Telangana CM Revanth Reddy On Drugs : డ్రగ్స్ పదం వింటేనే భయపడేలా పోలీసుల చర్యలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడకు చేరుకున్న సీఎంకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్ సెంటర్లను సీఎం పరిశీలించారు. ఆ తర్వాత డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య హాజరయ్యారు. అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమీక్షకు హాజరు అయ్యారు.
గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై సమీక్ష : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని, ఈ విషయంలో మరింత యాక్టివ్‌గా పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని, గంజాయి, డ్రగ్స్ సరఫరా చైన్‌ను బ్రేక్ చేయాలని ఆదేశించారు. సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలు ఉండాలని హెచ్చరించారు. డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా ఎంత పెద్ద వారున్నా ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేయండని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ఎఫెక్టివ్‌గా పని చేసేవారిని ప్రోత్సహించండని చెప్పారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని పిలుపునిచ్చారు.
వర్షాకాల వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో నిర్వహించిన సమీక్షలో సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని అన్నారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా వ్యవస్థ ఉండాలని తెలిపారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలని ఆదేశించారు. జూన్ 4 లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని, నాళాల పూడికతీతలో నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు.
వైసీపీ పాలనలో అన్ని రంగాలు లాస్ట్ - డ్రగ్స్ స్మగ్లింగ్‌లో దేశంలోనే టాప్ - DRUGS SMUGGLING IN AP
పూడిక తీసిన చెత్తను సమీప ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్వారీ ఏరియాలను గుర్తించి ఆ ప్రాంతాలకు తరలించేలా చర్యలు ఉండాలన్నారు. కోడ్ ముగిసిన తరవాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని చెప్పారు. నిర్లక్ష్యంగా వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. పని చేసే వారిని ప్రోత్సహిస్తాం, అలాగే వారికి ఉన్నత స్థానం కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు.
విశాఖకు కంటెయినర్‌లో వచ్చింది డ్రగ్సే - సీబీఐ నివేదికలో వెల్లడి - Visakhapatnam Drugs Case