ETV Bharat / state

మిర్యాలగూడలో 140.5 కిలోల గంజాయి సీజ్​ - ఒకరి అరెస్టు - Police Seized Ganja In Miryalaguda

Police Seized Ganja In Miryalaguda : భారీ ఎత్తున తరలిస్తున్న గంజాయిని పోలీసులు సీజ్​ చేశారు. రెండు కార్లలో తరలిస్తుండగా అనుమానం వచ్చి తనిఖీ చేసిన పోలీసులు 140.585 కిలోల గంజాయిని, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది.

Police Seized Ganja In Miryalaguda
Police Seized Ganja In Miryalaguda (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 4:33 PM IST

Police Seized Ganja In Miryalaguda : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అక్రమంగా రవాణా చేస్తున్న140.585 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శరత్​ చంద్ర పవార్​ వివరించారు.

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ వన్​టౌన్ పోలీసులు పట్టణంలో తనిఖీలు చేస్తున్న క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పట్టణ శివారు నందు రెండు వాహనాలు అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని పరిశీలించగా కారులో ఉన్న నలుగురు వ్యక్తులు పారిపోయారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లను తనిఖీ చేయగా అందులో గంజాయి లభ్యమైంది. మొత్తం 140.585 కిలోల సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న భుక్యా రామును విచారించగా సూర్యాపేట జిల్లా పెన్​ పహడ్​ మండలానికి చెందిన నూనవత్ జగన్​, నూనావత్ మంచ్యా నాయక్​ల ఆదేశాల మేరకు గంజాయిని తరలిస్తున్నట్లు నిందితుడు తెలిపాడు. నిర్జన ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తులు సరఫరా చేసిన గంజాయిని రెండు వాహనాలలో లోడ్ చేసుకుని రవాణా చేస్తున్నట్లు వివరించాడు. నిందితుడి నుంచి గంజాయితో పాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.

నిందితుల కోసం గాలింపు : నిందితులను నూనవత్ జగన్(32), నూనావత్ మంచ్యా నాయక్(45), ఆంగోతు నాగరాజు(33), బాణోతు సాయి(28)లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నారు. నిందితుల గురించి మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. గంజాయి రవాణాలో పట్టుబడ్డ రాముపై మరియు ఇతర నిందితులపై గతంలో కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.

"గంజాయి తరలిస్తున్నారనే సమాచారం ప్రకారం రెండు వాహనాలను తనిఖీ చేసి పట్టుకోవడం జరిగింది. ఆ రెండు కార్లలో 140 కిలోల గంజాయిని సీజ్​ చేశాము. నిందితులు పాత నేరస్తులు. వీరు హైదరాబాద్​, సూర్యాపేట నుంచి వాహనాలు తెప్పించుకుని గంజాయిని తరలిస్తున్నారు. నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం"- శరత్​ చంద్ర పవార్, ఎస్పీ

Nalgonda SP On Ganja Smuggling : గంజాయి, మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ పవార్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాదకద్రవ్య వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉక్కుపాదంతో అణిచివేస్తున్నామని వెల్లడించారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. సరఫరా చేసే వారి వివరాలను డయల్ 100 ద్వారా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆరు బస్సుల్లో 30 కేజీల గంజాయి తరలింపు - అబ్దుల్లాపూర్​మెట్​ వద్ద 10 మంది అరెస్ట్

రైళ్లలో భారీగా పెరుగుతున్న గంజాయి రవాణా - గుట్టుగా రాష్ట్రాలు దాటిస్తున్న స్మగ్లర్లు -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.