MP Avinash Reddy Anticipatory Bail Cancellation Petition: ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ను రద్దు చేయాలంటూ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.
ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు, సీబీఐతో పాటు వైసీపీ ఎంపీ అవినాష్ (YS Avinash Reddy), వివేకా కుమార్తె సునీత (YS Sunitha)కు నోటీసులు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 28కి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.