ETV Bharat / state

తెలంగాణ డీజీపీగా జితేందర్ నియామకం - ప్రభుత్వం ఉత్తర్వులు జారీ - Telangana New DGP Jitender - TELANGANA NEW DGP JITENDER

Telangana New DGP Jitender : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్​ నియమితులయ్యారు. ఈమేరకు సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నప్పటికీ, సీఎం రేవంత్​రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది.

Jitender Appointed As Telangana New DGP
Telangana New DGP Jitender (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 4:39 PM IST

Updated : Jul 10, 2024, 6:55 PM IST

Jitender Appointed As Telangana New DGP : తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ను నియమిస్తూ రాష్ట్ర సర్కార్​ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీగా జితేందర్‌ రికార్డ్​ నమోదుచేసుకున్నారు.

ఇప్పటి వరకు జితేందర్‌ డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్‌, 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికయ్యారు.

డీజీపీ జితేందర్ ఉద్యోగ ప్రస్థానం : తొలుత నిర్మల్‌ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. తర్వాత దిల్లీ సీబీఐలో, 2004-06 వరకు గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. అనంతరం డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొంతకాలం పనిచేసి ఆయన, తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్‌ రేంజ్‌ డీఐజీగా కొనసాగారు.

Telangana Govt Appoint New DGP : ఏపీ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ అడిషనల్​ కమిషనర్‌గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన నూతన డీజీపీ గా ఇవాళ నియమితులయ్యారు. కాగా ఆయన 2025 సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు. దీంతో జితేందర్​ 14 నెలలపాటు డీజీపీ పదవిలో కొనసాగనున్నారు.

ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ఎలక్షన్ కమిషన్‌ నియమించింది. బీఆర్ఎస్ గవర్నమెంట్​లో డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌ను క్రమశిక్షణ చర్య కింద సస్పెండ్‌ చేశారు. తర్వాత రవిగుప్తాను డీజీపీగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయనే కొనసాగుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం జితేందర్‌ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్​లు బదిలీ - రాచకొండ సీపీగా సుధీర్​ బాబు - ips officers transfer in telangana

Father's Day Special : ఉప్పొంగిన నాన్న గుండె - ట్రైనీ ఐఏఎస్​ కుమార్తెకు ఐపీఎస్​ తండ్రి సెల్యూట్​

Last Updated : Jul 10, 2024, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.