ETV Bharat / state

ముగ్గురి ఉసురు తీసిన విద్యుత్ తీగలు - వరంగల్​ జిల్లా మోత్య తండాలో విషాదఛాయలు - విద్యుత్​షాక్​తో ముగ్గురు మృతి

Three People Died with Shock in Warangal : విద్యుత్తు తీగ తెగి పడి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. విద్యుత్​ షాక్​కు గురైన వారిలో మొత్తం నలుగురు ఉండగా, వారిలో ముగ్గురి మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Warangal Electric Shock Issue
Three People Died with Electric Shock in Warangal
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 10:32 AM IST

Three People Died with Electric Shock in Warangal : వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం మోత్య తండాలో సోమవారం కరెంట్​ తీగ తెగి పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, మోత్య తండాలో దుర్గమ్మ పండుగ కోసం తండావాసులు భక్తి శ్రద్ధలతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంటి ముందు టెంటు వేస్తుండగా పైనుంచి విద్యుత్తు తీగ తెగిపడడంతో నలుగురు విద్యుత్​ షాక్​కు గురయ్యారు.

ఆ యువకుల్లో గుగులోతు దేవేందర్‌ (32) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి తరలించే క్రమంలో భూక్య రవి (30), బానోతు సునీల్‌ (20) మృతి చెందారు. భూక్య రవి రైతు. దుర్గమ్మ పండుగ(Durgamma Festival) నేపథ్యంలో చెల్లెలు మంజుల, బావ గుగులోతు దేవేందర్‌ను ఆహ్వానించగా, వారు రాయపర్తి మండలం జగన్నాథపల్లి కొత్త తండా నుంచి వచ్చారు.

అన్నదాతల పాలిట మృత్యుగండంగా మారుతోన్న విద్యుత్ తీగలు - ఈ పాపానికి కారకులెవరు?

మోత్యా తండాలో విషాదం- విద్యుత్​ షాక్​ తగిలి ముగ్గురు బలి : సాయంత్రం సుందర్‌నాయక్‌ గ్రామానికి చెందిన బానోతు సునీల్‌ను టెంటు వేసేందుకు పిలిచారు. ఇంటి ముందు టెంటు వేసే పనులు జరుగుతున్న క్రమంలో రవి తన కుమారుడు ఆరేళ్ల జశ్వంత్‌, బావ దేవేందర్‌తో కలిసి పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో పైనున్న కరెంట్​ తీగ ఒక్కసారిగా తెగి పడడంతో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఇందులో తీవ్ర గాయాలైన చిన్నారి జశ్వంత్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటనతో పండుగ వేళ(Festival Time) ఆనందంగా ఉండాల్సిన తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Warangal Electric Shock Issue : విద్యుత్తు తీగలు వదులుగా ఉన్నాయని తాము ముందే చెప్పినా, అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ షాక్​తో ముగ్గురు మృతి చెందిన సమాచారం అందుకున్న స్థానిక శాసనసభ్యుడు(Vardhannapet MLA) కేఆర్ నాగరాజు హుటాహుటిన మోత్య తండాకు చేరుకున్నారు. బాధితులను పరామర్శించి, బాధిత కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు బలవుతుండగా, మరికొన్ని స్వీయ తప్పిదాలతో ప్రాణాలు పోతున్నాయి. ఏదేమైనా విద్యుత్​ విషయంలో కాస్త అప్రమత్త లేకుంటే కష్టమే. గత నెలలో వికారాబాద్​ జిల్లా బొంరాస్​పేట్ మండలంలో బట్టలు ఆరేస్తున్న సమయంలో కరెంట్ తీగలు తగిలి భార్యాభర్తలు ఇద్దరు మృతిచెందిన ఘటన జరిగింది. ఈ పూర్తి వార్త కోసం ఈ లింక్(Couple Dies by Electrocuted in Vikarabad) క్లిక్​ చేయండి.​

జంతువుల కోసం అమర్చిన ఉచ్చుకు తగిలి గ్రేహౌండ్స్​ కానిస్టేబుల్​, యువ రైతు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.