TDP Leaders Reaction on YS Sunitha Comments: సీఎం జగన్‌పై వైఎస్ సునీత (YS Sunitha) వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ, జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ప్రశ్నలు కురిపిస్తున్నారు. తాజాగా వివేకా హత్య కేసులో సీఎం జగన్ పాత్రపై విచారణ జరిపించాలని తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత వేసిన ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడేలే చేసేందుకు పోరాడుతున్న సునీతారెడ్డిపై కేసులు పెట్టడం దారుణమన్నారు. సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. సునీతారెడ్డికి ఆంధ్ర ప్రజలు మద్దతు ఉందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలి అని కోరారు. వివేకా హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని పేర్కొన్నారు. వివేకా చనిపోయిన తర్వాత జగన్ చాలా స్పష్టంగా గొడ్డలి పోటుతో చనిపోయారన్నారని అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపించాలన్న జగన్, సీఎం అయిన తర్వాత ఎందుకు వద్దన్నారు అని నిలదీశారు.
జగన్ పార్టీకి ఓటేయొద్దు- మా నాన్నని వాళ్లే చంపారు : వైఎస్ సునీత
సునీతకు సీఎం జగన్ తీరని అన్యాయం చేశారు: వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతకు సీఎం జగన్ తీరని అన్యాయం చేశారని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. జిల్లాలో ఆయన చేపట్టిన సకలజనుల పాదయాత్ర పదో రోజుకు చేరుకుంది. పాదయాత్రలో ఆయన సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇరగవరం మండలం రేలంగిలో ఆయన పదోరోజు యాత్ర ప్రారంభించారు. టీడీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాదయాత్రలో పెద్దఎత్తున పాల్గొన్నారు. అడుగడుగునా రాధాకృష్ణకు ఘన స్వాగతం లభించింది.
జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని మండిపడ్డారు. సొంత చెల్లిని, తల్లిని కూడా బయటికి గెంటేసిన జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ సునీతకు సైతం అన్యాయం చేశారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని చెప్పారు. అధికారంలోకి రాకముందు సీబీఐ విచారణ జరగాలని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ విస్మరించారని ఆరోపించారు.
సొంత కుటుంబ సభ్యులకు న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఎటువంటి న్యాయం చేయగలుగుతారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలను తాకట్టు పెట్టి రాబోయే రెండు దశాబ్దాల వరకు ప్రజలను అప్పులు పాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాధాకృష్ణ పేర్కొన్నారు.
నా అక్కచెల్లెమ్మలు అంటూ ఊదరగొట్టే జగన్ సొంత చెల్లికి న్యాయం చేయలేకపోతున్నారు : సత్యకుమార్
ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించాలి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్ పాత్ర ఉంటుందని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆరోపించారు. వివేకానంద కుమార్తె సునీతకు రాష్ట్ర ప్రజలంతా సంఘీభావం తెలవాలని కోరారు. ఈ హత్య కేసులో జగన్ తీరుపై అనుమానంగా ఉందని రమణమూర్తి వెల్లడించారు. ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి కొట్టాలని సూచించారు.