శాసనసభ నిరవధిక వాయిదా
LIVE UPDATES : శాసనసభ నిరవధిక వాయిదా - TG ASSEMLBLY SESSION LIVE UPDATES - TG ASSEMLBLY SESSION LIVE UPDATES
Published : Aug 2, 2024, 10:13 AM IST
|Updated : Aug 2, 2024, 8:13 PM IST
Telangana Assembly Session Today : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ సభలో మూడు బిల్లులపై చర్చ జరుగుతోంది. అందులో సివిల్ కోర్టుల సవరణ బిల్లు, తెలంగాణ చట్టాల బిల్లు, పబ్లిక్ సర్వీస్ నియామకాలు నియంత్రణ బిల్లుపై చర్చిస్తున్నారు.
LIVE FEED
శాసనసభ నిరవధిక వాయిదా
కేంద్రాన్ని నిధులు ఇవ్వాలని అడగడం మా బాధ్యత : సీఎం రేవంత్
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమని కేంద్రాన్ని నిధులు ఇవ్వాలని అడగడం మా బాధ్యతని సీఎం రేవంత్ తెలిపారు. ఇస్తారా ఇవ్వరా అనేది వాళ్ల విజ్ఞత అని అన్నారు.
కలిసి వస్తామంటే అందరం దిల్లీ వెళ్దామని రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకుందామని పేర్కొన్నారు. ఇది ప్రజాప్రభుత్వం ప్రతిపక్షాల సలహాలను కూడా తీసుకుంటామని పేర్కొన్నారు.
మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు జలాల తరలింపునకు ప్రణాళిక సిద్ధం చేశాం : సీఎం రేవంత్
మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు జలాల తరలింపునకు ప్రణాళిక సిద్ధం చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.6 వేల కోట్ల ప్రతిపాదనలు ప్రధాని, జలశక్తి మంత్రికి ఇచ్చామన్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు కేంద్రానికి రూ.10 వేల కోట్లు అడిగామని తెలిపారు. 80 వేల పుస్తకాలు చదివానని అతి తెలివితేటలు ఎక్కువ చూపలేదని విమర్శించారు.
కుక్కపని గాడిద చేస్తే నడ్డి విరిగిందనే సామెత ఉందని బీఆర్ఎస్ నాయకలు మూసీ ప్రాజెక్టు లక్షన్నర కోట్లని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నిజాం పాలకులే ప్రజాస్వామ్యానికి తలొగ్గారని
పదేళ్లు ఏలిన మీరు పదవి పోయేసరికి ఎందుకు అంత బాధని ప్రశ్నించారు. ఎన్నో అద్భుతాలు ఉన్న నగరం హైదరాబాద్ దాన్ని నిలబెట్టాలన్నారు. అమెరికాలో చదివిన చదువును చెడగొట్టేందుకు ఎందుకు వాడాలని కేటీఆర్ఎర్ను ఉద్దేశ్యించి అన్నారు. హోటల్‌లో పనిచేసే వారుకూడా ఇంగ్లీష్ మాట్లాడతారని విమర్శించారు.
కాళేశ్వరం కూలిపోయాక కూడా డీపీఆర్ లేదు : సీఎం రేవంత్ రెడ్డి
గతంలో రాత్రి 11 తర్వాత విచ్చలవిడిగా గంజాయి దొరికేది
ఇప్పుడు హైదరాబాద్‌లో ఎవరికైనా గంజాయి అమ్మే దమ్ముందా?
పబ్బు, ఫామ్‌హౌస్‌ల్లో డ్రగ్ రాకెట్లతో ఎవరికి సంబంధం ఉందో చర్చించే దమ్ముందా?
బీఆర్ఎస్ నేతలు సభలో ఉన్నప్పుడు డ్రగ్ రాకెట్లపై చర్చకు సిద్ధం
మాకు అందరి జాతకాలు తెలుసు
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నందున కొన్ని అంశాలపై చర్చించట్లేదు
ఎస్‌వోటీ, గ్రేహౌండ్స్ తరహాలోనే మా హయాంలో హైడ్రా తెస్తున్నాం
హైదరాబాద్‌లో అక్రమాల నివారణకే హైడ్రా తెస్తున్నాం
హైదరాబాద్‌లో ఇంటి నంబర్లు మార్చాల్సిన అవసరం ఉంది
కాళేశ్వరం కడితిరి.. కూలిపాయే... లక్ష కోట్లు మింగితిరి..
కాళేశ్వరం కూలిపోయాక కూడా డీపీఆర్ లేదు
వర్షం వచ్చినా హైదరాబాద్ రోడ్లపై చుక్కనీరు నిలవకుండా ప్రణాళికలు : రేవంత్ రెడ్డి
ప్రపంచంతో పోటీ పడేలా చేసేందుకే సంస్కరణలు
చంద్రబాబు చేసిన ఆలోచనలను వైఎస్ కొనసాగించారు
వైఎస్ ఓఆర్‌ఆర్ నిర్మిస్తే కొందరు దాన్ని తాకట్టు పెట్టారు
ఓఆర్‌ఆర్‌ను తాకట్టు పెట్టిన వారు సభ నుంచి పారిపోయారు
హైదరాబాద్‌ను ప్రణాళికకు విరుద్ధంగా అభివృద్ధి చేశారు
వర్షం వచ్చినా హైదరాబాద్ రోడ్లపై చుక్కనీరు నిలవకుండా ప్రణాళికలు
హైదరాబాద్‌లో భూగర్భ నీటి నిల్వలకు ఏర్పాట్లు చేస్తున్నాం
హైదరాబాద్‌లో హత్యలు జరుగుతున్నాయని దుష్పచారం చేస్తున్నారు
హైదరాబాద్‌లో హత్యపై లెక్కలు తీయించా
గత డిసెంబర్ నుంచి జులై వరకు హైదరాబాద్‌లో 46 హత్యలు జరిగాయి
అంతకంటే ముందు ఆరు నెలల్లో 48 హత్యలు జరిగాయి
సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేస్తే ఒక్కరు కూడా పరామర్శించలేదు
దిశ ఘటన బాధితులను కూడా పరామర్శించలేదు
మెుయినాబాద్‌లో మైనర్‌పై బీఆర్‌ఎస్ నేత అత్యాచారం చేశారు
హైడ్రాకు సంబంధించి సభలో సీఎం మాట్లాడుతున్నారు. హైదరాబాద్ పాలకులు ఎవరైనా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.
దానం నాగేందర్‌కు హైదరాబాద్‌లో ప్రతీ గల్లీ తెలుసని అన్నారు. ఎంతో అధ్యయనం తర్వాత హైడ్రాను ఏర్పాటు చేశామని తెలిపారు. హైడ్రా పరిధిని 2 వేల కి.మీ. విస్తరించామని అన్నారు.
హైదరాబాద్‌లో సరస్సులు మాయం అవుతున్నాయని హైదరాబాద్ దుస్థితిపై హైకోర్టు కూడా తీవ్రవ్యాఖ్యలు చేసిందని అన్నారు. నాలాల కబ్జాలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది
అవసరానికి తగినట్లు వ్యవస్థలను మార్చలేదన్నారు. గత పాలకులు అద్దాల మేడలే అభివృద్ధి అని చూపారని విమర్శించారు.
తెలంగాణ జాబ్ క్యాలెండర్
అక్టోబర్‌లో ఏఈఈ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్
జాబ్ క్యాలెండర్: నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్
జాబ్ క్యాలెండర్: అక్టోబర్‌లో మరో గ్రూప్-1 నోటిఫికేషన్
జాబ్ క్యాలెండర్: 2025 ఫిబ్రవరిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
జాబ్ క్యాలెండర్: 2025 జులైలో గ్రూప్-1 మెయిన్స్
జాబ్ క్యాలెండర్: 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్
జాబ్ క్యాలెండర్: 2025 ఫిబ్రవరిలో ఫారస్ట్ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్
జాబ్ క్యాలెండర్: 2025 ఏప్రిల్‌లో ఎస్‌ఐ నోటిఫికేషన్
జాబ్ క్యాలెండర్: 2025 ఆగస్టులో ఎస్‌ఐ రాత పరీక్ష
జాబ్ క్యాలెండర్: 2025 ఏప్రిల్‌లో కానిస్టేబుల్ నోటిఫికేషన్
జాబ్ క్యాలెండర్: 2025 ఆగస్టులో కానిస్టేబుల్ రాత పరీక్ష
2025 జూన్‌లో డిగ్రీ కాలేజీల్లోని వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్
2025 జూన్‌లో గురుకులాల లెక్చరర్ ఉద్యోగాల నోటిఫికేషన్
జాబ్ క్యాలెండర్: 2025 మేలో గ్రూప్-2 నోటిఫికేషన్
జాబ్ క్యాలెండర్: 2025 అక్టోబర్‌లో గ్రూప్-2 రాత పరీక్ష
జాబ్ క్యాలెండర్: 2025 జులైలో గ్రూప్-3 నోటిఫికేషన్
జాబ్ క్యాలెండర్: 2025 నవంబర్‌లో గ్రూప్-3 రాత పరీక్ష
2025 జులైలో సింగరేణిలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్
శాసనమండలి నిరవధిక వాయిదా

అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఉపముఖ్యమంత్రి భట్టి అక్టోబర్‌లో ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్
అక్టోబర్‌లో మరో గ్రూప్-1 నోటిఫికేషన్
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌పై ఉపముఖ్యమంత్రి భట్టి ప్రకటన
అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌పై ఉపముఖ్యమంత్రి భట్టి ప్రకటించారు. జాబ్ నోటిఫికేషన్ల జాప్యం, తరచూ వాయిదాలు ఇబ్బందికరంగా మారాయని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో నియామక ప్రక్రియ గందరగోళంగా మారిందని అన్నారు. గతంలో రెండుసార్లు గ్రూప్-1 పరీక్ష రద్దయిందని గుర్తుకు చేశారు. అధికారంలోకి రాగానే పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నాలు చేపట్టామని పేర్కొన్నారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని భట్టి విక్రమార్ తెలిపారు. వివిధ పరీక్షలకు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చామని అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్-2 వాయిదా వేశామని తెలిపారు. జాబ్ క్యాలెండర్‌ను నిన్న కేబినెట్ మీటింగ్‌లో ఆమోదించామని అన్నారు. జాబ్ క్యాలెండర్ 2024-25ను సభ్యులందరికీ అందించామని భట్టి పేర్కొన్నారు.
భూములు కాజేసేందుకే ధరణి పోర్టల్ తెచ్చారు: వీర్లపల్లి శంకర్
భూములు కాజేసేందుకే ధరణి పోర్టల్ తెచ్చారని వీర్లపల్లి శంకర్ అన్నారు.
ధరణి వల్ల అనేక సమస్యలు వచ్చాయి : మక్కాన్‌సింగ్
ధరణి వల్ల రామగుండంలో అనేక సమస్యలు వచ్చాయని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ అన్నారు.
సభలో ప్రతిపక్ష నేత ఉంటే బాగుండేది : పొంగులేటి
ధరణిపై చర్చలో సభలో ప్రతిపక్ష నేత ఉంటే బాగుండేదని పొంగులేటి పేర్కొన్నారు. ధరణి పోర్టల్ చూసి రైతులు కన్నీరు పెట్టారని వ్యాఖ్యానించారు. సామాన్యులకు మేలు చేసే విషయంలో వెనకడుగు వేసేది లేదని ఉద్ఘాటించారు.
ధరణి ఉన్న చిన్నచిన్న సమస్యలు పరిష్కరించాలి: పల్లా
ధరణి ద్వారా తెచ్చిన భూసంస్కరణలు రైతులకు మేలు చేకూర్చాయని పల్లా అన్నారు. డిజిటల్ సర్వే చేసి అక్షాంశాలు, రేఖాంశాలు ఇవ్వాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా బీఆర్‌ఎస్ ఊరుకోదని వెల్లడించారు. ధరణిలో ఉన్న చిన్నచిన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.
-
LIVE : MLA @PRR_BRS speaking in Telangana Legislative Assembly. https://t.co/7aOm0SOFo2
— BRS Party (@BRSparty) August 2, 2024
మా హయాంలో రైతు ఆత్మహత్యలు బాగా తగ్గాయి : పల్లా
తమ హయాంలో రైతు ఆత్మహత్యలు బాగా తగ్గాయని పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. సీలింగ్ చట్టం ప్రకారం 25 నుంచి 52 ఎకరాల వరకే ఉండాలని పేర్కొన్నారు. ధరణి చట్టం వల్ల ప్రజలకు అనేక ప్రయోజనాలు కలిగాయని వివరించారు. రైతులకు బయోమెట్రిక్ ద్వారా భూహక్కులు కల్పించామని చెప్పారు. ధరణి వచ్చాక రైతులకు ఎంతో మేలు జరిగిందని పేర్కొన్నారు. ధరణి వల్ల 95 శాతం రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు.
భూమి అమ్మినవారు కూడా మళ్లీ వివాదాలు సృష్టించారు: సీతక్క
ధరణి పోర్టల్‌తో ములుగులో అనేకమంది ఇబ్బందిపడ్డారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు, ధరణి వచ్చాక భూమి అమ్మినవారు కూడా మళ్లీ వచ్చారని, భూమి అమ్మినవారు కూడా మళ్లీ వివాదాలు సృష్టించారని విమర్శించారు. ధరణి అంటేనే రైతులంతా భయపడినట్లు చేశారని మండిపడ్డారు. సాగు చేసేది ఒకరని, పట్టాలు ఉన్నది మరొకరికి ధ్వజమెత్తారు. ఏ తప్పులూ చేయకపోతే వీఆర్‌వోలను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. అసైన్డ్ భూములను ఏడుసార్లు పంచిన ఘనత తమ పార్టీదేనని, బీఆర్‌ఎస్ హయాంలో సీలింగ్ చట్టాన్ని తుంగలో తొక్కారని వ్యాఖ్యానించారు. సీలింగ్ చట్టం ఉల్లంఘించి వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని ఆరోపించారు.
వితండవాదం చేయడం దారుణం : పొంగులేటి
- ధరణి చట్టంలో మంచి విషయాలుంటే స్వీకరిస్తాం: పొంగులేటి
- చేసిన తప్పులను ఒప్పుకోకుండా వితండవాదం చేయడం దారుణం: పొంగులేటి
ధరణిలో చిన్న చిన్న లోపాలను మేము పరిష్కరించాం : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- ధరణిలో చిన్న చిన్న లోపాలను మేము పరిష్కరించాం
- ధరణిలో 33 మాడ్యుల్స్‌ను కొద్దిగా మార్పులు చేస్తున్నం అంటున్నారు
- చిన్న సమస్యలు ఉంటే వాటిని
- రైతుబంధు, రైతుబీమా అందరి రైతులకు ఇచ్చాం
రైతుల ఆత్మహత్యలు అన్ని ఎవరి హయంలో జరిగాయి : పొంగులేటి
ధరణిలో 2 లక్షల పెండింగ్‌లో ఉంటే ఇప్పటికే లక్ష 10 వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయని పొంగులేటి తెలిపారు. ధరణిలో చాలా వాటిని పరిష్కరించకుండా వాటిని పక్కన పెట్టేశారని, బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు అన్ని ఎవరి హయంలో జరిగాయి అని ప్రశ్నించారు.
ఆ మాట వాస్తవమే : పొంగులేటి
గతంలో మాజీ సీఎం గారి వద్ద ధరణిపై సమావేశంలో తాను పాల్గొన్న మాట వాస్తవమేనని మంత్రి పొంగులేటి అన్నారు. మాజీ సీఎంతో సమావేశం 12 గంటలు జరిగితే 11.30 గంటలు ఆయనే మాట్లాడేవారని పేర్కొన్నారు.
ధరణి బాగాలేకపోతే దాన్నే ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- పీవీ కాలం నుంచి అనేక రెవెన్యూ సంస్కరణలు వచ్చాయి : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- అనేక రాష్ట్రాలు భూసర్వే అనేక చట్టాలు చేశాయి
- ఆనాటి సీఎం కేసీఆర్ అందరితో చర్చించే ధరణి తీసుకొచ్చారు
- కేసీఆర్ నాలుగు గోడల మధ్య ధరణిపై నిర్ణయం తీసుకోలేదు
- ధరణి పేరు బాగాలేదని భూమాత అని పెడతామంటున్నారు
- ధరణి అంటే భూమాతనే.. ధరణి అనగానే వారికి కేసీఆర్ గుర్తొస్తున్నారు
- దేశంలో కేసీఆర్‌లా ఏ సీఎం కూడా ధరణి వంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకోలేదు
- ధరణి బాగాలేకపోతే.. దాన్నే ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు..
- కొత్త సీఎం కేవలం ధరణి పేరు మాత్రమే మారుస్తున్నారు..
- కేవలం 7,8 లక్షల ఎకరాలపై మాత్రమే వివాదం ఉంది..
- సింగపూర్ సంస్థ చేతిలో ధరణి పోర్టల్ పెట్టామని విమర్శిస్తున్నారు
- అనేక దేశాల సంస్థల డేటా సింగపూర్ సంస్థల చేతుల్లో ఉంటోంది : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
-
LIVE : MLA @PRR_BRS speaking in Telangana Legislative Assembly. https://t.co/fh1UOZKoYY
— BRS Party (@BRSparty) August 2, 2024
ధరణి చట్టం అనే భూతం రాష్ట్రమంతా విస్తరించింది : మంత్రి పొంగులేటి
- ధరణి పోర్టల్ నిర్వహణను డిఫాల్డ్ అయిన సింగపూర్ కంపెనీకి అప్పగించారు
- ధరణి చట్టం అనే భూతం రాష్ట్రమంతా విస్తరించింది
- మేం వచ్చాక ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని ప్రజలకు చెప్పాం
- ధరణిపై అనేక ఇబ్బందులు పడటం వల్లే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు
- ఇందిర హయాంలో దేశంలోని బడుగువర్గాలకు 40 కోట్ల ఎకరాలు పంచారు
- ధరణిపై ఏం చేయాలనే దానిపై కమిటీ వేశాం: పొంగులేటి
- 18 రాష్ట్రాల్లోని చట్టాలు అధ్యయనం చేశాం: పొంగులేటి
- దేశానికి రోల్ మోడల్‌గా ఉండే డ్రాఫ్ట్ చట్టం తయారుచేశాం: పొంగులేటి
- ధరణి చట్టంతో ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారు: పొంగులేటి
- గత ప్రభుత్వం.. పేదల ఆస్తులను లాక్కుని దొరలకు కట్టబెట్టింది
- ధరణి పేరుతో సామాన్యులకు చెందిన లక్షల ఎకరాలు మాయం చేశారు
- ధరణి చట్టం పేరుతో నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తాం
ఎక్కడ చూసినా భూసమస్యలే కనిపిస్తున్నాయి : మంత్రి పొంగులేటి
భూసంస్కరణల్లో విప్లవాత్మక మార్పులు తెస్తామని అనేకమంది చెప్పారని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా భూసమస్యలే కనిపిస్తున్నాయని, గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. ధరణి తెచ్చిన సమస్యలకు పేదరైతులు అధికారుల చుట్టూ తిరిగారని మండిపడ్డారు. ధరణి పోర్టల్ పేరుతో అప్పటి పెద్దాయన ప్రజలను దగా చేశారని ఆరోపించారు. ధరణి పోర్టల్ వల్ల ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొన్నారని వివరించారు.
భూదాన ఉద్యమం ఇక్కడే పుట్టింది : మంత్రి పొంగులేటి
ప్రపంచ చరిత్రలో నిలిచిన భూదాన ఉద్యమం ఇక్కడే పుట్టిందని మంత్రి పొంగులేటి తెలిపారు. 1973లో కాంగ్రెస్ ప్రభుత్వం సీలింగ్ చట్టం తెచ్చి, పేదలకు భూములు పంచిందని వివరించారు. వైఎస్ హయాంలో పోడుభూములకు పట్టాలు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసిన వారి పేర్లు ప్రస్తావించడం సముచితని అన్నారు.
భూసంస్కరణలకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ శ్రీకారం చుట్టారు : మంత్రి పొంగులేటి
భూ సంస్కరణలను తొలుత ఇందిరాగాంధీ చేపట్టారని మంత్రి పొంగులేటి తెలిపారు. భూసంస్కరణలతో అనేక విషయాలు అనుసంధానమై ఉన్నాయని వివరించారు. ప్రధానిగా ఉన్నప్పుడు పీవీ కూడా భూసంస్కరణలు చేపట్టారని పేర్కొన్నారు.
మహిళా మంత్రిపైనా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు : మంత్రి పొన్నం
సామాజిక మాధ్యమాల్లో కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
కొంతమంది కావాలనే వీడియోలు క్రియేట్ చేసి మహిళలను అవమానిస్తున్నారు..
— Ponnam Prabhakar (@Ponnam_INC) August 2, 2024
సభలో జరిగిన అంశాలను కించపరిచి అవమాన పరిచే విధంగా వీడియోలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి. pic.twitter.com/mQtiTdHNkz
తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు : సీఎం
హరియాణా తరహాలో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. త్వరలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని, దానిపై ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని పేర్కొన్నారు. భూముల లభ్యత చూసి మండల కేంద్రాల్లో స్టేడియాలు నిర్మిస్తామని వివరించారు. తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు తాము సిద్ధమని వెల్లడించారు.
క్రీడల కోసం బడ్జెట్‌లో రూ.321 కోట్లు : సీఎం
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ స్టేడియం వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ సమీపంలో అంతర్జాతీయ స్టేడియం ఉంటుందని పేర్కొన్నారు. బ్యాగరి కంచెలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐతో చర్చించామని వెల్లడించారు. క్రీడల కోసం బడ్జెట్‌లో రూ.321 కోట్లు కేటాయించామని తెలిపారు. చదువులోనే కాదని, క్రీడల్లో రాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుందని కుటుంబ గౌరవం పెరుగుతుందని వ్యాఖ్యానించారు.
ఎల్‌బీ స్టేడియంలో క్రీడలు తగ్గాయి, రాజకీయ కార్యకలాపాలు పెరిగాయి : సీఎం
యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, సరూర్‌నగర్ స్టేడియాల్లో క్రీడలు తగ్గాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎల్బీ స్టేడియంలో క్రీడలు తగ్గాయని, రాజకీయ కార్యకలాపాలు పెరిగాయని వివరించారు.
-
LIVE || Third Session of Third Telangana Legislative Assembly Day -09 https://t.co/TIrAoV5J7t
— Revanth Reddy (@revanth_anumula) August 2, 2024
రాష్ట్రంలో త్వరలో క్రీడా విధానం తెస్తున్నాం : సీఎం రేవంత్‌రెడ్డి
నిఖత్ జరీన్‌కు ఆర్థిక సాయం చేశామని, ఇంటి స్థలం కేటాయించామని సీఎం రేవంత్ తెలిపారు. సిరాజ్‌కు విద్యార్హత లేకున్నా గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో క్రీడా విధానం తెస్తున్నామని, హరియాణా క్రీడా విధానం పరిశీలిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో మరో క్రికెట్ మైదానం వస్తుందని వెల్లడించారు.
నిఖత్, సిరాజ్ రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తెచ్చారు : ఎంఐఎం
నిఖత్, సిరాజ్ రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తెచ్చారని ఎంఐఎం సభ్యులు పేర్కొన్నారు.
డామైదానం ఏర్పాటు చేయాలి : బీజేపీ సభ్యులు
ప్రతి మండల కేంద్రంలో క్రీడామైదానం ఏర్పాటు చేయాలని బీజేపీ సభ్యులు సూచించారు.
బిల్లుకు మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం
ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు మద్దతు తెలుపుతున్నామని బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం ప్రకటించాయి.
సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతున్నాం : భట్టి
రాష్ట్రానికి పేరు తెచ్చిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్‌కు గ్రూప్-1 ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతున్నామని వ్యాఖ్యానించారు.
టీజీ, టీఎస్ అంటూ పేరు ఎందుకు మారుస్తున్నారో : ఎంఐఎం
అక్రోనిమ్ల మార్పుపై ప్రజలపై ఎలాంటి ఉపయోగం లేదని ఎంఐఎం అభిప్రాయపడింది. టీజీ, టీఎస్ అంటూ పేరు ఎందుకు మారుస్తున్నారో తెలియడం లేదని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు మద్దతిస్తున్నాం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు చట్టాల్లో మార్పులు చేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు మద్దతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. టీజీ నుంచి టీఎస్‌గా మార్చే బిల్లుకు మద్దతిస్తున్నామని చెప్పారు.
బిల్లు ఆమోదం
సివిల్ కోర్టుల సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన శాసనసభ
సైబర్ క్రైం సంబంధించిన కొత్త చట్టాలు తెస్తాం : మంత్రి శ్రీధర్ బాబు
సైబర్ క్రైం సంబంధించిన కొత్త చట్టాలు తెస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సభను అప్రతిష్ఠ పలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కోర్టుల్లో ఖాళీగా ఉన్న సిబ్బందిని భర్తీ చేయాలి : ఏలేటి మహేశ్వరరెడ్డి
జిల్లా కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని ఏలేటి మహేశ్వరరెడ్డి తెలిపారు. కోర్టుల్లో ఖాళీగా ఉన్న సిబ్బందిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును సమర్థిస్తున్నామని పేర్కొన్నారు.
మా సభ్యులు ఎవరూ వీడియోలు తీయలేదు : కేటీఆర్
ప్రజల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా కొన్ని చట్టాలు వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. తమ సభ్యులు ఎవరూ వీడియోలు తీయలేదని తెలిపారు. అసెంబ్లీలోని కెమెరాలన్నీ స్పీకర్ అధీనంలోనే ఉంటాయని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం జరుగుతోందని, ప్రధానులు, సీఎంల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వీడియోలు వస్తున్నాయని తెలిపారు.
మంత్రిపైనా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు : పొన్నం
మన రాష్ట్రంలో భావవ్యక్తీకరణకు వచ్చిన ఇబ్బందేమీ లేదని పొన్నం అన్నారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మంత్రిపైనా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఫేక్ వీడియోలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సభలో జరిగిన కార్యక్రమాలపై వీడియోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అత్యాచారాలు చేసిన వారికి త్వరగా శిక్షపడాలి : కేటీఆర్
కొన్ని విషయాల్లో అందరూ కలిసి పనిచేయాలని కేటీఆర్ సూచించారు. అత్యాచారాలు, సైబర్‌క్రైమ్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. అత్యాచారాలు చేసిన వారికి త్వరగా శిక్షపడాలని డిమాండ్ చేశారు. బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందనే భరోసా ఇవ్వాలని పేర్కొన్నారు. సైబర్‌క్రైమ్ బాధితులకు సత్వర న్యాయం అందాలని, సైబర్‌క్రైమ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరగా భర్తీ చేయాలని తెలిపారు. కేంద్ర చట్టాల విషయంలో రాష్ట్రప్రభుత్వం తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే చట్టాలు తేవడం మంచిదికాదని హెచ్చిరించారు.