RDO No Confidence Motion issue : మండల పరిషత్ అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్‌లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి నోటీసులిచ్చే అధికారం ఆర్డీవోకు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆర్డీవో, కలెక్టర్, సబ్ కలెక్టర్‌లకు సమానార్హత ఉన్నందున ఆర్డీవోకు నోటీసులిచ్చే అధికారం ఉందని స్పష్టంచేసింది. కొత్త చట్టం కింద నిబంధనలు రూపొందించనందున పాత నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వడం చెల్లదన్న వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.
నోటీసులిచ్చే అధికారం ఆర్డీవోకు ఉంది : అవిశ్వాస తీర్మానం కోసం ఆర్డీవో ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలాధ్యక్షుడు డి.రవీందర్‌గౌడ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి కొట్టివేశారు. దీంతో రవీందర్‌గౌడ్ వేసిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రవీందర్‌గౌడ్ 2019 జూన్ 7న మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్నారు.
హైకోర్టుకు చేరిన అవిశ్వాస తీర్మానాల పంచాయితీ - ప్రభుత్వానికి నోటీసులు జారీ
HC Judgement On RDO Notice No Confidence Motion issue : పలువురు ఎంపీటీసీలు ఆర్డీవోను కలిసి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ, సమావేశం నిర్వహించాలని కోరారన్నారు. దీంతో ఆర్డీవో పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 245(1) కింద ఈ ఏడాది ఫిబ్రవరి 8న నోటీసు జారీ చేశారన్నారు. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994 స్థానంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 వచ్చిందని అయితే కొత్తచట్టం అమలుకు నిబంధనలు రూపొందించలేదని పేర్కొన్నారు. రద్దయిన పాత చట్టంలోని నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడం చెల్లదన్నారు. నోటీసులిచ్చే అధికారం సహాయ కలెక్టర్‌కు మాత్రమే ఉందని, ఆర్డీవోకు లేదన్నారు.
అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ ఆర్డీవో, సబ్‌కలెక్టర్, సహాయ కలెక్టర్లు పరస్పరం మారుతూ ఉంటారని, అందరూ రెవెన్యూ బ్లాక్ అధిపతులుగా సమానస్థాయి అధికారులేనన్నారు. వాదనలను విన్న ధర్మాసనం కొత్త చట్టం తీసుకువచ్చినా పాత నిబంధనల కింద కొంత రక్షణ ఉందని పేర్కొంది. కొత్త చట్టానికి నిబంధనలు రూపొందించేదాకా పాత చట్టం కింద ఉన్న నిబంధనలను అమలు చేయవచ్చంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదని పేర్కొంటూ అప్పీలును కొట్టివేసింది.
రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న అవిశ్వాసాల జోరు - పీఠాన్ని కైవసం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు
prathidwani: ప్రభుత్వాలపై వ్యక్తులు అవిశ్వాసం ప్రకటించడం నేరమా?