ETV Bharat / state

'చేతకానితనాన్ని ప్రజల మీదకు నెట్టేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనే' - TDP leader Nimmala Ramanaidu - TDP LEADER NIMMALA RAMANAIDU

TDP leader Nimmala Ramanaidu: ప్రజలు తనని మోసం చేశారని జగన్‌ మాట్లాడటం, ఆయన పెత్తందారీ తనానికి నిదర్శనమని తెలుగుదేశం పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. తన చేతకానితనాన్ని ప్రజల మీదకు నెట్టేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనేనని మండిపడ్డారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన తనకు ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని జగన్‌ తెలుసుకోవాలని హితవు పలికారు.

Nimmala Ramanaidu
Nimmala Ramanaidu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 5, 2024, 7:34 PM IST

TDP leader Nimmala Ramanaidu: ప్రజలు తనని మోసం చేశారంటూ వైఎస్ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు స్పందించారు. ప్రజలను మోసం చేసిన వ్యక్తికి అదే ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారని తెలిపారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన తనకు ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని జగన్‌ తెలుసుకోవాలని హితవు పలికారు.

నిమ్మల రామానాయుడు (ETV Bharat)

జగన్ వ్యాఖ్యలకు రామానాయుడు కౌంటర్: ప్రజలు తనని మోసం చేశారన్నట్లుగా జగన్ మాట్లాడటం అతని ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనమని నిమ్మల రామానాయుడు విమర్శించారు. తన చేతకానితనాన్ని ప్రజలమీదికి నెట్టేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనేనేమోనని ఆయన మండిపడ్డారు. అమలు చేయని మేనిఫెస్టోని 99శాతం అమలు చేసినట్లు పదే పదే అబద్ధాలు చెప్తే నిజం తెలుసుకోని అవివేకులు ప్రజలు కాదని అన్నారు. కనీస పరిపాలన చేతకాక ధరల పెంపుతో ప్రజల నడ్డి విరిచినందుకు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలుసుకోవాలని హితవుపలికారు. మోసం, విధ్వంసం, దాడులు, పన్నుల భారం వంటి వాటితో విసిగిపోయిన ప్రజలు కసిగా ఇచ్చిన తీర్పు ఇదని అన్నారు. తన పాలనా వైఫల్యాలు ఇప్పటికీ గుర్తించకుండా ప్రజలమీదే నిందలు మోపితే ఇక జీవితంలో జగన్ బాగుపడడని రామానాయుడు ధ్వజమెత్తారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన జగన్ కు ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని తెలుసుకోవాలని హితవు పలికారు. నియంతృత్వ పాలనను ప్రజలు తిరస్కరించారని తెలిపారు. అవ్వాతాతలు, అక్కా చెల్లెళ్లు జగన్ ను మోసం చేసినట్లు వైఎస్సార్సీపీ సోషల్​ మీడియా దుష్ప్రచారం చేస్తుందన్నారు.
ప్రజల నుంచి వెల్లువెత్తిన విమర్శలు - సీఐడీ ఏడీజీ సంజయ్ సెలవు రద్దు - Government Cancelled CID Chief Sanjay Leave

ఓటమిపై స్పందించిన వైఎస్ జగన్: ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇలాంటి ఫలితాలు ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మ్యానిఫెస్టో హామీలను 99 శాతం అమలు చేసినా ఇలాంటి ఫలితాలు రావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కచెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్థం కావడం లేదన్నారు. పింఛన్లు అందుకున్న అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నానని తెలిపిన జగన్, పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యామని తెలిపారు. 54 లక్షలమంది రైతులకు పెట్టుబడి సాయం చేశామని తెలిపారు. రైతన్నలను అన్నిరకాలుగా ఆదుకున్నామని వెల్లండిచారు. అరకోటి రైతన్నల ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదన్నారు. ఆటో డ్రైవర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు అండగా ఉన్నామని తెలిపారు. వారందరి ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని కోట్ల మందికి ఎంతో మేలు చేసినా ఓడిపోయామని పేర్కొన్నారు. పేదపిల్లల చదువుల కోసం ఎంతో సాయం చేశామన్నారు. గ్రామాల్లో ఎన్నడూ చూడని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు.

చంద్రబాబును కలిసిన సీఎస్​ జవహర్​రెడ్డి - బాబు ఇంటికి టీడీపీ అభ్యర్థులు - AP CS Jawahar Reddy Meets Chandrababu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.