ETV Bharat / state

LIVE UPDATES : శనివారానికి శాసనసభ వాయిదా - telangana budget 2024 live updates - TELANGANA BUDGET 2024 LIVE UPDATES

Telangana budget 2024 live updates
Telangana budget 2024 live updates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 10:10 AM IST

Updated : Jul 25, 2024, 2:29 PM IST

Telangana Budget 2024 Live Updates : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు మూడో రోజు జరుగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. మంత్రి శ్రీధర్ బాబు శాసనమండలిలో ఈ బాధ్యత నిర్వర్తించనున్నారు.

LIVE FEED

12:59 PM, 25 Jul 2024 (IST)

రైతుల తలరాతలు మార్చే చారిత్రక నిర్ణయం: భట్టి విక్రమార్క

గత ప్రభుత్వ విధానాలతో ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని భట్టి అన్నారు. దిద్దుబాటు చర్యలు చేపట్టి మేలైన ప్రాజెక్టులు నిర్మిస్తామని తెలిపారు.

ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు చెల్లిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్ర అప్పులు తీర్చేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.

ఇప్పటివరకు రూ.34,579 కోట్లు వివిధ పథకాలకు ఖర్చు చేశామని తెలిపారు. కొత్త ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి, నియామకాల్లో పారదర్శకతకు చర్యలు చేపట్టామని అన్నారు. త్వరలో నియామక ప్రణాళిక క్యాలెండర్‌ విడుదల చేస్తామని తెలిపారు. రైతుభరోసా సహా హామీలన్నీ త్వరలోనే అమలు చేసి తీరుతామన్నారు.

బడ్జెట్‌ కేవలం అంకెల సమాహారం కాదని బడ్జెట్‌ అనేది విలువలు, ఆశల వ్యక్తీకరణ కూడా అని అన్నారు. జిల్లాల మధ్య ఆదాయ అంతరాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అసమానతలు లేని సమసమాజ స్థాపన దిశగా అడుగుల వేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ ఏడాది నుంచి పీఎం ఫసల్‌బీమా యోజనలో చేరాలని నిర్ణయించామని తెలిపారు. రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు.

రైతులకు పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. వరి రైతులకు క్వింటాకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించారు. కమిటీ అధ్యయనం తర్వాత ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తామని తెలిపారు.

బడ్జెట్‌లో సింహభాగం వ్యవసాయానికే కేటాయించామన్నారు. రైతుల తలరాతలు మార్చే చారిత్రక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఉచిత బస్సు పథకం సొమ్ము నెలవారీగా ఆర్టీసీకి ఇస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బిలియన్‌ డాలర్‌ కార్పొరేషన్‌గా అవతరణకు దోహదపడుతుందన్నారు.

రూ.63 లక్షల మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం రూపొందించారు. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకుల అనుసంధానంతో రూ.లక్ష కోట్ల ఆర్థిక సాయం. డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేంకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శాసనసభ శనివారానికి స్పీకర్ వాయిదా వేశారు.

12:52 PM, 25 Jul 2024 (IST)

రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్​

రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్​ను మంత్రి భట్టి ప్రవేశపెట్టారు. దీనిలో

  • రెవెన్యూ వ్యయం - రూ.2,20,945 కోట్లు
  • మూలధన వ్యయం - రూ.33,487 కోట్లు
  • హోంశాఖ - రూ.9,564 కోట్లు
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి - రూ.29,816 కోట్లు
  • ఆర్‌ అండ్‌ బీ శాఖ - రూ.5,790 కోట్లు
  • నీటిపారుదల శాఖ - రూ. 22,301 కోట్లు
  • వ్యవసాయం - రూ.72,659 కోట్లు
  • విద్యా రంగం - రూ.21,292 కోట్లు
  • వైద్యం, ఆరోగ్యం - రూ. 11,468 కోట్లు
  • ట్రాన్స్ కో, డిస్కంలు - రూ.16,410 కోట్లు
  • అడవులు, పర్యావరణం - రూ.1,064 కోట్లు
  • స్త్రీ, శిశు సంక్షేమం - రూ.2,736 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం - రూ.33,124 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం - రూ.17,056 కోట్లు
  • బీసీ సంక్షేమం - రూ.9,200 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం - రూ.3,003 కోట్లు
  • పరిశ్రమల శాఖ - రూ. 2,762 కోట్లు
  • ఐటీ రంగం - రూ.774 కోట్లు
  • ఉద్యానవనం - రూ.737 కోట్లు
  • పశుసంవర్థకం - రూ.1,980 కోట్లు
  • ప్రజాపంపిణీ - రూ.3,836 కోట్లు
  • ఐటీఐల ఆధునీకరణ - రూ.300 కోట్లు
  • రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం - రూ.723 కోట్లు
  • గృహజ్యోతి పథకం - రూ.2,418 కోట్లు

12:37 PM, 25 Jul 2024 (IST)

రాష్ట్ర బడ్జెట్​లో హైదరాబాద్‌ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు

  • జీహెచ్‌ఎంసీలో మౌలిక వసతుల కల్పన – రూ.3,065 కోట్లు
  • హెచ్‌ఎండీఏలో మౌలిక వసతుల కల్పన – రూ.500 కోట్లు
  • మెట్రో వాటర్‌ వర్క్స్‌ - రూ.3,385 కోట్లు
  • హైడ్రా సంస్థ – రూ.200 కోట్లు
  • విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ – రూ. 100 కోట్లు
  • ఔటర్‌ రింగ్‌ రోడ్డు - రూ. 200 కోట్లు
  • హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు - రూ.500 కోట్లు
  • పాతబస్తీ మెట్రో విస్తరణ – రూ.500 కోట్లు
  • మల్టీ మోడల్‌ సబర్బన్‌ రైల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ - రూ.50 కోట్లు
  • మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు - రూ.1500 కోట్లు
  • ఐటీఐల ఆధునీకరణ - రూ.300 కోట్లు

12:27 PM, 25 Jul 2024 (IST)

బడ్జెట్‌ స్వరూపం రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్

బడ్జెట్‌ స్వరూపం

  • రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు
  • మూలధన వ్యయం రూ.33,487 కోట్లు
  • వ్యవసాయం రూ.72,659 కోట్లు
  • ఉద్యానవనం రూ.737 కోట్లు
  • పశుసంవర్థకం రూ.1,980 కోట్లు
  • రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం రూ.723 కోట్లు
  • గృహజ్యోతి పథకం రూ.2,418 కోట్లు
  • ప్రజాపంపిణీ కోసం రూ.3,836 కోట్లు
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రూ.29,816 కోట్లు

12:24 PM, 25 Jul 2024 (IST)

బడ్జెట్‌ స్వరూపం

  • ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు - రూ.1,525 కోట్లు

  • ఎస్సీ సంక్షేమం రూ.33,124 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం రూ.17,056 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం రూ.3,003 కోట్లు
  • బీసీ సంక్షేమం రూ.9,200 కోట్లు

  • విద్యా రంగం రూ.21,292 కోట్లు
  • హోంశాఖ రూ.9,564 కోట్లు
  • ఆర్‌ అండ్‌ బీ - రూ.5,790 కోట్లు
  • పరిశ్రమల శాఖ – రూ. 2,762 కోట్లు
  • ఐటీ రంగం - రూ. 774 కోట్లు
  • నీటిపారుదల శాఖ – రూ. 22,301 కోట్లు

12:04 PM, 25 Jul 2024 (IST)

తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి కవితతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన భట్టి

శాసనసభ ముందుకు రాష్ట్ర బడ్జెట్‌ ను ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెడుతున్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి కవితతో బడ్జెట్‌ భట్టి ప్రారంభించారు.

గత పదేళ్లలో అస్తవ్యస్త పాలన సాగిందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆశించిన అభివృద్ధి జరగలేదని అన్నారు.

గత పదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని తెలిపారు. రాష్ట్రం వచ్చాక అప్పు పదిరెట్లు పెరిగిందన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.

అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందని విమర్శించారు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని జీతాలు, పింఛన్ల చెల్లింపులకు కటకటలాడాల్సిన పరిస్థితన్నారు.

11:51 AM, 25 Jul 2024 (IST)

అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌

మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో ఆయన అసెంబ్లీకి వచ్చారు

11:20 AM, 25 Jul 2024 (IST)

బడ్జెట్​కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

రాష్ట్ర బడ్జెట్​కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బడ్జెట్​ ప్రతిని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభాపతి, మండలి ఛైర్మన్​కు అందజేశారు. కాసేపట్లో అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి భట్టి బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు.

10:58 AM, 25 Jul 2024 (IST)

ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

అసెంబ్లీ కమిటీ హాల్​లో సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్​కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బడ్జెట్​ పద్దును డిప్యూటీ సీఎం భట్టి గవర్నర్​కు అందించనున్నారు. అలాగే శాసనసభాపతి, మండలి ఛైర్మన్​, సీఎంలకు కూడా బడ్డెట్​ పద్దును అందించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు.

10:01 AM, 25 Jul 2024 (IST)

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. 2024-25 రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మ.12 గం.కు అసెంబ్లీలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Last Updated : Jul 25, 2024, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.