Telangana Residents got Liquor Shops in AP : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడ నిర్వహించిన లాటరీలో తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా దుకాణాలను దక్కించుకున్నారనే విషయం తెలుసా? ఏంటి ఆంధ్రా మద్యం దుకాణాలను ఇతర రాష్ట్రాల వారు ఎలా దక్కించుకున్నారని అనుకుంటున్నారా? అక్కడి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి? అసలు ఎంతమంది తెలంగాణ, ఇతర రాష్ట్రాల వారు మద్యం దుకాణాలను దక్కించుకున్నారు?
ఈసారి ఏపీ ప్రభుత్వం దేశం మొత్తంలోని ఏ రాష్ట్రం వారైనా మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకునేలా నిబంధనలు తీసుకొస్తూ అవకాశం కల్పించింది. దీంతో పలు రాష్ట్రాల వారు కూడా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన వ్యక్తులు అత్యధికంగా మద్యం దుకాణాలను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తులు దుకాణాల ఏర్పాటుకు జాక్ పాట్ కొట్టేశారు.
తెలంగాణకు చెందిన వ్యక్తులకు మద్యం దుకాణాలు : తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఎన్టీఆర్ జిల్లాలోని మూడు దుకాణాలను దక్కించుకున్నారు. ఆ జిల్లా వత్సవాయిలోని 96వ నంబరు దుకాణానికి 132, 97వ నంబరు దుకాణానికి 120, పెనుగంచిప్రోలులోని 81వ నంబరు దుకాణానికి 110 దరఖాస్తులు రాగా అవి ఆంధ్రావాసులకు దక్కలేదు. ఆ మూడు దుకాణాల లైసెన్సులు లాటరీలో పక్క రాష్ట్రమైన తెలంగాణ వ్యక్తులకు వరించాయి. అందులో 96వ నంబరు దుకాణం ఖమ్మం జిల్లా ఖానాపురానికి చెందిన చెరుకుపల్లి సత్యనారాయణకు, 97వ నంబరు దుకాణం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బండి అనూషకు, 81వ నంబరు దుకాణం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన తల్లపల్లి రాజుకు లభించాయి. అలాగే ఏలూరు జిల్లా కుక్కునూరులోని 121వ నంబరు దుకాణానికి 108 దరఖాస్తులు రాగా విలీన మండలాల్లో ఒకటైన వేలేరుపాడుకు చెందిన కామినేని శివకుమారి లాటరీలో లక్కీ టిప్ కొట్టేశారు.
కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్టాల వారిని కూడా మద్యం దుకాణాలు :
- విజయవాడలోని 14,18వ నంబరు దుకాణాలు మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ వాసులకు దక్కాయి. రాహుల్ శివ్‌హరే, అర్పిత్ శివ్‌హరే వీటిని దక్కించుకున్నారు.
- మచిలీపట్టణంలో ఓ దుకాణాన్ని కర్ణాటకు చెందిన మహేశ్ బాతే దక్కించుకున్నారు.
- అక్కే మచిలీపట్టణంలోని మరో దుకాణాన్ని దిల్లీ వాసి లోకేశ్ చంద్ దక్కించుకున్నారు.
- ఒడిశాకు చెందిన మద్యం వ్యాపారులకు శ్రీకాకుళం జిల్లా పాతపట్టణం నియోజకవర్గంలో రెండేసి దుకాణాలు దక్కాయి.
- కర్నూలు జిల్లాలో 10 మద్యం దుకాణాలు తెలంగాణ, కర్ణాటకకు చెందిన వ్యాపారులు సొంతం చేసుకున్నారు.
- కొన్ని జిల్లాల్లో ప్రవాసాంధ్రులు వారి పేరిట, బంధువులు, కుటుంబీకుల పేరిట దరఖాస్తు చేసుకొని దుకాణాలు దక్కించుకున్నారు.
ఏపీలో మద్యం దుకాణాలకు లాటరీ ముగిసింది - విజేతలు ఎవరంటే!
లాటరీ లక్ ఎవరికో? మద్యం కిక్ ఎవరికో? - వైన్స్ దరఖాస్తుదారుల్లో టెన్షన్ టెన్షన్