ETV Bharat / state

రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్​ - ఏయే శాఖకు ఎంత కేటాయించారంటే ? - TELANGANA BUDGET 2024

Telangana Budget 2024 : అన్నదాత అభ్యున్నతి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను తీసుకొచ్చింది. మొత్తం 2 లక్షల 91వేల 159 కోట్ల రూపాయల అంచనాలతో పద్దును ప్రవేశపెట్టిన ప్రభుత్వం, వ్యవసాయానికి అత్యధికంగా సుమారు 25 శాతం నిధులు కేటాయించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రజా పాలనే లక్ష్యమంటూ ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల అమలకు నిధులు కేటాయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాగునీటి రంగాలకు సైతం దండిగానే నిధులు కుమ్మరించింది.

Telangana Budget 2024
Telangana Budget 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 12:33 PM IST

Updated : Jul 25, 2024, 5:53 PM IST

Bhatti Vikramarka Introducing Telangana Budget 2024 : ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులున్నా ప్రజల ఆకాంక్షలు, హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి పద్దును శాసనసభలో ప్రవేశపెట్టింది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో పోలిస్తే కాస్త ఎక్కువగా 2 లక్షల 91వేల 159 కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పద్దును ప్రవేశపెట్టారు. గత పదేళ్ల అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చరమగీతం పాడిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆర్థిక మంత్రి, దశాబ్ద కాలంలో ఆశించిన మేర అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.

బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారని భట్టి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అటుంచితే రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల అప్పులు కట్టడానికి అప్పులు తీసుకునే పరిస్థితికి రాష్ట్రం దిగజారిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడే నాటికి కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం తాము ఎదుర్కొన్న పెను సవాలన్న భట్టి, గత ప్రభుత్వం చేసిన అప్పులైనా ప్రభుత్వపరంగా బాధ్యతతో వాటిని తీర్చేందుకు అన్ని చర్యలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.

Telangana Budget
Telangana Budget 2024 (ETV Bharat)

ప్రజల ఆకాంక్షల ప్రతిబింబమే బడ్జెట్‌ : బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారం కాదని, మన విలువల, ఆశల వ్యక్తీకరణ కూడా అని పేర్కొన్న భట్టి, ప్రజల ఆకాంక్షలు, నమ్మకాల ప్రతిబింబమే బడ్జెట్‌ అని పేర్కొన్నారు. అసమానతలు లేని సమాజం, అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్‌లో చర్యలు చేపట్టామన్న భట్టి, సాగును బాగు చేసేలా, సంక్షేమం పరిఢవిల్లేలా, కొత్త ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత వాస్తవానికి దగ్గరగా, ప్రణాళికాబద్దమైన బడ్జెట్‌తో ముందుకు సాగుతున్నామన్నారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధి, హామీల అమలే లక్ష్యంగా రూ. 2 లక్షల 91వేల 159 కోట్లతో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి శాసనసభకు సమర్పించారు. ఇందులో రెవెన్యూ రాబడి రూ. 2 లక్షల 21వేల 242 కోట్లు, మూలధన రాబడి రూ.69వేల 572 ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా రూ. లక్షా 38వేల 181 కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 35వేల 208 కోట్లు వస్తుందని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ. 26వేల 216 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా 21వేల 636 కోట్ల రూపాయలు వస్తాయని ప్రతిపాదించారు. బహిరంగ మార్కెట్‌లో రుణాల ద్వారా రూ. 57వేల 112 కోట్లు, కేంద్రం నుంచి రుణాల ద్వారా రూ. 3 వేల 900కోట్లు, ఇతర రుణాల ద్వారా వెయ్యి కోట్లు సమకూర్చుకుంటామని స్పష్టం చేశారు.

తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,47,299 : 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం రూ. 2 లక్షల 20వేల 944 కోట్లు, మూలధన వ్యయం రూ. 33వేల 486 కోట్లు ఉంటుందని భట్టి ప్రతిపాదించారు. రుణాలు, అడ్వాన్సుల చెల్లింపులకు రూ. 19వేల 626 కోట్లు, మూలధన పంపిణీకి రూ. 17వేల ఒక కోట్లని అంచనావేశారు. రెవెన్యూ లోటు రూ. 244 కోట్లు ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం, మొత్తంగా ద్రవ్య లోటు రూ. 49వేల 255 కోట్లుగా లెక్కగట్టింది. 2023-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299 రూపాయలన్న భట్టి, జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే లక్షా 64వేల 63 రూపాయలు ఎక్కువని తెలిపారు.

బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు సింహాభాగం నిధుల్ని కేటాయించిన ప్రభుత్వం, సబ్బండ సంక్షేమమే లక్ష్యంగా నిధులు కుమ్మరించింది. పద్దులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన సర్కారు, హైదరాబాద్‌ మహానగరాభివృద్ధికి భారీగానే నిధులు కేటాయించింది. మనం చేసే పనులకు, చేయగలిగే సామర్ధ్యానికి ఉన్న అంతరం, ప్రపంచంలోని సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు సరిపోతుందన్న భట్టి, ఇదే స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

తెలంగాణ బడ్జెట్​ 2024 - ఆరు గ్యారంటీలకు ఎంత కేటాయించారంటే? - BUDGET FOR SIX GUARANTEES 2024

‘కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం’ - తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ - Assembly Resolution on Union Budget

Last Updated : Jul 25, 2024, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.