ETV Bharat / state Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 7 September 2024 

Telangana News Today Live : తెలంగాణ Sat Sep 07 2024 లేటెస్ట్‌ వార్తలు- ఖమ్మం జిల్లాలో మళ్లీ కుంభవృష్టి - మున్నేరు ముప్పు దృష్ట్యా అధికారులతో భట్టి సమీక్ష - DY CM Bhatti Review On Floods

author img

By Telangana Live News Desk

Published : Sep 7, 2024, 7:20 AM IST

Updated : Sep 7, 2024, 10:15 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

10:13 PM, 07 Sep 2024 (IST)

ఖమ్మం జిల్లాలో మళ్లీ కుంభవృష్టి - మున్నేరు ముప్పు దృష్ట్యా అధికారులతో భట్టి సమీక్ష - DY CM Bhatti Review On Floods

DY CM Bhatti Review On Munneru Floods : ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షాల వల్ల మున్నేరు వాగు ప్రవాహం మరోసారి పెరుగుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఖమ్మం జిల్లాకు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. వరద పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MINISTER THUMMALA ON MUNNERU FLOODS

10:06 PM, 07 Sep 2024 (IST)

కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టింది : హరీశ్​రావు - Harish Rao Slams Congress Govt

BRS Senior Leader Harish Rao On Education Dept : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై విపరీత నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. అందుకు నిదర్శనమే నేటి బాసర ట్రిపుల్​ ఐటీ ఉదంతమని ఎక్స్​ వేదికగా విరుచుకుపడ్డారు. మరోవైపు గురుకుల విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HARISH RAO ON EDUCATION DEPT

09:36 PM, 07 Sep 2024 (IST)

ప్రముఖ రచయిత నలిమెల భాస్కర్‌కు ప్రజాకవి కాళోజీ పురస్కారం - Kaloji Award 2024

Nalimela Bhaskar select for Kaloji Award : సాహితీరంగంలో సేవలందించిన వారికి ఏటా తెలంగాణ ప్రభుత్వం బహుకరించే ప్రఖ్యాత కాళోజీ సాహిత్య పురస్కారానికి ప్రముఖ కవి, రచయిత నలిమెల భాస్కర్‌ ఎంపికయ్యారు. ఈ నెల తొమ్మిదో తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - NALIMELA BHASKAR GOT KALOJI AWARD

07:53 PM, 07 Sep 2024 (IST)

కోలుకుంటున్న ఖమ్మం - 860 ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటి సర్వే - Munneru Flood Victims Recovering

Munneru River Flood Victims 2024 : మున్నేరు వరద విలయంతో కకావికలమైన ఖమ్మం క్రమంగా కోలుకుంటోంది. ముంపు ప్రాంతాల్లో అధికార యంత్రాంగం యుద్ధప్రాపదికన సహాయచర్యలు సాగిస్తోంది. అంటురోగాలు జ్వరాలు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు వివిధ స్వచ్చందసంస్థలు, రాజకీయ పార్టీల నేతలు బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KHAMMAM FLOODS 2024

07:32 PM, 07 Sep 2024 (IST)

పారాలింపిక్స్​ కాంస్య విజేత దీప్తి జీవాంజికి రూ.కోటి నజరానా, గ్రూప్​-2 ఉద్యోగం - CM Felicitates Jeevanji Deepti

CM Revanth Felicitates Jeevanji Deepti : పారాలింపిక్స్​లో సత్తాచాటిన తెలంగాణ బిడ్డ యంగ్ అథ్లెట్ దీప్తి జీవాంజికి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ మేరకు ఆమెకు గ్రూప్​-2 ఉద్యోగంతో పాటు కోటి రూపాయల నగదును ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - జీవాంజి దీప్తిని సత్కరించిన సీఎం

07:09 PM, 07 Sep 2024 (IST)

గణపతి బప్పా మోరియా : ఖైరతాబాద్‌ సప్తముఖ మహా గణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు - KHAIRATABAD GANESH 2024

Khairatabad Ganesh 2024 : గణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడు. ఈసారీ సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువుదీరాడు. విగ్రహం ప్రతిష్ఠంచి 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ దఫా 70 అడుగులతో భారీ గణనాథున్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తొలి పూజ చేసిన అనంతరం సామాన్య భక్తుల దర్శనానికి అనుమతించారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సైతం బడా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 రోజులపాటు మహా గణపతి భక్తులకు దర్శనమివ్వనున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - VINAYAKA CHAVITHI 2024 CELEBRATIONS

05:52 PM, 07 Sep 2024 (IST)

మల్లాపూర్​ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం - ఎగిసిపడుతోన్న మంటలు - Fire Accident At Mallapur In HYD

Fire Accident At Mallapur Industrial Estate : హైదరాబాద్​ మల్లాపూర్​లోని పారిశ్రామికవాడలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెయింట్​ పరిశ్రమలో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - FIRE ACCIDENT AT MALLAPUR

05:44 PM, 07 Sep 2024 (IST)

NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి పీసీసీ పీఠం వరకు - మహేశ్‌కుమార్‌ గౌడ్‌ రాజకీయ ప్రస్థానమిదే - PCC President Mahesh Kumar Goud

New PCC President Mahesh Kumar Goud : తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఎంపికయ్యారు. ఆయన ఎక్కడో నిజామాబాద్‌ జిల్లాలో మారుమూల గ్రామంలో జన్మించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థాయికి చేరారు. విద్యార్థి దశలోనే ఎన్‌ఎస్‌యూఐలో ప్రవేశించిన ఆయన, నేడు కాంగ్రెస్‌లో అత్యున్నత పదవి దక్కించుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ రాజకీయ నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MAHESH KUMAR GOUD POLITICAL LIFE

05:39 PM, 07 Sep 2024 (IST)

YUVA : విద్యార్థులు బడికి డుమ్మాకొట్టారంటే ఈ మాస్టర్ ఇంటికొచ్చేస్తారు ​- ఇక పిల్లలతో పాటు పెద్దలకూ పాఠాలు! - Teacher Teaching Innovative Way

Special Story On Nalgonda Teacher : ఆచార్య దేవోభవ అంటూ గురువుకు అగ్రాసనం వేసిన సంస్కృతి మనది. విద్యార్థి భవిష్యత్తును అంచనా వేసి అభివృద్ధి పథంలో నడిపిస్తాడు ఉపాధ్యాయులు. విద్యార్థుల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా శ్రమించి, వాళ్లు వృద్ధిలోకి వస్తే మా శిష్యులు అంటూ గర్వపడతారు. అలాంటి ఓ గురువు నల్గొండ జిల్లా దామెర ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గురిజ మహేశ్. బడికి రాని విద్యార్థులను ఇంటికెళ్లి మరి తీసుకొస్తూ, ప్రయోజకులను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాదండోయ్ తల్లిదండ్రులకు సైతం చదువు వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో చూద్దామా! | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - SPECIAL STORY ON NALGONDA TEACHER

03:09 PM, 07 Sep 2024 (IST)

రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ! - Heavy Rain Alert to Telangana

IMD Alert To Telangana Rains : రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HEAVY RAINS UPDATES

02:48 PM, 07 Sep 2024 (IST)

అప్పులు తీసుకుని - అడిగితే సైనైడ్ ప్రయోగించి - మూడేళ్లలో 4​ హత్యలు చేసిన తల్లీకుమార్తె - Women Gang Cyanide Murders in ap

Murders with Cyanide in AP : డబ్బు కోసం చుట్టుపక్కల వారిని సైనైడ్​తో చంపుతున్న ఘటనలు ఏపీలోని గుంటూరు జిల్లాలో కలకలం సృష్టించాయి. మహిళ అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టగా, పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. ముగ్గురు మహిళలు ముఠాగా ఏర్పడి, ఈ ఘాతుకాలు చేస్తున్నట్లు తెలిసి పోలీసులు నివ్వెరపోయారు. ఈ ముఠా చేతిలో పడి నలుగురు మరణించగా, మరో ముగ్గురు తప్పించుకున్నారు. ఈ వ్యవహారంలో మాజీ వాలంటీర్ ఒకరు కీలక నిందితురాలిగా ఉండటం విశేషం. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CYANIDE MURDERS IN AP

02:25 PM, 07 Sep 2024 (IST)

గూగుల్‌ మ్యాప్‌ గుర్తించని వరద - స్పందించిన అధికారులు - తల్లీకుమారుడు సేఫ్​ - Google Map mistake vijayawada

Car Stuck in Flood Due to Google Map Misdirection in Vijayawada : ఎక్కడికి వెళ్లాలన్నా వాహనం, చేతిలో ఫోన్​ ఉంటే చాలు అనుకునే వారే ఎక్కువ ఈ రోజల్లో. వెళ్లాల్సిన ప్రదేశానికి దారి కూడా తెలియదు కొందరికైతే. గూగుల్​ మ్యాప్​తో ప్రంపంచాన్ని చుట్టేయచ్చొంటారు కొందరు. కానీ ఈ మ్యాప్స్​ను అనుసరించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్లూ లేకపోలేదు. ఇలాంటి ఘటనే ఏపీలోని విజయవాడ సమీపంలో జరిగింది. కారులో ప్రయాణిస్తూ మ్యాప్స్​ను ఫాలో అయిన ఆ తల్లీకుమారుడు వరదలో చిక్కుకున్నారు. చివరకు ఏం జరిగిందంటే? | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - SON AND MOTHER STUCK IN FLOODS

01:18 PM, 07 Sep 2024 (IST)

'ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మికులు పరిహారం కోసం ఇంకెంతకాలం ఎదురు చూడాలి' - KTR Latest Tweets

KTR on Handloom Workers : కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు దాటుతున్నా సిరిసిల్ల చేనేత కార్మికుల కుటుంబాలు పరిహారం కోసం ఇంకెంత కాలం ఎదురుచూడాలని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ​పరిహారంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినా, ఆ కమిటీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎక్స్​ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు చెత్తగా ఉందని తీవ్ర విమర్శలు చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KTR ON SIRICILLA HANDLOOM WORKERS

12:39 PM, 07 Sep 2024 (IST)

ఖైరతాబాద్​ సప్తముఖ మహాశక్తి గణపతికి సీఎం రేవంత్​ తొలి పూజ - దర్శననానికి పోటెత్తిన భక్తులు - Khairatabad Ganesh first puja

Khairatabad Ganesh : రాష్ట్రంలో వినాయక చవితి సంబురాలు మొదలయ్యాయి. ఖైరతాబాద్​లో గణేశుని విగ్రహం ప్రతిష్ఠించారు. లంబోదరుడికి సీఎం రేవంత్​ రెడ్డి తొలి పూజ చేశారు. ఖైరతాబాద్​లోని సప్తముఖ మహాశక్తి గణపతిని చూడడానికి భక్తులు పోటెత్తారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KHAIRATABAD GANESH IDOL

12:33 PM, 07 Sep 2024 (IST)

ముమ్మరంగా సాగుతున్న ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు - Prakasam Barrage Gates Repairs

Gates Repair Works in Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని సంకల్పించిన ఏపీ ప్రభుత్వం, పనుల్ని వేగంగా చేస్తోంది. ఏడు రోజుల్లో పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ రెండు రోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసేలా అనుభవజ్ఞులైన ఇంజినీర్లు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పడవలు ఢీ కొట్టడంతో ధ్వంసమైన కౌంటర్ వెయిట్ల తొలగింపు ఇప్పటికే పూర్తికాగా, ఇవాళ అధునాతన రీతిలో తయారు చేసిన కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయనున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - PRAKASAM BARRAGE GATES WORKS

12:25 PM, 07 Sep 2024 (IST)

గతేడాది 85 వేలు - ఈసారి ఏకంగా 1.2 లక్షలు - రూ.600 కోట్లకు పైనే గణేశ్ నవరాత్రుల బిజినెస్​ - Ganesh Chaturthi Celebration 2024

Ganesh Chaturthi Festival Celebration : హైదరాబాద్‌లో గణేశ్​ ఉత్సవాలకు అంతా సిద్దం అయింది. వాడవాడలా గణనాథులు వివిధ రూపాల్లో కొలువుదీరుతున్నాయి. ఈ ఏడాది గణేశ్ నవరాత్రి సందర్బంగా రూ.600 కోట్లకు పైనే వ్యాపారం జరుగుతుందని వర్తక యూనియన్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది 85 వేల వరకు విగ్రహాలు కొలువుదీరగా, ఈసారి 1.2 లక్షల వరకు చేరుతుందంటున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GANESH IDOLS MAKING IN DHOOLPET

11:03 AM, 07 Sep 2024 (IST)

'ఆ ప్రాంతంలోనే ఎందుకు 'క్లౌడ్‌ బరస్ట్‌'! - ఎందుకు వేల చెట్లు నేలకూలాయ్? - Cloud Burst in Mulugu

Forest Affected by Cloud Burst in Mulugu : ములుగు జిల్లా తాడ్వాయి, పస్రా అటవీ పరిధిలో క్లౌడ్‌ బరస్ట్​తో పాటు భారీ గాలులు వీయడంతో పెద్దఎత్తున వృక్షాల విధ్వంసం జరిగిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) డోబ్రియాల్‌ పేర్కొన్నారు. తాడ్వాయి అడవుల్లో చెట్ల వేళ్లు లోతుగా లేవని, అందుకే వందల ఎకరాల్లో అడవి ధ్వంసం జరిగిందని చెప్పారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో అధ్యయనం చేయించాలన్న పీసీసీఎఫ్‌, ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CLOUD BURST IN MULUGU

10:49 AM, 07 Sep 2024 (IST)

చనిపోయాడంటూ భూమార్పిడి చేసిన అధికారులు - 'బతికే ఉన్నాను మొర్రో' అంటూ రోడెక్కిన రైతు - Farmer Land Documents Issue

Farmer Land Documents Transfer To Another : వరంగల్‌ జిల్లాకి చెందిన ఓ రైతు బతికుండగానే చనిపోయారని నకిలీ పత్రాలు సృష్టించి వ్యవసాయ భూమి వేరొకరు బదిలీ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతు 'నేను బతికే ఉన్నాను మెుర్రో' అంటూ పోరాటం చేస్తున్నాడు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - FORMER FACED DIFFERENT PROBLEM

09:56 AM, 07 Sep 2024 (IST)

'బుడమేరు మూడో గండి పుడ్చివేత 90 శాతం పూర్తి - మిగతాది మరి కొన్ని గంటల్లో పూర్తి' - Budameru Leakage

Budameru Leakage Works in Vijayawada : ఆంధ్రప్రదేశ్​లో విజయవాడలో ఉన్న బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ పనులను ఇవాళ ఉదయానికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఉద్ధృతంగా వరద ఉన్నప్పుడే రెండు గండ్లను పూడ్చారు. మూడో గండి పనులు దాదాపు పూర్తి అయినట్లే అని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BUDAMERU RESTORATION WORKS NEWS

09:17 AM, 07 Sep 2024 (IST)

మూడు జోన్లగా హైడ్రా విభజన - ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు సన్నాహాలు - Hydra Extension Into Zones

Hydra Extension : అక్రమ కట్టడాలు నిరోధించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాను బలోపేతం చేసే దిశగా సర్కారు కసరత్తు చేస్తోంది. హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనకి అనుగుణంగా యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. హైడ్రా పరిధిని మూడుజోన్లగా విభజించనున్నారు. అక్రమ కట్టడాల నిరోధానికి పురపాలక చట్టంలోనూ మార్పులు చేయాలని సర్కార్‌ భావిస్తోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HYDRA EXTENSION IN GHMC

08:55 AM, 07 Sep 2024 (IST)

వృద్ధుడు నుంచి రూ.13.16 కోట్లు కొట్టేసిన సైబర్​ కేటుగాళ్లు - దర్యాప్తులో పాన్​ ఇండియా సంబంధాలు బహిర్గతం - Stock Market Fraud In Hyderabad

Stock Market Fraud In Hyderabad : దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం కేసు దర్యాప్తును రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో వేగవంతం చేసింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఉన్న సంబంధాలన్ని బహిర్గతమవుతున్నాయి. హైదరాబాద్ మదీనాగూడకు చెందిన విశ్రాంత ఉద్యోగి నుంచి కాజేసిన సొమ్మును ఎక్కడి తరలించారనే విషయమై కూపీ లాగుతున్న క్రమంలో పలు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ సమాచారాన్ని పోలీసులు ఈడీకి ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CYBER CRIME IN TELANGANA

07:59 AM, 07 Sep 2024 (IST)

ఏఐ సిటీకి ప్రపంచ వాణిజ్య కేంద్రం రాక - రాష్ట్ర ప్రభుత్వంతో డబ్ల్యూటీసీఏ ఒప్పందం - AI Global Summit in Hyderabad

AI Global Summit in Hyderabad : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఏఐ సిటీకి అంతర్జాతీయ కంపెనీలు తరలివస్తున్నాయి. ఏఐ సిటీలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన కార్యాలయం నిర్మించేందుకు ప్రపంచ వాణిజ్య కేంద్రం ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఏఐ కంపెనీల రాకకి మార్గం సుగమం అయిందని మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు. రాష్ట్రాన్ని ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయని వివరించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - AI GLOBAL SUMMIT END

07:39 AM, 07 Sep 2024 (IST)

వరద బాధితులకు విరాళాలు వెల్లువ - జీఎంఆర్ సంస్థ​ భారీ సాయం - Floods Donors In Telangana

Floods Donors In Telangana : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వాగులు, ప్రాజెక్టులు, నదులు పొంగి వరద ప్రభావానికి లక్షలాది మంది సర్వస్వం కోల్పోయారు. ప్రకృతి ప్రకోపానికి చెల్లాచెదురైన బాధితులకి మేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థలతో పాటు వివిధ వర్గాల ప్రజలు చేయూత అందిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DONATION FOR FLOOD VICTIMS

07:24 AM, 07 Sep 2024 (IST)

మట్టిగణపయ్యకే ఆసక్తి చూపుతున్న యువత - మొదలైన గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందడి - Demand for Clay Ganesh Idols

Huge Demand for Lord Ganesh Clay Idols : రాష్ట్రంలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల కోలాహలం మొదలైంది. తొమ్మిదిరోజులపాటు విశేష పూజలందుకునే లంబోదరుడు మండపాల్లో కొలువుదీరాడు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కొందరు మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించారు. మట్టి వినాయకుడిని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపాడుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి మట్టిగణపయ్యకు డిమాండ్ బాగానే పెరిగింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DEMAND FOR ECO FRIENDLY GANESH IDOL

06:13 AM, 07 Sep 2024 (IST)

మట్టి గణనాథుడే ప్రకృతికి మంగళకరం - భవిష్యత్తుకు శ్రేయస్కరం - use clay idols save nature

Ganesh Chaturthi Precautions: ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ తయారుచేసి రసాయన రంగులద్దే గణేశ విగ్రహాల స్థానంలో మట్టితో చేసిన వినాయకులను పూజించటం, నిమజ్జనం చేయటం పలు విధాలుగా మేలు చేస్తుందని చెబుతున్నారు. గణేశ ఉత్సవాలు జీవన చక్రంలోని వివిధ దశలైన జననం, జీవనం, మరణాలను సూచిస్తాయని చెబుతారు. ఏ కొత్త కార్యం తలపెట్టినా విఘ్నాలకు అధిపతి అయిన వినాయక స్త్రోత్రంతో ఆరంభించటం మన సంప్రదాయం. ఇంటా, బయటా ఎంతో వేడుక నిర్వహించే గణేశ ఉత్సవాల్లో పర్యావరణ హితాన్ని మరువకూడదని నిపుణులు సూచిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - SOIL GANESH IS AUSPICIOUS

Last Updated : Sep 7, 2024, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.