం అందుబాటులోకి తేనున్నారు.

అక్టోబర్​ 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు.

ఈ నెల 24న స్పెషల్​ దర్శనం రూ.300 టికెట్లు : ఈ నెల 24న కూడా జనవరికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను అందుబాటలోకి తెస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల బుకింగ్‌ కోటా కూడా అందుబాటులోకి రానుంది. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోసం భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు.

భక్తులకు గుడ్​న్యూస్​ - తిరుమల డిసెంబర్​ కోటా టికెట్ల షెడ్యూల్ వచ్చేసింది! - స్పెషల్​ దర్శనం టికెట్లు ఆరోజే! - TTD Seva Tickets for December 2024

తిరుమల వెళ్లే భక్తులకు బిగ్​ అలర్ట్​ - ఆ మూడు రోజులు పలు సేవలు రద్దు - తెలియకపోతే ఇబ్బందులు తప్పవు! - TTD Cancelled Arjitha Seva

Last Updated : Oct 17, 2024, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.