ETV Bharat / state

భూమి రిజిస్ట్రేషన్​కు ల్యాండ్ మ్యాప్ తప్పనిసరి - వివాదాల పరిష్కారానికి సర్కార్ కొత్త యోచన - Land Map Mandatory For Registration

Land Map Mandatory For Registration : భూమిల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్​​​ సమయంలో ఆ భూమికి సంబంధించిన మ్యాప్ జోడించడం తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అలా చేయడం వల్ల చాలా సమస్యలు పోతాయని భావిస్తోంది.

Telangana Govt Thinkin Land Map Mandatory For Registration
Telangana Govt Thinkin Land Map Mandatory For Registration (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 7:20 AM IST

Telangana Govt Thinkin Land Map Mandatory For Registration : భూముల రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్‌ సమయంలో ఆ భూమికి సంబంధించిన పటం (మ్యాప్‌) జోడించడం తప్పనిసరి చేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ విధానం అమలు చేస్తే భూ వివాదాలు, డబుల్‌ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తోంది. కర్ణాటకలో 2008వ సంవత్సరం నుంచి దశలవారీగా దీన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం సత్ఫలితాలనిస్తోందని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనగా, ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్‌కుమార్‌ ఈ నెల 5వ తేదీన కర్ణాటక వెళ్లి, అక్కడి రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేశారు. తెలంగాణ భౌగోళిక వాతావరణం, ప్రస్తుత చట్టాల నేపథ్యంలో ఎలాంటి మార్పులను చేయవచ్చనే విషయంపై ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రితో చర్చించారు.

కొత్త చట్టం తీసుకువచ్చే యోచనలో సర్కార్ : తెలంగాణలో 1936లో భూముల సర్వే జరిగింది. ఆ సమయంలో నిర్ణయించిన భూమి హద్దుల ఆధారంగానే ఇప్పటికీ దస్త్రాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే చేపట్టడానికి గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు ప్రయత్నాలు జరిగినా, పలు కారణాల వల్ల ముందడుగు పడలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా సమగ్ర సర్వే చేపట్టాలన్న యోచనతో ఉంది. దీని కన్నా ముందు ఆర్వోఆర్‌ - 2020, ధరణి పోర్టల్‌తో ఉత్పన్నమైన భూ యాజమాన్య హక్కులు, సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని భావిస్తోంది. అందుకోసం ప్రస్తుత చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చే కార్యాచరణ జరగుతోంది.

రిజిస్ట్రేషన్‌ మార్కెట్ విలువల పెంపుపై ఫోకస్ - పొరుగు రాష్ట్రాల్లో అధ్యయనం - TG GOVT ON REGISTRATIONS INCOME

సమగ్ర సర్వే చేపట్టేలోపు భూ సమస్యలకు కొంతవరకైనా అడ్డుకట్ట వేయాలని సర్కారు యోచిస్తోంది. అందులో భాగంగానే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లకు కర్ణాటక తరహాలో భూముల పటాలను జత చేస్తే వివాదాలకు అడ్డుకట్ట పడుతుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కమిటీ సభ్యులు చర్చించిన తర్వాత ఈ విధానంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కొన్ని జిల్లాల్లో సర్వే చేయని భూమి కూడా ధరణి పోర్టల్‌లో నమోదై ఉంది. కొందరు రైతుల ఖాతాల్లో భూమి విస్తీర్ణం పెరిగి ఉంది. రెవెన్యూ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌లో కన్నా ఎక్కువ లేదా తక్కువ భూమి నమోదైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎక్కువగా నమోదైన భూమిని తొలగించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఒకే భూమి ఇద్దరి మీద రిజిస్టర్ అవ్వకుండా ఉండడానికి : నోటీసులు జారీ చేసి ఇలాంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉండగా, నోటీసులు ఇచ్చే అధికారం అధికారులకు ఎవరికీ లేదు. చట్టంలో ఈ నిబంధన పెట్టలేదు. క్షేత్రస్థాయి పరిశీలన అవసరం లేకుండానే ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ - మ్యుటేషన్‌ ప్రక్రియ చేస్తున్నారు. భూమి పటం జోడిస్తే ఏ భూమికి రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఒక్క భూమి ఇద్దరికి (డబుల్‌) రిజిస్ట్రేషన్‌ అవకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి పట్టాభూముల్లో కలుపుకోవడం, ఇతరుల భూముల హద్దులను చెరిపేయడం లాంటి వివాదాలకు కూడా ఈ విధానం వల్ల అడ్డుకట్ట వేయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

4 నెలల్లో రూ.5,126.77 కోట్ల ఆదాయం - ఐదేళ్లలో తొలిసారి పెరిగిన రాబడి - TG REGISTRATIONS REVENUE INCREASED

భూముల రిజిస్ట్రేషన్‌ విలువల పెంపునకు రంగం సిద్ధం - tg land registration charges

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.