ETV Bharat / state Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 30 August 2024 

Telangana News Today Live : తెలంగాణ Fri Aug 30 2024 లేటెస్ట్‌ వార్తలు- 3 నెలల్లో 1000 సెల్​ఫోన్లు స్వాధీనం - సైబరాబాద్​ పోలీసుల రికార్డ్ - Police Recover 1000 Phones in hyd

author img

By Telangana Live News Desk

Published : Aug 30, 2024, 9:44 AM IST

Updated : Aug 30, 2024, 6:51 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

06:49 PM, 30 Aug 2024 (IST)

3 నెలల్లో 1000 సెల్​ఫోన్లు స్వాధీనం - సైబరాబాద్​ పోలీసుల రికార్డ్ - Police Recover 1000 Phones in hyd

Cell Phones Recovery in Hyderabad : సెల్‌ ఫోన్‌ పోయింది, ఇక మళ్లీ దొరుకుతుందనే ఆశా పోయింది. సరిగ్గా ఈ సమయంలోనే బాధితుల అడియాశకు జీవం పోస్తూ పోలీసులు చరవాణులను ట్రేస్‌ చేసి పట్టుకుంటున్నారు. పోయిన మీ ఫోన్‌ దొరికిందని బాధితులకు సమాచారం అందజేస్తున్నారు. ఊహించని విధంగా పొయిన ఫోన్‌ తిరిగి దొరకడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా గత మూడు నెలల్లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులు 1000 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CELL PHONES RECOVERY IN HYDERABAD

05:36 PM, 30 Aug 2024 (IST)

YUVA : చిచ్చరపిడుగులా రగ్బీలో సత్తా చాటుతున్న తెలంగాణ అమ్మాయి - దేశానికి ప్రాతినిథ్యమే లక్ష్యంగా అడుగులు - Abhinaya Sri Rugby Player

Abhinaya Sri Rugby player : చిన్నతనం నుంచే ఆ యువతికి ఆటలపై ఎనలేని ఇష్టం. పేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్నప్పటికీ తన లక్ష్యం మాత్రం వదల్లేదు. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టుకోకుండా ప్రతీ అవకాశాన్నీ అందిపుచ్చుకుంటూ కఠోర సాధన చేస్తూ, పట్టణ యువతకే పరిమితమైన రగ్బీ ఆటలో తనదైన ముద్ర వేస్తోంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎక్కడ బరిలోకి దిగినా మైదానంలో మెరుపువేగంతో రగ్బీ ఆటలో సత్తా చాటుతోంది. అనేక క్రీడా పోటీల్లో శభాష్ అనిపించుకుని ప్రశంసలు అందుకున్న ఖమ్మం కు చెందిన యువ క్రీడాకారిణి అభినయశ్రీ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - ABHINAYA SRI FROM KHAMMAM

04:33 PM, 30 Aug 2024 (IST)

టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయండి : సీఎం రేవంత్ కీలక ఆదేశాలు - Yadagirigutta Temple Board

CM Revanth Reddy Review on Yadadri Temple : యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు మాదిరిగా యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు

04:21 PM, 30 Aug 2024 (IST)

తెలంగాణను మరో "బుల్డోడర్ రాజ్" కానివద్దు - కూల్చివేతలపై ఖర్గేకు కేటీఆర్ విజ్ఞప్తి - KTR REACT ON POOR HOUSES DEMOLITION

KTR Reacts on Demolitions in Telangana : తెలంగాణను మరో "బుల్డోడర్ రాజ్" కానివద్దని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు విజ్ఞప్తి చేశారు. మహబూబ్​నగర్​ పట్టణంలోని పేదల ఇళ్ల కూల్చివేతలపై స్పందించిన ఆయన, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చివేతలను ఆపేలా సూచించాలని ఖర్గేను ఎక్స్ వేదికగా కోరారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KTR APPEALED TO KHARGE

04:00 PM, 30 Aug 2024 (IST)

YUVA - ఆకట్టుకుంటున్న యువతి పెయింటింగ్స్ - సందేశాలిచ్చేలా చిత్రకారిణి చిత్రాలు - Yuva on Young Artist

Story on Young Painting Artist : కుంచెలో దాగిన కంచెల్లేని ఆలోచనలను ఆవిష్కరించేది చిత్రం. అలాంటి చిత్రాలను పలు రకాలుగా ఆవిష్కరిస్తోంది ఆ యువతి. విభిన్న శైలుల మేళవింపుతో తనదైన శైలిలో చిత్రాలు గీస్తోంది. చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తినే తన కెరీర్‌గా ఎంచుకుని ముందుకుసాగుతోంది. ఏ బొమ్మ గీసిన దానికి ప్రాణం పోయగలిగితే ఆర్టిస్ట్‌గా విజయవంతమైనట్లే అని చెబుతోంది. ఇంతకీ ఆ యువతి ఎవరు? ఏయే శైలుల్లో చిత్రాలు గీస్తోంది. ఆ వివరాలివి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - YUVA ON PAINTING ARTIST FROM HYD

03:37 PM, 30 Aug 2024 (IST)

మహిళ ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ - నాగార్జున సాగర్​ కెనాల్​లో పడి చివరకు? - Woman Fell into Canal Taking Selfie

Woman Selfi Fell into Nagarjuna Sagar Canal : నాగార్జున సాగర్​ ఎడమ కాల్వ వద్ద సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు మహిళ కాల్వలో పడిపోయింది. అదృష్టవశాత్తు ఆమెను స్థానికులు స్పందించి తాళ్ల సాయంతో రక్షించడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండల కేంద్రంలో జరిగింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - WOMAN SELFI FELL INTO CANAL

03:21 PM, 30 Aug 2024 (IST)

జన్వాడ ఫాంహౌస్​ను ఏ అనుమతులు తీసుకోకుండానే కట్టేశారు! - Hydra Focus on Janwada Farm House

Hydra Focus on Janwada Farm House : అక్రమ నిర్మాణాలను కూల్చుతూ, ఆక్రమణదారుల్లో హడల్‌ పుట్టిస్తున్న హైడ్రా బుల్డోజర్లు, త్వరలోనే జన్వాడ ఫాంహౌస్‌ వైపు కదలనున్నాయి. ఈ ఫాం హౌస్ బుల్కాపూర్‌ నాలా బఫర్‌జోన్‌ పరిధిలో ఉందన్న ప్రచారం మేరకు అధికారులు అంతర్గతంగా పలు అంశాలను సేకరించగా, నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తేలినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నివేదిక ప్రభుత్వానికి చేరుతుందని, అది అందిన వెంటనే హైడ్రా రంగంలోకి దిగుతుందని సమాచారం. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - NO PERMISSIONS TO JANWADA FARMHOUSE

02:40 PM, 30 Aug 2024 (IST)

ఆరు గ్యారంటీలు అమలు చేయలేక - కాంగ్రెస్​ హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తోంది : బండి సంజయ్ - Bandi Sanjay Fires On Congress

Bandi Sanjay Comments On Congress : బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడానికి బీజేపీకి ఏం సంబంధమని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. రాజకీయ నాయకులు భయపడేది కేవలం న్యాయస్థానాలకే అని అన్నారు. న్యాయవ్యవస్థలను అగౌరవపరచొద్దని హితవు పలికారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BANDI SANJAY FIRES ON CONGRESS

02:29 PM, 30 Aug 2024 (IST)

ఐదుగురు అల్లిన 'ప్రేమ'కథా చిత్రమ్ - ఏపీలో 'హిడెన్ కెమెరాల' వ్యవహారంలో క్రేజీ ట్విస్ట్ - Hidden Cameras Incident in AP

Hidden Cameras Incident in AP : ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. కాలేజ్ హాస్టల్​లోని విద్యార్థినుల వాష్​రూమ్​లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు గురువారం అర్ధరాత్రి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ఓ సరికొత్త కోణం బయటపడింది. అసలు సీక్రెట్ కెమెరాలే పెట్టలేదని, ఇదంతా ఓ విద్యార్థి కావాలని చేసిన ప్రచారం అని తెలుస్తోంది. వాస్తవానికి ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన గొడవతో ఓ విద్యార్థి ఈ ప్రచారానికి తెరలేపినట్లు సమాచారం. అసలు ఆ ప్రచారం ఏంటి? ఈ సీక్రెట్ కెమెరాల వెనక ఉన్న అసలు కథేంటంటే? | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GUDLAVALLERU WASHROOM CAMERAS

02:25 PM, 30 Aug 2024 (IST)

జ్వరానికి తెలియదే అక్కడ బెడ్లు లేవని​ - 30 పడకల ఆస్పత్రికి 400 మంది రోగులు - SULTANABAD HOSPITAL ISSUE

Patients OP Problems in Sultanabad : రాష్ట్రవ్యాప్తంగా వైరల్​ జ్వరాలు పంజా విసురుతూ ఉండగా ప్రభుత్వాసుపత్రులు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​లో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి 400 మంది జ్వర పీడితులు పోటెత్తారు. ఓపీ ప్రారంభమైన గంటన్నర వ్యవధిలోనే భారీ సంఖ్యలో రావడంతో ఒకింత ఆసుపత్రి సిబ్బంది కూడా ఆందోళనకు గురైంది. సరిపడా బెడ్స్ లేవని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి వెళ్లాలంటూ సూచించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - PATIENTS OP PROBLEMS IN PEDDAPALLI

01:33 PM, 30 Aug 2024 (IST)

డబ్బున్నోళ్లకు ముందుగా నోటీసులు - పేదల ఇళ్లపైకి డైరెక్టుగా బుల్డోజర్లు - ఇదేం న్యాయం? - Srinivas Goud Fires On Congress

Ex Minister Srinivas Goud On Mahabubnagar Demolitions : సీఎం సొంత జిల్లాలో పేదల, దివ్యాంగుల ఇళ్లు కూల్చడం దారుణమని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. నోటీసులు లేకుండా పేదల ఇళ్లు ఎలా కూలుస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ధనికులకో న్యాయం, పేదలకో న్యాయమా అంటూ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఇళ్లు కోల్పోయిన ఆ నిరుపేదలకు ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - EX MINISTER SRINIVAS GOUD

12:29 PM, 30 Aug 2024 (IST)

ఏపీలో మెట్రో పరుగులు - విశాఖ, విజయవాడకు మహర్దశ - Metro Projects in Andhra Pradesh

AP Metro Rail Projects : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. గత వైఎస్సార్సీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మెట్రో రైలు ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే కేంద్రానికి పంపించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - AP METRO RAIL PROJECTS

11:29 AM, 30 Aug 2024 (IST)

నా వ్యాఖ్యల పట్ల బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా : సీఎం రేవంత్‌రెడ్డి - REVANTH APOLOGIES TO SUPREME COURT

CM Revanth Reddy On Supreme Court Comments : ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ విషయంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్ట్‌ ఆగ్రహం వ్యక్తం చేయగా దానిపై ఆయన స్పందించారు. తనకు భారత న్యాయవ్యవస్థపై అత్యంత గౌరవం, విశ్వాసం ఉందని పేర్కొంటూ ఎక్స్​లో పోస్ట్‌ చేశారు. న్యాయస్థానం విజ్ఞతను ప్రశ్నిస్తున్నట్లు ఆపాదించేలా పత్రికల్లో వచ్చిన తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా విశ్వసించే వ్యక్తిగా న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల తనకు అత్యున్నత గౌరవముందని దాన్ని అలాగే కొనసాగిస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CM REVANTH ON SUPREME COURT

11:19 AM, 30 Aug 2024 (IST)

బీటెక్​ కాలేజీలో దారుణం - అమ్మాయిల​​ వాష్​రూమ్​లో హిడెన్​ కెమెరాలు - అబ్బాయిలకు వీడియోలు విక్రయం! - HIDDEN CAMERAS IN GIRLS WASHROOMS

Hidden Cameras In BTech Girls Washrooms In AP : ఏపీలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీక్రెట్‌ కెమెరాల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. బాలికల హాస్టల్‌ వాష్‌రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆరోపించారు. ఈ విషయంపై బాలికల హాస్టళ్లలో హిడెన్‌ కెమెరా గుర్తించారంటూ ‘ఎక్స్‌’ వేదికగా విద్యార్థుల పోస్టులు పెడుతున్నారు. వారం క్రితమే ఘటన వెలుగు చూసినా యాజమాన్యం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GUDLAVALLERU COLLEGE HIDDEN CAMERAS

10:25 AM, 30 Aug 2024 (IST)

ఐపీఎస్​ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - నేడు విజయవాడ సీపీని కలవనున్న ముంబయి నటి - Mumbai Actress Harassment Case

Mumbai Actress Harassment Case : ముంబయి సినీ నటిని తప్పుడు కేసులో అరెస్టు చేసి ఏపీ పోలీసులు ఇబ్బందులకు గురిచేసినట్లు వచ్చిన ఆరోపణలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు. ఇందులో క్రియాశీలక పాత్ర పోషించిన నాటి బెజవాడ సీపీ కాంతిరాణా, డీసీపీ విశాల్‌ గున్ని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సీసీఎస్‌ ఏసీపీ స్రవంతి రాయ్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, నాలుగు రోజుల్లో స్రవంతి రాయ్‌ రిపోర్ట్ ఇవ్వనున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - YCP MUMBAI ACTRESS CONTROVERSY

09:45 AM, 30 Aug 2024 (IST)

రాంనగర్‌లో హైడ్రా హడల్ - మణెమ్మ కాలనీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత - Hydra Demolitions in Ramnagar

Hydra Focus On Ramnagar Illegal Constructions : హైదరాబాద్​ పరిధిలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు విరుచుకుపడుతోంది. చెరువు పరిధిలో ఉన్నా, నాలాపై ఉన్నా రంగంలోకి దిగుతూ కూల్చివేతలకు తెగబడుతోంది. తాజాగా రాంనగర్‌లోని మణెమ్మకాలనీలో నాలాలపై నిర్మించిన నిర్మాణాలను ధ్వంసం చేసింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - ILLEGAL CONSTRUCTIONS IN RAMNAGAR

09:30 AM, 30 Aug 2024 (IST)

హిమాయత్‌సాగర్‌ వైపు హైడ్రా బుల్డోజర్లు - ఇక కాంగ్రెస్ నేతల వంతు! - Hydra Demolitions in Himayat Sagar

Illegal Constructions in Himayat Sagar : హైడ్రా మరింత దూకుడు పెంచుతోంది. ఎప్పుడు ఎక్కడ కూల్చివేతలు చేపడుతోందని టెన్షన్​తో అక్రమార్కుల గుండెల్లో గుబులు రేగుతోంది. తాజాగా ఈ బుల్డోజర్లు హిమాయత్​ సాగర్​ వైపు సాగనున్నాయి. జలాశయ పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీల నేతల ఇళ్లు, ఇతర పార్టీలు, ప్రముఖుల బంగ్లాలు ఉండటంతో ఈ అంశం మరింత కాకరేపుతోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - ILLEGAL STRUCTURES IN HIMAYAT SAGAR

09:08 AM, 30 Aug 2024 (IST)

మహబూబ్‌నగర్‌లో హైడ్రా తరహా చర్యలు - అక్రమనిర్మాణాలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు - Demolition drive in Mahbubnagar

Demolition Drive in Mahabubnagar : హైదరాబాద్ తరహాలో మహబూబ్‌నగర్‌లోనూ ప్రభుత్వభూముల ఆక్రమణలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. చాలా కాలంగా అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపణలున్న సర్వే నెంబర్‌-523లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. పట్టాలేకుండా, ఉద్దేశపూర్వకంగా నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలనే కూల్చి వేసిననట్లు అర్బన్ తహశీల్దార్ ఘన్సీరాం వెల్లడించారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా ఇళ్లు కూల్చారని తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని బాధితులు నిరసనకు దిగారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DEMOLITION DRIVE IN MAHBUBNAGAR

07:39 AM, 30 Aug 2024 (IST)

వచ్చే ఏడాది ఆఖరుకు దేవాదుల పూర్తి! - నేడు ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష - Minister Uttam Review On Devadula

Telangana Govt to Complete Devadula Soon : దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడంపై, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాజెక్టులో దాదాపు 91శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 2025 డిసెంబర్ నాటికి మిగిలిన పనులు పూర్తి చేసి, 89,312 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ దేవాదుల పంప్‌హౌస్ వద్ద నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కతోపాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొననున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - దేవాదుల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్

08:02 AM, 30 Aug 2024 (IST)

గణేశ్​ మండపాలకు ఉచిత విద్యుత్ - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం - FREE CURRENT FOR GANESH PANDALS

CM Review On Ganesh Festival : అనుమతి తీసుకుంటే గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హుస్సేన్‌సాగర్‌తోపాటు ఇతర జలాశయాల్లోనూ నిమజ్జనం చేయాలని నిర్వాహకులకు సూచించారు. మండపాలు, డీజేలు విషయంలో కోర్టుల మార్గదర్శకాల పాటించాలని స్పష్టం చేశారు. వచ్చే నెల 17న గణేశ్‌ నిమజ్జనం ఉన్న దృష్ట్యా మిలాద్‌-ఉన్‌-నబి ప్రదర్శనల్ని 19న నిర్వహించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరగా మిలాద్ క‌మిటీ ప్రతినిధులు అంగీక‌రించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CM ON FREE POWER FOR GANESH PANDALS

Last Updated : Aug 30, 2024, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.