ETV Bharat / state

రాష్ట్రంలో అమల్లోకి 144 సెక్షన్, నిర్భయంగా ఓటెయ్యాలని వికాస్​ రాజ్ విజ్ఞప్తి​ - CEO Vikas Raj on Exit polls 2024

Telangana CEO Vikas on Polling 2024 :మే 13వ తేదీన అన్ని కంపెనీల వారు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​ రాజ్​ హెచ్చరించారు. ఈరోజు సాయంత్రం 6.30 తరువాత నియోజకవర్గాలో ఇతర వ్యక్తులు ఉండకూడదని తెలిపారు.

Telangana CEO Vikas on Polling 2024
Telangana Election Commission CEO Vikas Raj On Elections (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 4:00 PM IST

Updated : May 11, 2024, 7:57 PM IST

Telangana Election Commission CEO Vikas Raj On Elections : మే 13వ తేదీ అన్ని కంపెనీల వారు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​ రాజ్​ హెచ్చరించారు. జూన్‌ 1వ తేది సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం ఉంటుందని తెలిపారు. పోలింగ్‌ దగ్గర పడినందున నిఘా మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రచార సమయం ముగిసిన తర్వాత నియోజకవర్గాల్లో ఇతరులు ఉండకూడదని తెలిపారు. 12, 13వ తేదీల్లో దినపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలంటే అనుమతి తీసుకోవాలని అన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా, వెబ్‌సైట్లలో రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని సూచించారు.

'బందోబస్తు కోసం రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు వచ్చాయి. 60 వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి కొందరు పోలీసులు వస్తారు. కేంద్ర బలగాలు కాకుండా 72 వేల పోలీసులు బందోబస్తులో ఉంటారు. పోలింగ్‌ కోసం 87 వేలకు పైగా బ్యాలెట్‌ యూనిట్లు వినియోగిస్తున్నాం. దాదాపు 20 వేల బ్యాలెట్‌ యూనిట్లు స్పేర్‌గా ఉంచుతాం.' అని వికాస్​ రాజ్ తెలిపారు.

ఈ 2 రోజులు మరింత అప్రమత్తంగా ఉండండి - అధికారులకు సీఈవో వికాస్​రాజ్​ ఆదేశాలు - CEO Vikas Raj Video conference

CEO Vikas Raj on Lok Sabha Elections in Telangana 2024 : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి తనిఖీల్లో ఇప్పటివరకు రూ.320 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దానికి సంబంధించి 8వేల కేసులు, డ్రగ్స్​ సరఫరాకు సంబంధించి 2వందలకు పైగా కేసులు నమోదు చేసినట్లు వివరించారు. మే 13న జరిగే పోలింగ్‌ విధుల్లో దాదాపు 90 వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు. సీ విజిల్‌, టోల్‌ ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నారని, ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

"రాష్ట్రంలో 1.88 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్ వినియోగించుకున్నారు. 21,690 మంది హోమ్‌ ఓటు వినియోగించుకున్నారు. హోమ్​ ఓటింగ్ అప్లై చేసుకున్న వారిలో 93శాతం మంది ఓట్లు వేశారు. 96 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం అందరికి మరింత సులభంగా ఓటు వివరాలు తెలుసుకునేందుకు కొత్తది తీసుకువచ్చారు. ఈసీఐ స్పేస్​ ఇచ్చి ఓటరు నంబరుతో 1952 నంబర్​కు మెసేజ్​ పెడితే ఓటరు వివరాలు వస్తాయి." - వికాస్​ రాజ్​, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి

అక్రమ నగదు, మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను వికాస్‌రాజ్‌ ఆదేశించారు. 48 గంటల పాటు రేయింబవళ్లు అధికారులు నిఘా పెట్టాలని కోరారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ ఉపఎన్నికకు సైతం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధికారులతోపాటు రాజకీయ నాయకులందరూ ఎన్నికల నిబంధనలను పాటించాలని వికాస్‌రాజ్‌ సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ప్రజలు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

సాయంత్రం 630 తర్వాత నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండకూడదు వికాస్​ రాజ్​ (ETV Bharat)

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు - లోక్​సభ ఎన్నికల ఏర్పాట్లపై వికాస్ రాజ్ - LOK SABHA POLLING IN TELANGANA

తెలంగాణ లోక్​సభ బరిలో 525 మంది - ఈనెల 5 నుంచి హోమ్ ఓటింగ్ : వికాస్ రాజ్ - Vikas Raj on Election Arrangements

Last Updated : May 11, 2024, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.