ETV Bharat / state Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 27 August 2024 

Telangana News Today Live : తెలంగాణ Tue Aug 27 2024 లేటెస్ట్‌ వార్తలు- YUVA : చిన్నప్పటి నుంచే అమెరికాలో చదవాలనే కల - చివరికి నాలుగు వర్సిటీల్లో కోటికి పైగా స్కాలర్​షిప్​తో సీటు - SakethSagar us University Scholar

author img

By Telangana Live News Desk

Published : Aug 27, 2024, 10:29 AM IST

Updated : Aug 27, 2024, 10:15 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

10:12 PM, 27 Aug 2024 (IST)

YUVA : చిన్నప్పటి నుంచే అమెరికాలో చదవాలనే కల - చివరికి నాలుగు వర్సిటీల్లో కోటికి పైగా స్కాలర్​షిప్​తో సీటు - SakethSagar us University Scholar

Georgia University Scholarship : విదేశాల్లో చదువు అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రతిభ, ఆసక్తి ఉన్నా ఫీజు భయంతోనే ఎక్కువమంది వెనకడుగు వేస్తుంటారు. ఐతే అక్కడి యూనివర్సిటీలు నిర్వహించే పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిస్తే అతితక్కువ ఖర్చుతోనే ఉన్నతవిద్య కల నెరవేర్చుకోవచ్చు. ఆ అవకాశం రెండు చేతులా అందిపుచ్చుకున్నాడీ ఖమ్మం కుర్రాడు. జార్జియా యూనివర్సిటీలో 100 శాంత స్కాలర్‌షిప్‌తో సీటు సాధించాడు. మరి, ఆ అరుదైన ఈ అవకాశం ఎలా అందుకోగలిగాడో ఈ కథనంలో చూద్దాం. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KHAMMAM STUDENT US SCHOLARSHIPS

10:08 PM, 27 Aug 2024 (IST)

సైబర్​వలలో డబ్బులు పోగుట్టుకున్న వ్యక్తి - 1930కి డయల్ చేయడంతో డబ్బు తిరిగొచ్చేలా చేసిన పోలీసులు - Cyber Crime Police Recovered Money

Cyber Crime Police Recovered Money : హైదరాబాద్​లోని నేరేడ్​మెట్​లో ఓ వ్యక్తి సైబర్​ నేరగాళ్ల​ వలలో చిక్కి రూ. 1,26,752 పోగుట్టుకున్న డబ్బును సైబర్​ క్రైం పోలీసులు రికవరీ చేసి అప్పగించారు. హైదరాబాద్​లోని నేరేడ్​మెట్ గీతానగర్​లో నివాసం ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తి సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ ఓపెన్ చేసి డబ్బును పోగొట్టుకున్నాడు. దీంతో మోసపోయానని తెలిసి 1930కి డయల్ చేయడంతో పోలీసులు నిందితుల ఖాతాలను సీజ్ చేసి డబ్బులను రికవరీ చేసి బాధితునికి అప్పగించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CYBER CRIME IN HYDERABAD

08:33 PM, 27 Aug 2024 (IST)

గోషామహల్​లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి - New Osmania Hospital at Goshamahal

Osmania Hospital Shifting to Goshamahal : గోషామహల్​లో 32 ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రి భవనాలను చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు. అలాగే గోషామహల్​లో ఉన్న పోలీస్ స్టేడియాన్ని పేట్లబురుజుకు తరలింపుపై పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - OSMANIA HOSPITAL

08:16 PM, 27 Aug 2024 (IST)

హైడ్రా నోటీసులు ఇవ్వదు - కూల్చడమే : కమిషనర్ రంగనాథ్ - Commissioner Ranganath On HYDRA

Commissioner Ranganath On HYDRA : హైడ్రా నోటీసులు ఇవ్వదని, కేవలం కూల్చడమే ప్రధానమని హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ స్పష్టం చేశారు. చెరువు ఎఫ్​టీఎల్ ఆక్రమించి కళాశాలలు నిర్మించే యాజమాన్యాలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అయితే అందులో చదివే విద్యార్థుల భవిష్యత్​ను రోడ్డున పడేయకుండా ఆయా కళాశాలల యాజమాన్యానికి కొంత సమయం ఇస్తామని రంగనాథ్ తెలిపారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - COMMISSIONER RANGANATH ON HYDRA

07:59 PM, 27 Aug 2024 (IST)

ఇంజినీర్లను ప్రశ్నించిన జస్టిస్​ పీసీ ఘోష్ - 'కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల గురించి అడిగితే పొంతన లేని సమాధానాలు' - JUSTIC PC Ghose QUESTION Engineers

Justice PC Ghose Questioned Kaleshwaram Engineers : కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లపై ఇంజినీర్లను జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ ప్రశ్నించింది. వారిని డిజైన్ల గురించి అడిగితే పొంతలేని సమాధానాలు చెప్పారు. ప్రాజెక్టు డిజైన్​ తయారు చేసే ముందు సైట్​ విజిట్​ కచ్చితంగా చేయాల్సిన అవసరం లేదని ఇంజినీర్లు కమిషన్​తో పేర్కొన్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - JUDICIAL INQUIRY ON KALESHWARAM

07:31 PM, 27 Aug 2024 (IST)

ఫోన్‌ మారిస్తే నేరం చేసినట్లా? - కవిత పాత్ర ఉందని చెప్పేందుకు ఆధారాలేంటి? : ఈడీ, సీబీఐలపై సుప్రీం అసహనం - Supreme Expressed Displeasure on ED

Supreme Anger over ED and CBI : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు నేడు బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులపై దర్యాప్తు చేస్తోన్న ఈడీ, సీబీఐ తీరును ప్రశ్నించిన ధర్మాసనం, కేంద్ర దర్యాప్తు సంస్థల నిష్పక్షపాత వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఎవరినైనా ఎంపిక చేసుకొని నిందితులుగా పేర్కొంటారా? అని ప్రశ్నించింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - SUPREME EXPRESS DISPLEASURE ON CBI

07:06 PM, 27 Aug 2024 (IST)

కలరా నియంత్రణకు భారత్​ బయోటెక్​ హిల్​కాల్​ వ్యాక్సిన్​ - Bharat Biotech Oral Cholera Vaccine

Bharat Biotech Oral Cholera Vaccine : కలరా వ్యాధి నియంత్రణకు భారత్​ బయోటెక్​ ఓరల్​ వ్యాక్సిన్​ను తయారు చేసింది. వెల్కమ్​ ట్రస్ట్​, హిలమెన్​ ల్యాబరేటరీస్​తో కలిసి హిల్​కాల్​ పేరుతో వ్యాక్సిన్​ను మార్కెట్​లోకి విడుదల చేసింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BHARAT BIOTECH

05:36 PM, 27 Aug 2024 (IST)

వీధికుక్కల స్వైర విహారం - గుడిసెలో ఉన్న వృద్ధురాలిపై దాడి, తీవ్రగాయాలు - dogs attack on old woman siddipet

Dog Attack In Siddipet : రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోజు ఎక్కడో ఓ చోట దాడులు చేస్తూ ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఒంటరిగా ఓ పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్న వృద్ధురాలిపై పది కుక్కలు దాడి చేశాయి. తలపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం అయింది. స్థానికులు గమనించి కుక్కలను తరిమి కొట్టారు. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DOG ATTACK IN SIDDEPET

05:14 PM, 27 Aug 2024 (IST)

సెప్టెంబరు 17 నుంచి ప్రజా పాలన - రేషన్​ కార్డు, హెల్త్​ కార్డుల కోసం వివరాల సేకరణ - Health Cards for telangana people

CM Revanth Reddy Meeting : సెప్టెంబరు 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. పూర్తి హెల్త్​ ప్రొఫైల్​తో రాష్ట్రంలో ప్రజలందరికీ హెల్త్​ కార్డులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CM REVANTH REDDY

04:23 PM, 27 Aug 2024 (IST)

ఫాస్ట్‌ట్యాగ్‌​కూ కాలం చెల్లిందా? - కొత్త టెక్నాలజీతో టోల్​గేట్ల పరిస్థితి ఏంటి? - FASTag Changed to GNSS

FASTag Changed to GNSS : ఫాస్ట్​ట్యాగ్​ రాకతో హైవేలపై టోల్​ప్లాజాల వద్ద వాహనాల క్యూలైన్లు తగ్గిన మాట వాస్తవమే కానీ, ఆశించిన ఫలితాలు రావడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ప్రయాణించిన దూరం కంటే ఫీజు అధికంగా ఉంటోందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్తగా ప్రవేశపెడుతోన్న నూతన టెక్నాలజీతో ప్రయాణ దూరానికి మాత్రమే టోల్​ చెల్లించే అవకాశం ఉంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - FASTAG AND GNSS

02:11 PM, 27 Aug 2024 (IST)

ఇదేంటి - ఈ ఇంటి మీద హెలికాప్టర్‌​ దిగిందా? - ఆ ఇంటి వాటర్​ ట్యాంక్​పైకి కారెక్కిందా! - Attractive Water Tanks

Attractive Water Tanks in Sangareddy : శాస్త్ర సాంకేతికంగా ఏదైనా ఒక వస్తువు కనిపెట్టాలన్నా, కొత్త ఆవిష్కరణలు చేయాలన్నా తప్పని సరిగా ఇన్నోవేషన్‌గా ఆలోచించాలి. లేదా శాస్త్రవేత్తలు అయి ఉండాలి. ప్రస్తుతం ఉన్న సమాజంలో కొంత మంది చదువులేని రైతులు, తాపీ మేస్త్రీలు వినూత్న ఆవిష్కరణలకు తెర తీస్తున్నారు. వీరి నుంచి ఉద్భవిస్తున్న ఆవిష్కరణలకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులు కావాల్సిందే. ఇంటి మీదికి కారెక్కిందా, పొరపాటున హెలికాప్టర్ వచ్చి దిగిందా అనే విధంగా వీరి ఆవిష్కరణలు ఉన్నాయి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - ATTRACTIVE WATER TANK DESIGNS

01:26 PM, 27 Aug 2024 (IST)

వేములవాడ ఆలయంలో ఏసీబీ రైడ్స్ - పలు అధికారులపై బదిలీ వేటు - ACB RAIDS IN VEMULAWADA TEMPLE

Officials Frauds In Vemulawada Temple : వేములవాడ రాజన్న ఆలయంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దేవదాయశాఖ అధికారుల లీలలు ఏసీబీ విచారణలో బయటపడ్డాయి. మూడు రోజుల క్రితం ఆలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్‌ రేంజ్‌ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో జరిగిన ఈ సోదాల్లో తప్పిదాలను గుర్తించి పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - ACB RAIDS IN VEMULAWADA TEMPLE

12:56 PM, 27 Aug 2024 (IST)

ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట - దిల్లీ మద్యం కేసులో బెయిల్ మంజూరు - BRS MLC KAVITHA GRANTED BAIL

BRS MLC Kavitha Bail Granted : బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు ఊరట లభించింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆమెకు దాదాపు 5 నెలల అనంతరం బెయిల్ దొరికింది. ఈ మేరకు సుప్రీంకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు

12:36 PM, 27 Aug 2024 (IST)

నిబంధనల ప్రకారమే గెస్ట్‌హౌస్‌ నిర్మించా - లేదని తేలితే నేనే కూల్చేస్తా : పట్నం మహేందర్‌రెడ్డి - PATNAM MAHENDER REDDY ON HYDRA

Ex Minister Patnam on HYDRA Demolitions : ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తన గెస్ట్‌హౌస్‌ నిర్మించామని మాజీమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం లేదని తేలితే తానే కూల్చివేస్తానని స్పష్టంచేశారు. హైడ్రాను తాను సమర్థిస్తున్నానని, తన గెస్ట్‌హౌస్‌కు సంబంధించి ఇప్పటివరకు నోటీసులు రాలేదని వెల్లడించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HYDRA DEMOLITIONS IN HYDERABAD

12:37 PM, 27 Aug 2024 (IST)

CBSE సిలబస్​ ఎఫెక్ట్​ - ఇంగ్లీష్​లో 77%, మ్యాథ్స్​లో 72% మంది ఫెయిల్‌ - AP CBSE STUDENTS PROBLEMS

AP CBSE Students Failed : జగన్‌ అనాలోచిత నిర్ణయాలు నేటి విద్యార్ధులకు శాపంగా మారాయి. కనీస అవగాహన లేకుండా ఒకేసారి 1000 పాఠశాలల్లో సీబీఎస్ఈ పరీక్షా విధానం ప్రవేశపెట్టిన తీరు ప్రచార ఆర్భాటం తప్ప, విద్యార్థులకు ఎంత మాత్రం ఉపయోగపడలేదన్నది తేలిపోయింది. ఈ పరీక్షా విధానంలో బోధించే ఉపాధ్యాయులు లేకుండానే తీసుకున్న నిర్ణయాల ఫలితం అంతర్గత మదింపు పరీక్షల్లో వెలుగుచూసింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - YSRCP GOVT IN CBSE DECISION

12:29 PM, 27 Aug 2024 (IST)

'ఫోన్‌లో మెసేజ్‌లను నేనూ తరచూ డిలీట్ చేస్తా' - కవిత బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో న్యాయమూర్తి - MLC Kavitha bail petition

  • దిల్లీ: ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ
  • విచారణ చేస్తున్న జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ విశ్వనాథన్‌ ధర్మాసనం
  • ఎమ్మెల్సీ కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గి
  • సుప్రీంకోర్టుకు చేరుకున్న కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత భర్త అనిల్‌
  • దిల్లీ: సుప్రీంకోర్టుకు చేరుకున్న పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు
| Read More
ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MLC KAVITHA BAIL PETITION HEARING

12:05 PM, 27 Aug 2024 (IST)

రిజిస్ట్రేషన్‌ మార్కెట్ విలువల పెంపుపై అధ్యయనం - సవరణల కోసం పొరుగు రాష్ట్రాల్లో అధ్యయనం - TG GOVT ON REGISTRATIONS INCOME

Telangana Govt On Registrations Income : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ మార్కెట్ విలువలు ఇప్పట్లో పెంచే అవకాశం కనిపించడం లేదు. రెవెన్యూ రాబడిపై లోతైన అధ్యయనంతో పాటు శాస్త్రీయంగా సవరణలు చేసేందుకు క్షేత్రస్థాయి మార్కెట్‌ ధరలపై కసరత్తు సాగుతోంది. రిజిస్ట్రేషన్లతో పాటు ఇతరత్ర సేవల ద్వారా అదనపు ఆదాయం పెంచుకునే మార్గాల అన్వేషణ జరుగుతోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GOVT TO IMPROVE REGISTRATION INCOME

11:43 AM, 27 Aug 2024 (IST)

తెలంగాణలో వైరల్ ఫీవర్స్ - మీకు ఈ లక్షణాలున్నాయా? - ఐతే హస్పిటల్ వెళ్లాల్సిందే! - Viral Fevers In Telangana

Viral Fevers Spreading In Telangana : వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒళ్లు నొప్పులు, అలసటతో మెడికల్ షాపులకి వెళ్లి మందులు కొనుక్కోని వేసుకుంటున్నారు. అయినా తగ్గకపోతే ఆసుపత్రులకు బారులు తీరుతున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - VIRAL FEVERS IN TELANGANA

11:20 AM, 27 Aug 2024 (IST)

కృష్ణం వందే జగద్గురుమ్- కృష్ణతత్వం ఏం చెబుతోంది?- పాటించడం ఎలా - LIFE LESSONS FROM LORD KRISHNA

Sri Krishna Janmashtami Celebartions 2024 : కృష్ణం వందే జగద్గురుమ్. శ్రీకృష్ణుడు అంటే దేవుడు మాత్రమే కాదు ఓ మంచి స్నేహితుడు, అంతకు మించి మార్గనిర్దేశనం చేసే గురువు కూడా అని చెబుతారు. అనాది మనం వింటోన్న మాట ఇది. ఒక మనిషిగా మం ఎలా జీవించాలో, ఎలా జీవించ కూడదో అని కృష్ణతత్వం ఏం చెబుతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - SRI KRISHNA JANMASHTAMI 2024

11:03 AM, 27 Aug 2024 (IST)

చరిత్రకెక్కని నెత్తుటి వీరగాథ - బైరాన్‌పల్లి నరమేథానికి 76 ఏళ్లు - 76 Years For Veera Bairanpally

Bairanpalle Martyrs Remembrance Day 2024 : సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్‌పల్లి చరిత్రకెక్కని ఓ నెత్తుటి గాథ. అదో వీరోచిత పోరాటం, సరిగ్గా 76 ఏళ్ల క్రితం జలియన్‌ వాలాబాగ్‌ను మించిన నరమేధం. ఎందరో మట్టి మనుషులు తిరుగుబాటు చేసి అమరులై నేలకొరిగిన వైనం. దోపిడీపై దండయాత్ర జరిపి రజాకారు మూకలపై నిప్పు కణికలై రగిలిన ఈ ఘటనే సాయుధ పోరాటానికి పెద్దఎత్తున సాగేందుకు ఊపిరి పోసింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BAIRANPALLY BATTLE

10:57 AM, 27 Aug 2024 (IST)

గణేశ్‌ విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారా? - ఈ నిబంధనలను తప్పనిసరి పాటించాల్సిందే - GANESH IDOL INSTALLATION GUIDELINES

Ganesh Idols Installation Guidelines : హైదరాబాద్ మహానగరంలో అత్యంత వైభవంగా జరిగే పండుగల్లో వినాయకచవితి ఒకటి. బొజ్జగణపయ్యను నవరాత్రులు పూజించి గంగమ్మ ఒడికి చేరుస్తారు. గణేశ్ మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తప్పనిసరని నగర పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GANESH FESTIVAL INSTRUCTIONS IN HYD

09:10 AM, 27 Aug 2024 (IST)

హీరోయిన్​పై వైసీపీ నేత వేధింపులు - తెర వెనుక పార్టీ పెద్దలు, ఖాకీ అధికారులు - YSRCP LEADERS TORCHER TO ACTRESS

YSRCP Leaders Harassed To Mumbai Actress : ఏపీ మాజీ సీఎం జగన్‌ హయాంలో వైఎస్సార్సీపీ పెద్దలు, కొందరు ఐపీఎస్ అధికారులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ముంబయికి చెందిన ఓ సినీనటిని ప్రేమ పేరిట లొంగదీసుకున్న కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ఒకరు, పెళ్లి చేసుకోకుండా మోసగించినట్లు సమాచారం. ఆపై నటి, ఆమె కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి బెదిరించి తమ జోలికి రాకుండా రాజీచేసుకున్నట్లు తెలిసింది. వేధింపుల వెనుక వైఎస్సార్సీపీ ముఖ్యనాయకుడు, ఓ సీనియర్‌ ఐపీఎస్ అధికారి కీలకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - IPS OFFICERS HARASSED ACTRESS

07:40 AM, 27 Aug 2024 (IST)

ఆక్రమణలతో హైదరాబాద్ అల్లకల్లోలం - హైడ్రా రాకతో ఆ అధికారుల్లో హడల్​ - Land Encroachment in Telangana

Massive Land Encroachments in Telangana : ఒకవైపు చెరువులు, లేక్‌ల పరిరక్షణకు సమావేశాలు ఇంకోవైపు ఆక్రమణలు జరిగాయంటూ స్వయంగా అధికారుల ఫిర్యాదులు చేసిన ఉదాంతం. అయినా కొరవడిన చర్యలు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నాలాల ఆక్రమణలు, చెరువుల్లో విల్లాల నిర్మాణాలు యథేచ్ఛగా సాగిన తీరిది. అయితే వీటిపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాతో ఇప్పుడు కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MASSIVE LAND GRABS IN TELANGANA

07:53 AM, 27 Aug 2024 (IST)

తెలంగాణకు జ్వరమొచ్చింది - డెంగీ దడ పుట్టిస్తోంది -2 నెలల్లో 4,294 కేసులు - DENGUE CASES RISING IN TELANGANA

Dengue Cases in Telangana : రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ కేసులు భారీగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 5 వేల372 మంది డెంగీ బారిన పడినట్టు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. రెండు నెలల్లో 4 వేల మందికి సోకడం చూస్తే వ్యాప్తి తీవ్రత అర్థమవుతోంది. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రిలో చూపించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DENGUE FEVER CASES IN TELANGANA

Last Updated : Aug 27, 2024, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.