ETV Bharat / state

దొంగాట - ఖాకీలకు మస్కా కొట్టి ఠాణా నుంచి రెండు సార్లు పరార్! - Thief escaped from police station

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 12:37 PM IST

Thief Escapes From Police Station in Hyderabad : ఇళ్లలోని కుళాయిలు చోరీ చేస్తున్న దొంగను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. అయితే ఆ దొంగ పోలీసులకు మస్కా కొట్టి స్టేషన్ నుంచి రెండు సార్లు పరార్ అయ్యాడు. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

thief_escapes_from_police_station_in_hyderabad
thief_escapes_from_police_station_in_hyderabad (ETV Bharat)

Thief Escaped Second Time From Police Station : అతగాడు ఓ దొంగ, అలా అని గజదొంగ కాదు. ఇళ్లలో కుళాయి పైపులను చోరీ చేస్తుంటాడు. తరచూ దొంగతనాలు చేస్తుండటంతో పక్కా ప్లాన్ వేసి అతన్ని స్థానికులు పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అయితే, పోలీసుల కళ్లుగప్పి ఆ దొంగ పరారయ్యాడు. వెంటనే అతడి కోసం గాలించి ఆచూకీ కనిపెట్టి జైల్లో వేశారు పోలీసులు. మళ్లీ ఠాణా నుంచి ఖాకీలకు మస్కా కొట్టి పారిపోయాడు. ఇలా రెండు సార్లు పోలీస్​స్టేషన్ నుంచి పరార్ అయిన ఘటన తెలంగాణలోని హైదరాబాద్​ యూసుఫ్​గూడ పరిధిలో చోటు చేసుకుంది. పరారైన దొంగను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.

పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్ యూసుఫ్​గూడ సమీపంలోని యాదగిరినగర్​లో ఇటీవల కాలంలో ఇళ్లలోని కుళాయిలు చోరికి గురవుతున్నాయి. అనుమానం వచ్చి స్థానికులు దగ్గర్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా ఓ దొంగ నల్లాలను కాజేస్తున్నట్లుగా కనిపించింది. ఈ వీడియోలు కాస్త బస్తీ కమిటీ నాయకులు వాట్సాప్​ గ్రూపుల్లో ఫార్వార్డ్​ చేశారు.

చివరికి ఈ నెల 1వ తేదీన నిఘా పెట్టి దొంగను స్థానికులు పట్టుకున్నారు. యాదగిరి నగర్ జనరల్ సెక్రటరీ కె.మహేందర్ దొంగను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. పట్టుబడ్డ దొంగ నేపాల్​కు చెందిన వికాస్​గా గుర్తించారు. ఠాణా నుంచి అదే రోజు దొంగ పరారయ్యాడు. మళ్లీ జూబ్లీహిల్స్ ప్రాంతంలో శుక్రవారం రోజున రెండో సారి దొంగను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్​లో ఉంచారు. మధురానగర్ పోలీసులకు మస్కా కొట్టి పోలీసు స్టేషన్ నుంచి ఆదివారం సాయంత్రం మళ్లీ పారిపోయాడు ఆ దొంగ.

ఈ క్రమంలో విధి నిర్వహణలో పోలీసుల నిర్లక్ష్యం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగ పరారవ్వడంతో వెంటనే పెట్రోలింగ్, బ్లా కోల్డ్స్​ పోలీసుల్ని అప్రమత్తం చేసి వెదికినా నిందితుడి జాడ లభ్యం కాలేదు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరుస దొంగతనాలకు పాల్పడుతూ, పోలీసులకే సవాల్ విసురుతున్న దొంగను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

'మహిళా దొంగలు మాయ చేశారు'- 'ఏటీఎం ధ్వంసం చేసి 29లక్షలు చోరీ' - Theft Cases in AP

నోట్ల కట్టల బదులు వాటర్​ బాటిళ్లు- చోరీ కేసును పోలీసులు కేసును ఎలా ఛేదించారంటే! - JADCHERLA BUS THEFT CASE SOLVED

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.