ETV Bharat / state

'మీ సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా ఉంది - పోస్టులు పెట్టకండి, లైక్ చేయకండి!' - CSO ALERT TO SECRETARIAT SECURITY

సచివాలయం భద్రతా సిబ్బందికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కీలక ఆదేశాలు - సిబ్బంది కదలికలు, సోషల్ మీడియాపై నిఘా ఉందని హెచ్చరిక - ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకమైన పోస్టులను లైక్‌, షేర్ చేయవద్దని సూచన

Telangana CSO Alert to Secretariat Security
Telangana CSO Alert to Secretariat Security (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2024, 9:34 PM IST

Telangana CSO Alert to Secretariat Security : తెలంగాణ స్పెషల్ పోలీసుల ఆందోళనలు సచివాలయాన్ని కూడా తాకాయి. సచివాలయం భద్రత సిబ్బంది కదలికలు, సోషల్ మీడియాపై నిఘా ఉందని సెక్రటేరియెట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తెలిపారు. పోలీసు బెటాలియన్ల సిబ్బంది ఆందోళనల నేపథ్యంలో సచివాలయం భద్రత సిబ్బందిని అప్రమత్తం చేస్తూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గంగారాం మెమో జారీ చేశారు. రాష్ట్రానికి అతి ముఖ్యమైన సచివాలయం వద్ద పనిచేస్తున్నందున ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి పోస్టులు పెడుతున్నారనే విషయాలపై నిఘా ఉంటుందన్నారు. అందుకే సచివాలయం భద్రత సిబ్బంది అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఒక్కరు తప్పు చేసినా అందరిపై ప్రభావం ఉంటుందని సీఎస్ఓ హెచ్చరించారు.

సోషల్ మీడియాపై నిఘా ఉందని హెచ్చరిక : సచివాలయం చుట్టూ 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడిలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని మిత్రులు, సహచర సిబ్బందికి వివరించాలని సూచించారు. పోలీసు అధికారులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వాట్సప్ గ్రూపులకు అడ్మిన్​గా వెంటనే వైదొలగాలని సీఎస్ఓ తెలిపారు. ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు వ్యతిరేకంగా పోస్టులు, కామెంట్లు పెట్టవద్దని షేర్, లైక్ చేయవద్దన్నారు పొరపాటున దొరికితే వెంటనే శాఖపరమైన చర్యలు ఉంటాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని సచివాలయం భద్రత నిర్వహణలో ఉన్న టీజీఎస్పీ సిబ్బంది అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు.

ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్‌ పోలీసులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. బుధవారం నుంచి జరుగుతున్న ఈ పోరాటం శనివారం మరింత ఉద్ధృతమైంది. డీజీపీ హెచ్చరించినా వినకపోవడంతో ఏకంగా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా 10 మందిని ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు 39 మంది సస్పెండ్ చేశారు. ఓవైపు అధికారులు యాక్షన్ తీసుకుంటున్నా బెటాలియన్ పోలీసులు వెనక్కి తగ్గడం లేదు. ఇవాళ కూడా తమ సహచరుల డిస్మిస్, సస్పెన్షన్ ఎత్తివేయాలని తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సెక్రటేరియెట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తమ సిబ్బందికి సోషల్ మీడియా విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

'వారిని విధుల్లోకి తీసుకోండి.. లేదంటే మమ్మల్ని సస్పెండ్​ చేయండి' - ఆగని ఖాకీల ఆందోళనలు

తెలంగాణ పోలీస్‌శాఖ సంచలన నిర్ణయం - 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.