ETV Bharat / state

మగ్గంపై అద్భుత కళాఖండం - బంగారు చీరను నేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నేతన్న - Golden Saree Weaves in Sircilla

Golden Saree Weaves in Sircilla : బంగారు చీరను చేనేత మగ్గంపై నేసి ఔరా అనిపించాడు సిరిసిల్లాకు చెందిన చేనేత కార్మికుడు నల్లా విజయ్​కుమార్. హైదరాబాద్​కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె వివాహం కోసం, 200 గ్రాముల బంగారంతో గోల్డ్ చీరను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Nalla Vijaykumar Weave Golden Saree
Golden Saree Weaves in Sircilla (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2024, 3:47 PM IST

Updated : Sep 28, 2024, 7:03 PM IST

Nalla Vijaykumar Weave Golden Saree : తెలంగాణ ఎన్నో జానపదకళలకు, హస్తకళలకు నిలయం. ముఖ్యంగా మన రాష్ట్రంలోని చేనేత పరిశ్రమ ఎంతో పేరుగాంచింది. జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోను పలు అవార్డులను కైవసం చేసుకుంది. అగ్గిపెట్టేలో పట్టే చీరను నేసి అబ్బుర పరిచిన నేతన్నలు, తాజాగా బంగారు చీరను మగ్గంపై నేసి ఔరా అనిపించారు.

వివరాల్లోకెళ్తే.. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణ చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్, 200 గ్రాముల బంగారంతో బంగారు చీరను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. హైదరాబాద్​కు చెందిన వ్యాపారవేత్త వారి కూతురి వివాహం కోసం బంగారు చీర తయారు చేయాలని నల్లా విజయ్​కుమార్​ని సంప్రదించారు. చీరను తయారు చేయాలని ఆరు నెలల క్రితమే ఆర్డర్ వచ్చిందని విజయ్​కుమార్ తెలిపారు. బంగారాన్ని జరిపోవులు తీయడానికి, కొత్త డిజైన్ తయారు చేయడానికి పది నుంచి 12 రోజులు పట్టిందని ఆయన చెబుతున్నారు.

ఈ బంగారు చీర పొడవు ఐదున్నర మీటర్లు, వెడల్పు 49 ఇంచులు, బరువు 800 నుంచి 900 గ్రాముల లోపల ఉంటుందన్నారు. వచ్చే నెల 17వ తేదీన వ్యాపారి కుమార్తె వివాహం కోసం ఈ చీర తయారు చేశామన్నారు. ఈ చీరలో 200 గ్రాములు బంగారాన్ని ఉపయోగించామన్నారు. ఈ చీర తయరీకి 18 లక్షల రూపాయల ఖర్చు జరిగినట్లు తెలిపారు. బంగారంతో చీర తయారు చేయడం తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.

విజయ్​కుమార్ నేపథ్యం : తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నల్లా విజయ్ కుమార్, బంగారు చీరలను మాత్రమే కాకుండా రంగులు మారే త్రీడీ చీరను సైతం రూపొందించారు. శ్రీరామనవమి(Sri Rama Navami 2024) సందర్భంగా భద్రాచలంలోని సీతమ్మవారికి రంగులు మారే త్రీడీ చీరను రూపొందించారు. ఈ త్రీడీ చీర ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్న దీని బరువు 600 గ్రాములు. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరుపు వర్ణాలతో తయారు చేశానని విజయ్​ తెలిపారు. ఇందుకు రూ.48 వేలు ఖర్చు అయిందన్నారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, ఉంగరంలో దూరే చీరను కూడా విజయ్‌కుమార్‌ నేసి ప్రశంసలు పొందారు.

రాష్ట్రంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం - నేత కార్మికుల బీమా కోసం రూ. 6 కోట్లు - National Handloom Day Celebration

YUVA : మసకబారిన చేనేత వృత్తికి ఊపిరిపోయాలని సాఫ్ట్​వేర్​ కొలువు వదిలాడు - జాతీయస్థాయిలో అవార్డు సంపాదించాడు - National Handloom Award for mukesh

Last Updated : Sep 28, 2024, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.