ETV Bharat / state

"దొంగ తెలివి" ఇంట్లో సెల్​ఫోన్ చోరీ - తిరిగి దుకాణంలో వాళ్లకే బేరం పెట్టిన ఘనుడు - THEFT CASE IN CHERUKUPALLI

చెరుకుపల్లిలో రెచ్చిపోయిన దొంగ

Theft Case in Cherukupalli
Theft Case in Cherukupalli (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2024, 9:30 AM IST

Robbery Cases in Cherukupalli : చోరీలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏ వస్తువు అయితే నాకేంటి నాపనేదో నేను చేసేస్తే పోలా అనుకుంటున్నారు. ఇక ఇళ్లు, దేవాలయాలు, కార్యాలయాలకు తాళం కనిపించిదంటే చాలు చేతికి పని దొరికిందని సంబరపడుతున్నారు. వాటిని లూఠీ చేసే వరకు మనశ్శాంతి లభించదనుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. రద్దీ ప్రదేశాలు, జన సముహా ప్రాంతాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కేటుగాళ్లు తమ చేతివాటానికి పనిచెబుతున్నారు. చటుక్కున అందినకాడికి దోచుకొని అక్కడినుంచి ఉడాయిస్తున్నారు. అతనో దొంగ. ఇళ్లలోకి ప్రవేశించి చేతికి అందినకాడికి దోచుకున్నాడు. అందులో ఓ మొబైల్​ఫోన్ కూడా ఉంది. ఆ సెల్​ఫోన్​ను అమ్మాలని ప్రయత్నించాడు. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ అతడికి ఎదురైంది. అదెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల సమయలో తలుపులు తెరిచి ఉంచిన ఇళ్లు, వైద్యశాలల్లోకి ప్రవేశించి చేతికందిన వస్తువులు, నగదు దొంగిలించే వ్యక్తిని చెరుకుపల్లి వాసులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం ప్రకారం తెనాలి రోడ్డులో భాస్కర్‌ థియేటర్‌ సమీపంలో ఓ ఇంట్లోకి అమృతలూరు మండలం, పాంచాళవరానికి చెందిన సునీల్‌కుమార్‌ తెల్లవారుజామున వెళ్లి బల్లపై ఉన్న మొబైల్​ఫోన్​ను దొంగిలించాడు. తిరిగి 7గంటల సమయంలో వారికే చెందిన దుకాణానికి వెళ్లి తాను దొంగిలించిన సెల్​ఫోన్ అమ్మేందుకు ప్రయత్నించాడు.

Burglary in Houses at Cherukupalli : తమ ఫోన్‌ చూసి వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. సునీల్‌కుమార్​ని పట్టుకుని దేహశుద్ధి చేయగా పలు దొంగతనాల గురించి చెప్పాడు. ఈ క్రమంలోనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చెరుకుపల్లి ఎస్సై అనిల్‌కుమార్‌ అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే ఆరుంబాక పంచాయతీ పరిధి, కామినేనివారిపాలాని చెందిన బెల్లంకొండ దుర్గ ఇటీవల అనారోగ్యంతో గుళ్లపల్లి కోఠి సెంటర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఈ నేపథ్యంలోనే ఈనెల 16న ఆమె ఉదయం వేళ వైద్యశాలలో నిద్రిస్తుండగా, సహాయకుడు బయటకు వెళ్లాడు. ఆ సమయంలో తన చేతి సంచిలో బంగారు గొలుసు, రూ.16,000 నగదు అపహరణకు గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గతంలో ట్రాన్సుపోర్టు అధికారి ఇప్పుడు దొంగ - ₹40లక్షలు చోరీ 42 గంటల్లోపే!

బాపట్ల జిల్లాలో భారీ చోరీ - లారీని అడ్డగించి వ్యాపారి నుంచి రూ.39 లక్షలు అపహరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.