ETV Bharat / state

జువెలరీ షాపులోకి చొరబడ్డ ముసుగు దొంగలు - యజమానిని కత్తితో పొడిచి డబ్బుతో పరార్ - JEWELRY SHOWROOM ROBBERY IN MEDCHAL - JEWELRY SHOWROOM ROBBERY IN MEDCHAL

Thieves Attacked Jewelry Showroom Owner : మేడ్చల్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. జువెలరీ షాపులో చొరబడిన దొంగలు యజమానిని కత్తితో పొడిచి గల్లాపెట్టెలో ఉన్న నగదు తీసుకుని పారిపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Thugs attacked
Thugs attacked (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 20, 2024, 4:02 PM IST

Updated : Jun 20, 2024, 5:22 PM IST

Thugs Attacked Jewelry showroom Owner: బంగారం షాపులో పట్టపగలే చోరి జరిగింది. అదీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న దుకాణంలో. పట్టపగలే జువెలరీ షాపులోకి చొరబడిన ఇద్దరు దొంగలు షాప్ యజమానిని కత్తితో పొడిచి గల్లాపెట్టెలోని డబ్బులతో ఉడాయించారు. మేడ్చల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దొంగల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : మేడ్చల్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. జువెలరీ షాప్ యజమానిపై కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శేషారాం అనే వ్యక్తి జగదాంబ జువెల్లరి షాప్ నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజూ లాగే ఇవాళ ఉదయం దుకాణం తెరిచాడు. సరిగ్గా ఉదయం 11:15 గంటల సమయంలో షాపులో కస్టమర్లు లేనప్పుడు చూసి ఇద్దరు దొంగలు చొరబడ్డారు.

అందులో ఒక దుండగుడు బుర్ఖా ధరించి రాగా మరో వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నాడు. వారు షాపులో చొరబడి యజమాని శేషారాంను కత్తితో పొడిచి నగదుతో ఉడాయించారు. ఈ సంఘటన అంతా అక్కడున్న సీసీకెమెరాల్లో రికార్డయింది. దాడి జరిగిన సమయంలో శేషారాం కుమారుడు ఆయన వెంటే ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని అతణ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రులో చికిత్స పొందుతున్నాడు.

జువెలరీ షాపులో దోపిడీపై అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి (ETV Bharat)

అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా షాపులో ఉన్న సీసీకెమెరాలు పరిశీలించగా ఫుటేజీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ఫుటేజీ ఆధారంగా దొంగల ఆచూకీ కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే ఈ ఘటనలో షాపులో ఎంత నగదు వారు ఎత్తుకెళ్లారో ఇంకా తెలియాల్సి ఉంది.

' షాప్​లోకి రావడం రావడంతోనే కత్తి చూపిస్తూ డబ్బులు ఇవ్వాని డిమాండ్ చేశారు. వెంటనే నేను చేతులు పైకి లేపాను. అయినా నాపై దాడి చేశారు. వారిని చూసిన వెంటనే మా అబ్బాయి రూంలోకి పారిపోయాడు. కొంత డబ్బులు పోయాయి. మరి కొంత డబ్బు అక్కడే పడిఉంది. ఇద్దురు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒక్క వ్యక్తి మాస్క్ వేసుకుని ఉన్నాడు. మరో వ్యక్తి హెల్మెట్ వేసుకున్నాడు. దాడి చేసి పారిపోతున్న సమయంలో కుర్చి తాకి ఓ వ్యక్తి కిందపడిపోయాడు. మరో వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి బైక్ పై పారిపోయారు. ఈ దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు ఆ దొంగల్ని పట్టుకుంటారని ఆశిస్తున్నాం.' - బంగారం షాప్ ఓనర్

చోరీకి పాల్పడ్డవారిని త్వరలోనే పట్టుకుంటాం: జువెలరీ షాప్​ను అడిషనల్ డీసీపీ, నరసింహారెడ్డి సందర్శించారు. చుట్టుపక్కల షాప్​లను విచారించారు. దొంగలు మాట్లాడిన తీరు చూస్తుంటే నార్త్ ఇండియాకు చెందిన వారుగా తెలుస్తుందన్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సీసీ టీవీ ఆధారంగా నింధితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఇప్పటికే ఎస్ఓటీ పోలీసులతో గాలింపు చర్యలు చేపట్టినట్లు నరసింహారెడ్డి తెలిపారు.

నేపాలీ దొంగల ముఠా - నమ్మారో ఇల్లు గుల్ల! - Nepali thieves

Last Updated : Jun 20, 2024, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.