ETV Bharat / state Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 28 September 2024 

Telangana News Today Live : తెలంగాణ Sat Sep 28 2024 లేటెస్ట్‌ వార్తలు- నూనెలు కొనలేం! - పప్పులు తినలేం!! - పండుగల వేళ వంటింట్లో 'ధర'ల మంట - Essentials Price Increased

author img

By Telangana Live News Desk

Published : 2 hours ago

Updated : 14 minutes ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

09:16 AM, 28 Sep 2024 (IST)

నూనెలు కొనలేం! - పప్పులు తినలేం!! - పండుగల వేళ వంటింట్లో 'ధర'ల మంట - Essentials Price Increased

Essentials Prices Increased : పండుగల సీజన్‌ వేళ నిత్యవసర ధరలు మండిపోతున్నాయి. నూనె, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పప్పులు ఇలా ప్రతి ఒక్కదాని ధర అమాంతం పెరిగి, సామాన్య ప్రజలపై కొండంత భారాన్ని మోపుతున్నాయి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - ESSENTIALS PRICE INCREASED

08:49 AM, 28 Sep 2024 (IST)

'మా ఇళ్లను కూడా హైడ్రా కూల్చేస్తుందేమో' - భయంతో మహిళ ఆత్మహత్య - Woman Suicide Due to Hydra

Woman Commits Suicide Due to Hydra : హైడ్రాకు భయపడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. తమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తుందేమోనని భయంతో శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా దీనిపై హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ కూడా స్పందించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - WOMAN SUICIDE BY HYDRA

07:41 AM, 28 Sep 2024 (IST)

నేడు హైదరాబాద్​కు రాష్ట్రపతి రాక - సాయంత్రం వరకు ఆ మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు - President Murmu visit hyderabad

President Murmu Visit to Telangana : భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ఒక్క రోజు పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి శామీర్‌పేట సమీపంలో నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయ 21వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నర్సింహులు తదితరులు పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తొమ్మిది రోజుల పాటు జరగనున్న భారతీయ కళా మహోత్సవ్‌ను రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన దృష్టిలో పెట్టుకుని నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - PRESIDENT DROUPADI MURMU

07:26 AM, 28 Sep 2024 (IST)

రామోజీ ఫిల్మ్​సిటీలో దసరా, దీపావళి కార్నివల్‌ - 46 రోజుల పాటు సంబురాలే సంబురాలు - Carnival In Ramoji Film City

Carnival In Ramoji Film City : పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌సిటీలో దసరా, దీపావళి వేడుకల్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 46 రోజుల పాటు సంబురాలు కొనసాగనున్నాయి. భూతల స్వర్గంగా పేరొందిన ఫిల్మ్‌సిటీ ప్రత్యేక వేడుకలకు చేసిన ముస్తాబుతో మిలమిలా మెరిసిపోతోంది. వెలుగు జిలుగులతో పర్యాటకులకు సరికొత్త అనుభూతుల్ని పంచుతోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CARNIVAL IN RAMOJI FILM CITY

07:07 AM, 28 Sep 2024 (IST)

త్వరలో మూసీ బఫర్‌జోన్‌లోని నిర్మాణాలపైనా సర్వే - ఇవాళ్టి నుంచి నిర్వాసిత విద్యార్థుల వివరాల సేకరణ - Musi River Buffer Zone survey

Survey in Musi Buffer Zone : మూసీ ప్రక్షాళనలో భాగంగా నదీ గర్భంలో సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం త్వరలోనే బఫర్‌జోన్‌లోని నిర్మాణాలపైనా సర్వే చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు నిర్వాసితుల కుటుంబాల్లోని విద్యార్థుల వివరాలు సేకరించబోతున్నారు. వారి విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్ల సమీపంలోనే ప్రవేశాలు కల్పిస్తామని సర్కార్‌ వెల్లడించింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MUSI DEMOLITION NEWS

06:52 AM, 28 Sep 2024 (IST)

'కనీసం ఒక్కరోజైనా ఆగలేరా? - కూల్చివేతల్లో ఎందుకింత దూకుడు' : హైడ్రాపై హైకోర్టు సీరియస్ - tg HC Serious on HYDRA Demolitions

High Court Serious on HYDRA Demolitions : అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతల్లో ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. శనివారం నోటీసు ఇచ్చి, ఆదివారం కూల్చేస్తారా? కనీసం ఒక్కరోజైనా ఆగలేరా? అంటూ ప్రశ్నించింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటని మరోసారి అడిగిన హైకోర్టు, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని కూల్చివేతలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కమిషనర్ రంగనాథ్‌కు, అమీన్‌పూర్‌ తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HYDRA DEMOLITION IN AMEENPUR

Last Updated : 14 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.