ETV Bharat / state

ఎర్రమలగుహల్లో ఆదిమానవుడి పెయింటింగ్స్ - దాచేస్తున్న మైనింగ్ మాఫియా

వైఎస్సార్​ జిల్లా ఎర్రమల కొండల్లో శిలా రేఖా చిత్రాలు - మొదటిసారిగా గుర్తించిన ఇర్విన్‌ న్యూ మేయర్‌

ten_thousand_years_old_paintings_found_in_chintakunta_caves_in_ysr_district
ten_thousand_years_old_paintings_found_in_chintakunta_caves_in_ysr_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Ten Thousand Years Old Paintings Found in Chintakunta Caves In YSR District : ఆది మానవుడు నడయాడిన చింతకుంట ప్రాంతంలోని గుహలు దేశంలోనే రెండోస్థానంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బింబేట్కాలో అతిపెద్ద గుహల సముదాయం ఉండగా, ఆ తర్వాతి స్థానం మనదే కావడం విశేషం. కానీ వైఎస్సార్​ జిల్లా వాసులకు కూడా ఆ విషయం తెలియదు. చరిత్రను చదివే విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు చూపించేలా వేల సంవత్సరాల నాటి రేఖా చిత్రాలు రాళ్లపై చెక్కు చెదరకుండా ఉన్నప్పటికీ అది నిరుపయోగమే అయ్యిందిన్నేళ్లు.

ఈ గుహల్లో విలువైన ఖనిజాలు ఉండడంతో గుహలను గుర్తిస్తే తమ తవ్వకాలకు ఇబ్బంది అని వాటిని వెలుగు చూడకుండా ముసుగులు కప్పేస్తున్నారు కొందరు. 'గ్రాండ్‌ కానియన్ ఆఫ్‌ ఇండియా'గా గుర్తింపు పొందిన గండికోట అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో సమీపంలోనే ఉన్న ఈ గుహలను సైతం అభివృద్ధి పరిస్తే పర్యాటకం మరింత విస్తరిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

వైఎస్సార్​ జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట గ్రామంలోని ఎర్రమల కొండల్లో ఉన్న శిలా రేఖా చిత్రాలు ఆది మానవుడి కాలం నాటివి. నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఇవి ప్రసిద్ధి పొందాయి. ఈ కొండల నడుమ పెద్దగా ఉన్న బండరాళ్లపై ఆది మానవుడు గీసిన రేఖా చిత్రాలు ఉన్నట్లు చరిత్రకారులు, పురావస్తు నిపుణులు స్పష్టం చేశారు.

ఎర్రమల కొండ గుహల్లో ఆది మానవుడు గీసిన అద్భుత రేఖా చిత్రాలు

  • పురావస్తు నిపుణుడు, ఆస్ట్రియా దేశానికి చెందిన ఇర్విన్‌ న్యూ మేయర్‌ మొదటి సారి వీటిని గుర్తించారు. అంతే కాకుండా 'ది ప్రి హిస్టారిక్‌ రాక్‌ ఆర్ట్‌ ఆఫ్‌ ఇండియా' అనే పుస్తకాన్ని 1993లో ప్రచురించారు. అందులో చింతకుంట గుహలను గురించి ప్రముఖంగా పేర్కొనడంతో పాటు దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద ఆది మానవుడి కేంద్రంగా వివరించారు.
  • మధ్యయుగం, నవీన శిలాయుగం నాటి మానవుడు ఇక్కడ నివాసం ఉన్నారని, ఈ రేఖా చిత్రాలు సామాన్య శకానికి పూర్వం 8000-1500 మధ్య కాలం నాటివని అధికారులు పేర్కొన్నారు.
  • ఇక్కడ గుహలపై ఆకు పసర్లు, రాళ్ల పొడిని కలిపి శిలలపై చిత్రించిన రేఖా చిత్రాలు వేల ఏళ్లుగా చెక్కు చెదరకుండా స్పష్టంగా ఉన్నాయి. ఈ శిలాశ్రయాలపై తెలుపు,ఎరుపు రంగుల్లో మొత్తం 200కు పైగా వర్ణ చిత్రాలు ఉండొచ్చని అంచనాలున్నాయి. ఈ చిత్రాల్లో దుప్పి,జింక, ఎద్దులు, మూపురం, ఏనుగులు, కుందేలు, నక్క, హైనా, పక్షులు, సర్పాలు, రేఖాంశ రూపాలతో పాటు మానవాకృతులు ఉన్నాయి. వీటిలో శృంగారంలో ఉన్న దంపతుల బొమ్మ సైతం ఇక్కడ చిత్రాల్లో ఉంది.

చరిత్ర సాక్ష్యాలుగా మొగల్రాజపురం గుహలు - వారి ఆవాసం కోసం నిర్మించినవేనా?

  • చింతకుంటలోని రాక్‌ పెయింటింగ్స్‌ కలిగి ఉన్న రాక్‌ షెల్టర్లను జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించడానికి గుర్తించినట్లు అప్పటి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
  • చింతకుంట గుహ సముదాయంలోని ఎర్రమండ కొండలను పరిశీలిస్తే అక్కడ సుమారు 200 పెద్ద గుండ్లు (సిలికాన్‌ రాయి) ఉన్నట్లు నిపుణలు గుర్తించారు. అక్కడే ప్రత్యేకంగా ఓ పెద్ద గుండు కనబడుతోంది. ఇది గొడుగు ఆకారంలో ఉన్న కారణంగా స్థానికులు దాన్ని గొడుగు గుండు అని పిలుస్తారు. పురావస్తు శాఖ నిపుణులు ఈ గొడుగు గుండుపై కూడా అలనాటి రేఖా చిత్రాలను గుర్తించారు.
  • చింతకుంటలోని గుహలపై చిత్రాలు దక్షిణ భారత దేశంలోనే ప్రముఖ శిలా చిత్రలేఖనాల స్థావరంగా పేరొందినప్పటికీ ఆ ప్రాంతం ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ వేల ఏళ్ల క్రితం నాటి అపురూపమైన సంపద ఉన్నా సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. ఈ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చే సందర్శకులకు చింతకుంట గుహలను చేరుకోవడానికి సరైన రహదారి కూడా లేకపోవడం గమనార్హం.
  • ఇటీవలే కేంద్ర పర్యాటకశాఖ సాస్కి పథకం కింద ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటను అభివృద్ధి చేసేందుకు రూ.77.90 కోట్లు కేటాయించింది. గండికోటకు 37 కి.మీ. దూరంలో ఉన్న ఈ అరుదైన ఆది మానవుడి రేఖా చిత్రాలు కలిగిన చింతకుంటను కూడా అభివృద్ధి పరిస్తే పర్యాటకులు ఇక్కడకు తరలివచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అజంతా అందాలతో ఏలూరు జిల్లాలో ప్రాచీన బౌద్ధారామం - GUNTUPALLI BUDDHIST CAVES

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.