Telugu Family Donated Rs. 417 Crores to a Children Hospital in America: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాబేకు చెందిన ప్రవాస తెలుగు కుటుంబం గొప్ప మనసు చాడుకుంది. అమెరికాలో స్థిరపడ్డ డా.పగిడిపాటి దేవయ్య-రుద్రమ్మ కుటుంబం తమ 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానికంగా ఉన్న సెయింట్ జోసఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫౌండేషన్‌కు రూ. 417కోట్లు (50మిలియన్ డాలర్లు) విరాళంగా అందజేశారు. డా. పగిడిపాటి కుటుంబ సభ్యులు సిద్ధార్థ, అమీ, రాహుల్, నేహా, సృజని, అర్జున్, ఇషాన్, ఆరియా, అరెన్లు కూడా ఈ విరాళానికి తమవంతుగా సహకరించారు. ఈ విరాళం టంపాలో ఆరోగ్య సంరక్షణకు ఇప్పటి వరకు ఇచ్చిన అతిపెద్ద విరాళాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచింది.
టీడీపీ ఫర్ ఆంధ్రా వెబ్‌సైట్‌కు అనూహ్య స్పందన - Huge Response TDP for Andhra
పిల్లల కోసం అత్యాధునిక ఆరోగ్య సంరక్షణను మరింత పెంచే వ్యూహంలో భాగంగా ఈ విరాళాన్ని ఇచ్చినట్లు డా. దేవయ్య కుటుంబం తెలిపింది. నూతనంగా నిర్మించే ఈ పిల్లల ఆసుపత్రికి పగిడిపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎట్ సెయింట్ జోసెఫ్ (Pagidipati Children's Hospital at St. Joseph) అని పేరు పెట్టనున్నట్లు తెలిపారు. డాక్టర్ రుద్రమ, దేవయ్యలు నాట్స్‌తో పాటు అనేక ఇతర సేవా సంస్థలకు తమ సహకారం అందిస్తున్నారు. ఆయన దాతృత్వ స్ఫూర్తిని నాట్స్ హర్షించి అభినందనలు తెలిపింది.
'రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన కృషి' - ₹1.30కోట్ల విరాళం అందించిన ప్రవాసాంధ్రులు
పగిడిపాటి దేవయ్య వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. 1970లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో పీజీ ఫెలోషిప్ పూర్తిచేసిన దేవయ్య భారతదేశం గర్వించదగ్గ వైద్యుడిగా ఎదిగారు. అమెరికాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన కంపెనీల జాబితాలో దేవయ్య కంపెనీ ఏడో స్థానంలో ఉంది. ఆ సంస్థకు అధిపతి అయిన దేవయ్య అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో అత్యంత సమర్థత కలిగిన వారు.
బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సేవ చేసేందుకే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు : పెమ్మసాని చంద్రశేఖర్
దేవయ్య తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్‌లలో కంపెనీలు పెట్టి యువతకు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించారు. 35 సంవత్సరాలు అమెరికాలో ఉన్నపటికీ అమెరికా పౌరసత్వం తీసుకోలేదు. పేదలకు సేవా చేయాలనే ఉద్దేశంతో మదర్ థెరిసా హెల్పింగ్ హాండ్స్ అనే సంస్థను స్థాపించి ఎంతో మంది పేద వాళ్లకు దేవయ్య అండగా నిలిచారు.