ETV Bharat / state

మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చకు సర్కార్ ప్లాన్

Telangana Government Discussion on Irrigation Issue : మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ ఇచ్చే నివేదిక కీలక కానుంది. ఈ నివేదిక ఆధారంగా అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే విజిలెన్స్​ అధికారులు చేస్తున్న విచారణలో భారీ నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. మరో 15 రోజుల్లో సమగ్ర రిపోర్ట్ ​ఇవ్వనున్నామని అధికారులు వెల్లడించారు.

Medigadda Incident in Telangana
Telangana Government Discussion on Irrigation Issue
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2024, 10:01 PM IST

Telangana Government Discussion on Irrigation Issue : మేడిగడ్డ ఆనకట్టు కుంగుబాటు అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ విభాగం ఇచ్చే నివేదికపై శాసనసభ వేదికగా చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ విభాగం విచారణ జరుపుతోంది. విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారం మేరకు మేడిగడ్డ వద్ద నష్టం భారీగానే ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రవాహాన్ని నియంత్రించేందుకు పియర్స్ వెనక భాగంలో చేసిన కాంక్రీటు నిర్మాణాలు కొట్టుకుపోయాయని నిర్ధారించారు. అన్నారం, సుందిళ్లలోనూ ఇదే తరహా లోపాలకు ఆస్కారం ఉందని సర్కార్​కు సమాచారం అందినట్లు సమాచారం.

మేడిగడ్డ బ్యారేజీలో మరిన్ని సమస్యలు - విజిలెన్స్ అధ్యయనంలో గుర్తింపు

Medigadda Incident in Telangana : మేడిగడ్డ అంశంపై మధ్యంతర నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ విభాగానికి ప్రభుత్వం ఆదేశించింది. ఈ వ్యవహారంపై రానున్న బడ్జెట్ సమావేశాల్లో శాసనసభ వేదికగానే చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు(Nagarjuna Sagar Project), కాంపోనెంట్లను అప్పగించే ఆస్కారం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయమై స్పష్టమైన వైఖరితో ఉన్నామని, కేంద్రానికి ఇదే విషయాన్ని మరోమారు స్పష్టం చేస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశాలపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదలశాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

కాళేశ్వరం, మేడిగడ్డపై రెండో రోజు కొనసాగుతున్న విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ సోదాలు

Vigilance Officials on Medigadda Barrage Incident : మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage Issue)​పై ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరపాలని ఆదేశించింది. దీంతో విజిలెన్స్​ అధికారులు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టారు. నీటిపారుదల శాఖ కార్యాలయాల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని దస్త్రాలను సేకరించారు. అన్ని ఫైల్స్ పరిశీలించిన అధికారులు ప్రాజెక్టును కూడా పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. మరో 15 రోజుల్లో విచారణ పూర్తి చేసుకుని సమగ్రమైన నివేదిక వెల్లడిస్తామని తెలిపారు. బ్యారేజ్​లోని ఏడో పియర్​ ధ్వంసం అయిందని అధికారులు గుర్తించారు. త్వరలోనే మిగిలిన పియర్స్​ను కూడా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఈ బ్యారేజ్​ నిర్మాణంలో మొదటి ఇచ్చిన డిజైన్​ను మార్చి వేరే డిజైన్​తో ఎందుకు నిర్మించారే అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నష్టానికి గల కారణాలను అధికారులతో చర్చించి రిపోర్టు తయారు చేయనున్నామని పేర్కొన్నారు.

మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.