ETV Bharat / state

కూల్​డ్రింక్​లో మత్తుమందు కలిపి ఇస్తారు - ఆపై దొరికినంతా దోచేస్తారు

చెన్నై-బాపట్ల పినాకిణి ఎక్స్​ప్రెస్​లో మహిళకు మత్తు కలిపిన కూల్​డ్రింక్​ - బంగారం, నగదు దొంగతనం

MASSIVE THEFT ON TRAIN
Chori At Chirala Railway Station (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2024, 3:14 PM IST

Theft in Train Coming from Chennai to Chirala: రైలు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ప్రయాణంలో ఉండగా మన పక్కన కూర్చుని ఉండే కొద్ది మంది అపరిచిత వ్యక్తులు మనతో మాటామంతీ జరపవచ్చు. ఆ క్రమంలో వారు మన బలహీనతను పసిగట్టి మనల్ని మోసగించే ప్రయత్నం చేస్తారు. సరిగ్గా ఇలాంటి ఘటనే చెన్నై నుంచి బాపట్లకు వచ్చే పినాకిణి ఎక్స్​ప్రెస్​లో చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే.. చెన్నై నుంచి బాపట్లకు వచ్చే రైలులో ప్రయాణిస్తున్న అనురాధ అనే మహిళకు మత్తు మందు ఇచ్చి బంగారం దోచుకెళ్లిన ఉదంతం శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. రైలులో అనురాధ అనే మహిళ ప్రయాణిస్తుంది. రైలు నెల్లూరు సమీపంలో ఉండగా మహిళకు మత్తుమందు కలిపిన శీతల పానీయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చారు. తాగిన కాసేపటికి ఆ మహిళ స్పృహ కోల్పోయింది. ఇదే తమకు అదునుగా భావించిన ఆ వ్యక్తులు ఆమె వద్ద ఉన్న బంగారం, నగదును ఎత్తుకెళ్లారు.

మత్తులో ఉన్న మహిళను తోటి ప్రయాణికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారాన్ని అందించారు. అప్పుడు ఆమెను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత జరిగిన ఈ దొంగతనంపై రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

అప్రమత్తత అవసరం: బాధితురాలైన అనురాధకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. చీరాలలోని ప్రాంతీయ వైద్యశాల అత్యవసర విభాగంలో ఆమెకు వైద్యాన్ని అందిస్తున్నట్లు వారు వెల్లడించారు. రైలులో అపరిచిత వ్యక్తులతో మాట్లాడవద్దని ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. వారు ఇచ్చే తినుబండారాలను, శీతల పానీయాలను తాగొద్దని అన్నారు. దీంతో పాటు విలువైన వస్తువులను, అధిక మొత్తంలో నగదును తమతో తీసుకువెళ్లొద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు.

కూల్​డ్రింక్​లో మత్తు మందు కలిపి ఇస్తారు - ఆపై అందినకాడికి దోచేస్తారు - Police Arrest Theft Gang in Trains

జాగ్రత్త - ఇంటికి తాళం వేశారో అంతా మాయమే - Thieves Robbery at House In kadapa

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.