ETV Bharat / state

కూటమి అనూహ్య విజయం - హర్షం వ్యక్తం చేస్తున్న నాయకులు - tdp leaders on victory - TDP LEADERS ON VICTORY

TDP Leaders on Victory : ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం అనూహ్యమైన విజయాన్ని కైవసం చేసుకుంది. కలలో కూడా ఊహించని విధంగా విజయం సాధించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ క్రమంలో కొంత మంది నాయకులు తమ ఆనందాన్ని ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

tdp_leaders_victory
tdp_leaders_victory (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 5, 2024, 3:51 PM IST

Atmakuru MLA Anam Ramanaraya Reddy : చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు కూటమికి అఖండ విజయం ఇచ్చారని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగెత్తిస్తామని తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం సృష్టించిందని జన చైతన్య వేదిక నాయకులు అభిప్రాయపడ్డారు. జగన్‌ నియంతృత్వ పోకడల వల్లే వైఎస్సార్సీపీ ఘోర ఓటమి చవి చూసిందని తెలిపారు. ఐదేళ్లలో ఇష్టారీతిన వ్యవస్థలను ధ్వంసం చేసినందుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని హర్షం వ్యక్తం చేశారు.

లోక్‌సభ స్థానాల్లోనూ దూసుకుపోయిన కూటమి - 21స్థానాల్లో విజయదుందుభి - Loksabha Election Result In AP

MLA Varla Kumarraja : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జన్మస్థలమైన పామర్రులో టీడీపీ జెండా రెపరెపలాడించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా అన్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు అన్న దానికి తన గెలుపే నిదర్శమని అన్నారు.

Inturi Nageswara Rao : నెల్లూరు జిల్లా కందుకూరులో 20 ఏళ్ళ తర్వాత తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. పార్టీ కార్యకర్తగా ఉన్న ఇంటూరి నాగేశ్వరరావును అభ్యర్థిగా ఎంపిక చేయడంతో టీడీపీ విజయ దుందుభి మోగింది. ఇంటూరి అత్యధిక మెజార్టీ రావడంతో శ్రేణులు సంబరాల్లో మునిగారు. వైఎస్సార్సీపీ అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు అభివృద్ధి కోసం చంద్రబాబు వైపు అడుగులేశారని నాగేశ్వరరావు తెలిపారు.

జనాగ్రహానికి నేలకరిచిన నియంత - కుప్పకూలిన జగన్‌ నిరంకుశ రాజ్యం - YSRCP Defeat In Assembly Elections

Julakanti Brahma Reddy : కూటమి ఘన విజయానికి వైఎస్సార్సీపీ అరాచక నియంతృత్వ పాలనే కారణమని మాచర్ల టీడీపీ అభ్యర్ధి జూలకంటి బ్రహ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో టీడీపీ హయాంలో రాష్ట్రం దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అధోః పాతాళానికి పడిపోయిందని అన్నారు. 20 ఏళ్లుగా అభివృద్ధి నోచుకోని పల్నాడు ప్రాంతాన్ని చంద్రబాబు స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.

MP Keshineni Chinni : వైఎస్సార్సీపీ అరాచకాలపై ప్రజల తిరుగుబాటు కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టిందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు. తన సోదరుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి కేశినేని నానిపై ఆయన ఘన విజయం సాధించారు. వైఎస్సార్సీపీపై ప్రజా వ్యతిరేకతను ముందే ఊహించామని పేర్కొన్నారు.

నోటి మాటలకు ఓటు దెబ్బ - రాజకీయ విమర్శ శ్రుతిమించితే భరించలేమని జనం తీర్పు - YSRCP Ministers Used Bad Words

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.