ETV Bharat / state

తెలంగాణలో ఊరూరా హెల్త్ చెకప్స్ - ఎన్‌హెచ్‌ఎంతో కలిసి ప్రభుత్వం ముందడుగు - Health Checkups in Telangana 2024

TG Govt on Health Screening Tests in People : రాష్ట్రంలో పెరుగుతున్న జీవన శైలి వ్యాధులకు కళ్లెం వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సిద్ధమవుతోంది పెద్దలందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మొబైల్‌ ల్యాబ్‌ల వినియోగంతో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఎంతో కలిసి తెలంగాణ సర్కార్ ముందడుగు వేసింది.

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 13, 2024, 9:57 AM IST

Health Checkups in Telangana 2024
Health Checkups in Telangana 2024 (ETV Bharat)

Health Checkups in Telangana 2024 : తెలంగాణలో పెరుగుతున్న జీవనశైలి వ్యాధులకు అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. పెద్దలందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. అందుకుగాను పది మొబైల్‌ ల్యాబ్‌లను సిద్ధం చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కార్యక్రమంలో భాగంగా చేపట్టే ఈ క్రతువుకు కేంద్రం 60 శాతం, రాష్ట్ర సర్కార్ 40 శాతం నిధులు సమకూర్చనున్నాయి.

Telangana Health Screening Tests : గత 20 సంవత్సరాల్లో రాష్ట్రంలో హృద్రోగాలు, రక్తపోటు, క్యాన్సర్, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మద్యపానం, జంక్‌ఫుడ్స్‌, ధూమపానం కారణంగానే దాదాపు 60 శాతం వరకు వ్యాధులు వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి ఒక శాతం లోపే మహిళలు ముందస్తు పరీక్షలు చేయించుకుంటున్నారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది వంద శాతం వరకు ఉంటోంది. గ్రామీణ స్థాయి నుంచి ముందస్తు పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆయా వ్యాధులను నిర్ధారించి, సకాలంలో వైద్య చికిత్సలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏయే పరీక్షలంటే : ఊరూరా తిరుగుతూ ఆయా ప్రాంతాల్లో 26-70 సంవత్సరాల వయసున్న అందరికీ డిజిటల్‌ మామోగ్రామ్, ఈ2డీ ఏకో, పాప్‌స్మైర్, ఈసీజీ ఇతర అన్ని రకాల రక్తపరీక్షలు నిర్వహిస్తారు. అందుకనుగుణంగా మొబైల్‌ ల్యాబ్‌లో వైద్యులతోపాటు నర్సులు ఇతర టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారు. ప్రధానంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వార, రొమ్ము, మధుమేహం, అధిక రక్తపోటు, నోటి క్యాన్సర్లు, గుండె జబ్బులకు సంబంధించి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

పురుషుల్లోనూ నోటి క్యాన్సర్‌తోపాటు అధిక రక్తపోటు, గుండె వ్యాధులు, మధుమేహంపై పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అనుమానిత లక్షణాలుంటే హైదరాబాద్‌ ఎంఎన్‌జే ప్రభుత్వ క్యాన్సర్‌ ఆసుపత్రికి తరలిస్తారు. బయాప్సీ వంటి తదుపరి పరీక్షలతో వ్యాధి ఉందో లేదో గుర్తిస్తారు. మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలు బయటపడిన పక్షంలో వారికి ఉచితంగా మందులు అందిస్తారు. సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వారిని అనుసంధానం చేసి అక్కడ నుంచి నెలానెలా మందులు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తారు. వృద్ధులు ఇతర కారణాలతో ఆసుపత్రికి రాలేని వారు ఉంటే ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఇంటికే మందులు సరఫరా అయ్యేలా చేయడం వంటివి ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటాయని వైద్య వర్గాల సమాచారం.

తొలిసారి 18 ఏళ్లు పైబడిన వారికి 'టీబీ' టీకా - ఎప్పటి నుంచంటే? - BCG vaccination drive in Telangana

రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరికీ 'హెల్త్‌ కార్డు - డిజిటల్‌ రికార్డు'! - కార్యాచరణపై సర్కార్ కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.